ఇవాళ నా ఇల్లు కూలిపోయింది… రేపు నీ అహంకారం కూలిపోతుంది
- ముంబయిలో కంగనా కార్యాలయం కూల్చివేత
- పై ప్రతీకారం తీర్చుకున్నావా?
- మనం కాలచక్రంలో ఉన్నామని గుర్తుంచుకోవాలి
ముంబయిలోని తన కార్యాలయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం కూల్చివేయడంపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై ఆమె నిప్పులు కురిపించారు. “ఉద్ధవ్ థాకరే… ఏమనుకుంటున్నావ్?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. “సినీ మాఫియాతో చేతులు కలిపి నా ఇల్లు కూల్చేసి నాపై ప్రతీకారం తీర్చుకున్నావా? ఇవాళ నా ఇల్లు కూలిపోయింది… రేపు నీ అహంకారం కూలిపోతుంది” అంటూ నిప్పులు చెరిగారు.
“మనం కాలచక్రంలో ఉన్నామని గుర్తుంచుకోవాలి. అది ఎప్పటికీ ఒకచోట ఆగదు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం వెలువరించారు. “ఇలాగైనా నువ్వు నాకో మేలు చేశావు. కశ్మీరీ పండిట్లు ఎందుకు బాధలు పడుతున్నారో అర్థమైంది. ఇవాళ అది నాకు అనుభవంలోకి వచ్చింది. ఇవాళ దేశానికో మాటిస్తున్నాను… అయోధ్య మీదనే కాదు కశ్మీరీలపైనా సినిమా తీస్తాను” అంటూ కంగనా ప్రతిజ్ఞ చేశారు.
Tags: Kangana Ranaut, Udhav Thackeray, Maharashtra, Mumbai, Bollywood