Header Top logo

What a dumb carol Marx కారల్ మార్క్స్ అంత dumb ఏంటి

What a dumb carol Marx

కారల్ మార్క్స్ అంత dumb ఏంటి

మొన్నో రోజు మా అమ్మాయి ఫోన్ చేసి  “కారల్ మార్క్స్ అంత dumb ఏంటి, డాడ్!” అనేసింది. నేను అవాక్కయ్యాను. లోలోపల “ఈ అమ్మాయి యూనివర్శిటీకి వెళ్ళాక పెట్టుబడిదారీ ఆలోచనల ప్రభావానికి లోనవలేదు కదా!” అని దిగులేసింది. ఆమె వాఖ్యను అవుననడానికీ, కాదనడానికీ నా దగ్గర అంత జ్ఞానం లేదాయె! కమ్యూనిజం గురించి గానీ, కారల్ మార్క్స్ గురించి గానీ నాకు రవ్వంత కూడా తెలియదు. ఏమీ తెలియక పోయినా ఆయన ప్రపంచమంతా ఓ గొప్ప జ్ఞానజ్యోతిని వెలిగించిన వాడని అందరూ అంటుండగా వింటున్నాను. అందుకని నా అజ్ఞానాన్ని ప్రదర్శించకుండా “ఎందుకమ్మా అలా అనేశావ్?” అని తననుంచే సమాధానం రాబడదామని అడిగా.

“శ్రామికులు, పెట్టుబడిదారులు అనే రెండు వర్గాలే అంటాడు గాని.. జాతి, మతం అనేవి మనుషుల్ని విభజిస్తాయని చెప్పలేదే! మరీ ఇంత dumb!” అంది. తెలియని సబ్జెక్టు గురించి నేనెక్కువ మాట్లాడదల్చుకోలేదు. “మాట్లాడని వాటిని బట్టి dumb అని తేల్చడం కంటే, మాట్లాడిన వాటిని బట్టి గొప్పవాడని అనుకోవచ్చు కదా!” అన్నాను.

Karl Marx 1

“అంతేలే.. కానీ కులం, మతం విభజన అసలు ప్రభావం చూపదనుకోవడం ఆశ్చర్యకరం!” అంది.
“ఏం చేద్దాం అది ప్రభావం చూపిస్తుందని గొంతు చించుకొని అరిచిన అంబేడ్కర్ భారతద్దేశంలో పుట్టాడు మరి!” అన్నాను. జైభీమ్

(ఇది కల్పన కాదు. అచ్చంగా మామధ్య జరిగిన సంభాషణ అది!)

Prasad charasala writer

Prasad charasala, Writer

1 Comment
  1. Ashok says

    కులం, మతం విభజన అసలు ప్రభావం చూపదని కారల్ మార్క్స్ అనలేదు. మార్క్స్ గురించి మీ అమ్మాయికి తెలియకపోవచ్చు

Leave A Reply

Your email address will not be published.

Breaking