- అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కేటీఆర్ నివాళి
- రాజ్యాంగంలోని ఆర్టికల్ 3తోనే తెలంగాణ ఏర్పాటు
- తెలంగాణకు బాట వేసింది అంబేద్కరేనన్న కేటీఆర్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ గురువారం నివాళి అర్పించారు. బాబా సాహెబ్ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ చిత్ర పటం ముందు ఆయనకు కేటీఆర్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఓ ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యేందుకు అంబేద్కర్ బాట వేశారని ప్రస్తావించిన కేటీఆర్.. అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని తెలిపారు. అంతేకాకుండా జీవితం సుదీర్ఘంగా ఉండేదానికంటే గొప్పగా ఉండటమే మేలంటూ అంబేద్కర్ చెప్పిన మాటను కూడా కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.