Header Top logo

You deserve to be criticized విమర్శించే యోగ్యత నీకెక్కడిది…!

You deserve to be criticized

కమ్యూనిస్టు అమరత్వాన్ని
విమర్శించే యోగ్యత నీకెక్కడిది…!

అవును నీవు కమ్యూనిస్టు త్యాగాన్ని తూలనాడుతున్నావంటే నీకు ఇంకా ఏదో ఎజెండా ఉండాలి..

నీవు కమ్యూనిస్టు అమరత్వాన్నిఅవహేళన చేస్తున్నావంటే నీకు కమ్యూనిస్టు గురించి తెలియకపోవచ్చు

నీవు నిజమైన కమ్యూనిస్టుగా ఒక్క రోజు బతికి చూడు కమ్యూనిస్టు అనేవాడు విశ్వ మానవతా విలువలు కలిగిన నూతన మానవుడు కనిపిస్తాడు

విదేశీ, స్వదేశీ గుత్తపెట్టుబడిదార్ల ఇనుప పాదగట్టాలకిందా నలిగిపోయిన 90% ఉత్పత్తి జాతులైన కార్మిక వర్గం కష్టాలు, కడగండ్ల విముక్తి కోసం
నిత్యం నిద్రహరాలు లేకుండా పరితపించే వాడు కమ్యూనిస్టు.

ఒక్క కులం కుట్రను విస్మరించినందుకే కదా ఆధిపత్య వాదుల తాబేదార్లు సైతం
విమర్శల దాడిని మౌనంగా భరిస్తూ తన ప్రజల ఎజెండా నుండి వెనుదిరగని వాడు కమ్యూనిస్టు.

త్యాగాల వనంలో విరబూసిన ఎర్ర మందారాలు
లక్షలాదిగా నేలరాలినప్పుడు.

పుడమి తల్లి పురిటి నొప్పులతో నూతన మానవుడికి జన్మనిచ్చింది. అతనే కమ్యూనిస్టు.

నీకు.. సాక్ష్యం ఇదిగో చూడు ప్రపంచ మానవ జాతికి ఫాసస్టు ప్రమాదం ఏర్పడినపుడు కోట్లాది మంది ఎర్ర సైనికుల కవాతకు మట్టికర్చాడు ఫాసిస్టు హిట్లర్.

దేశీయంగా చూసినప్పుడు శ్రీకాకుళం గిరిజన కొండల్లో మైదానపు లంబాడి తండల్లో ఆదివాసీ తూడుం దెబ్బల్లో

జగిత్యాల జైత్రయాత్ర,కరీంనగర్ కధనరంగంలో కులాధిపత్యాన్ని కూల్చినప్పుడు గోదావరి లోయ బహుజన రైతాంగ ప్రతిఘటనలో కమ్యూనిస్టు తెగువ కనిపిస్తుంది.

రైతు కూలీలా కూలి పోరాటాల్లో బహుజన బతుకుల విముక్తి పోరాట జంగ్ సైరన్ ఎర్రెఎర్రని జెండాల్లో ఎగిసిపడే బిగిసిన పిడికిలే కమ్యూనిస్టు

కన్న తల్లిదండ్రులను ఉన్న ఊరును వదిలి దశాబ్దాలుగా ప్రజ నోట్లో నాలుకై, 90% తమ తమ రాజకీయ నిర్మాణాల్లోని నాయకులు, కార్యకర్తలతో
కుల మత రహిత వివాహ వ్యవస్థను ప్రతిబింబించే వాడు కమ్యూనిస్టు.

కమ్యూనిస్టును విమర్శించాలంటే కేవలం నిజమైన అంబెడ్కరిస్టుకు మాత్రమే సాధ్యం

భూములు, పరిశ్రమలు జాతీయం చేయమని పెట్టుబడిదార్లు మనువాదులు  నా శత్రువులని

అంబెడ్కర్ చెప్పిన విషయాన్ని పోరాట జెండా ఎజెండా ఏ అంబెడ్కరిస్టు దగ్గర ఉంటుందో

వారు మాత్రమే కమ్యూనిస్టుల ఆచరణపై రాజకీయ విమర్శలు చేయగలరేతప్ప వారి త్యాగాలపై కాదు…

అయినా సరే తూలనాడుతున్నావంటే నీకు ఏదో ఎజెండా ఉండాలి సుమీ…

★★★
ఇటీవల కాలంలో మావోయిస్టు అగ్రనేత ఆర్ కే మృతి చెందిన సందర్భంగా కొందరు అగ్రకు నక్సలైట్ల త్యాగాలపై బహుజన నక్సలైట్ల త్యాగాలపై చేస్తున్నవిమర్శలకు ఇది నా స్పందన అయితే ఆర్ కే బ్రాహ్మణుడిగా పుట్టి ఉండవచ్చుఆయన చనిపోయింది మాత్రం బహుజనుడిగా
అందులోనూ ఆదివాసీగా మరణించారు.

——————————–
కమ్యూనిస్టుల ఆచరణపై విమర్శలు చేయవచ్చు నేను, నిత్యం నా రచనల ద్వారా అదే పని చేస్తున్న కానీ నా విమర్శలు మిత్రుడి వైఖరి మారడం కోసం తప్ప శత్రువుకు ఉపయోగం పడడానికి కాదు. అయితే మావోయిస్టులు ఇప్పటికైన భారత రాజ్యాంగ రక్షణ కోసం, పార్లమెంటరీ రాజకీయాలను సైతం పోరాట కేంద్రంగా ఎన్నుకోవాలని నా సూచన…

Dandi Venkati

దండి వెంకట్, రచయిత
బహుజన లెఫ్ట్ పార్టీ-BLP తెలంగాణ రాష్ట్ర కమిటీ
వర్కింగ్ ప్రెసిడెంట్, హైదరాబాద్

Leave A Reply

Your email address will not be published.

Breaking