- ఆవిష్కరించిన ఓబెన్ ఎలక్ట్రిక్
- ఆన్ లైన్ లో బుకింగ్ లు ఆరంభం
- రూ.999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు
- ప్రకటించిన బెంగళూరు స్టార్టప్
మోటార్, బ్యాటరీ, కంట్రోలర్, డ్రైవ్ ట్రెయిన్, డిజైన్ కు సంబంధించి వినూత్నమైన ఫీచర్లు ఉన్నాయని, వీటి పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నామని ఓబెన్ ఎలక్ట్రిక్ తెలిపింది. సమీపంలోని చార్జింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకునే సదుపాయం, బ్యాటరీ దొంగల పాలు కాకుండా రక్షించే వ్యవస్థ, ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.
ఎలక్ట్రిక్ స్కూటర్ల పరంగా మార్కెట్లో చాలా ఆప్షన్లు ఉన్నా, బైక్ ల విషయంలో వినియోగదారుల ముందు తక్కువ ఎంపికలే ఉన్నాయి. ఈ క్రమంలో స్పోర్టీ లుక్ తో, అత్యాధునిక ఫీచర్లతో రోర్ రావడం విశేషం.