Header Top logo

Yes I AM MUSLIM ఔను నేను ముస్లీం

Yes I AM MUSLIM
ఔను నేను ముస్లీం

అవును
ఇప్పుడు నా స్మరణ
అల్లాహు అక్బర్
ఇదే నా వుజూ
ఇదే నా తజ్బీ
ఇదే నా సజ్దా

ఓంకార నాదం ధ్వనించేది ఇదే కదా
అహింసా పరమో ధర్మః
ప్రార్థన ఎక్కడైతేనేం?
భాష ఏదైతేనేం?
సర్వాంతర్యామికి అందనిదా?

నుదుట బొట్టు
పాపిట సిందూరం
ఉత్తరాన ఘూంఘట్
దక్షిణాన పైట చెంగు
అయిదు వేళ్ళ మాదిరి
అనేకరూపుల ఆహార్యం నీది

నేను ముస్లింను
భారత పుత్రికను
రాజ్యాంగపు స్వేచ్ఛను
అస్థిత్వపు సవాలు చేస్తే
వడిసెల రాయినవుతా
బుర్ఖా తొడుగుతాను
హిజాబ్ చుడతా
అల్లాహు అక్బర్
ధిక్కార ప్రతీకనౌతా

ఒంటరిని చేసే వ్యూహం నీదైతే
పిడికిలెత్తి నినదించే నిబ్బరం నేను
మూకుమ్మడి దాడి నీదైతే
గళమెత్తి గర్జించే ఆడ సింహం నేను
అవును
నేను ముస్లింను

నేను ముస్లింను
ఆత్మ గౌరవం నా చిరునామా
నా వాక్కు నా హక్కు
నేను మౌనంగా ఉండలేను
నేను మాట్లాడతాను
నేను ఆసిఫాను
నేను షబానాను
నేను జకియాను
నేను సనవ్వర్ ఖాతూన్
నేను నుస్రత్ పర్వీన్
నేనూ ముస్కాన్ ను

అల్లాహు అక్బర్
నినదిస్తూనే ఉంటాను
తల్లాఖ్ ల పర్వంలో
ఎన్నికల కన్నీరు ఇంకేదాకా
రాజకీయ జిత్తుల్లో
అదృశ్యులైన నజీబ్ లు దొరికేదాకా
హిజాబ్ దాష్టీకం అంతమయ్యేదాకా

అల్లాహు అక్బర్
అల్లాహు అక్బర్
అల్లాహు అక్బర్!

Yes I AM MUSLIM ఔను నేను ముస్లీం

-నస్రీన్ ఖాన్
08.02.2022

Leave A Reply

Your email address will not be published.

Breaking