Header Top logo

You told me what to do నేనేం చెయ్యాలో చెప్పింది నువ్

#స్ఫూర్తి:

You told me what to do
నేనేం చెయ్యాలో చెప్పింది నువ్

నేనేం చెయ్యాలోనని
వెతుకులాడుతూంటే
నేనేం చెయ్యాలో చెప్పింది నువ్వే..

శ్రమైక జీవన సౌందర్యాలెన్నో..
ఆ చెమట చుక్కల చాటున
ఆవిరైన కన్నీటి బొట్టుల కదలెన్నో.

అరగక పరుగులు తీస్తున్న నేలపై
పస్తులతో పూట గడుపుతూ
ఆకలి బాధలతో ఎండిన డొక్కలెన్నో..

పండుగంటే పాయసమని
గంజి నీళ్ళు దొరికినా చాలని
గతిలేని చోట మొక్కే చేతులెన్నో..

దేవుడికి కూడా ధరే
గొప్పోడు గర్భగుడిలో ఉంటే
పేదోడి పదడుగుల దూరంలో..

రేపటి రోజుకోసం పోరాటం
ఏదో జరుగుద్దనే ఆరాటం
ఇది మట్టి మనుషుల జీవన విధానం..

✍️సుబ్బుఆర్వీ

పిక్ #సామాన్యశాస్త్రం గ్యాలరీ నుండి

Leave A Reply

Your email address will not be published.

Breaking