Undu Cinema Review ఉండు సినీమీ రివ్యూ
Undu Cinema Review
ఉండు సినీమీ రివ్యూ
మావోయిజం..
మంచిదా చెడ్డదా అనే లోతుల్లోకి వెళ్లకుండా
ఆదివాసులను
తమ భూమి నుంచి గెంటేస్తున్న
ప్రభుత్వాల విధానాలను చెబుతూనే
సరైన ఆయుధాలు ఇవ్వకుండా
అదే ప్రభుత్వాలు పోలీసులను కూడా చంపుతున్నాయనే
ఒక సానుభూతి ని కలిగిస్తూ తీసిన సినిమా.
పేద ఆదివాసీలను
అక్రమ కేసుల్లో ఇరికించి మావోయిస్టుల పేరుతో చంపేస్తున్న వైనాన్ని కూడా చెప్పిన చక్కని సినిమా.
తాగునీరు లేక
కనీస వైద్యం లేక
చదువుకునే స్కూళ్లు లేక
పట్టించుకునే నాధుడు లేక
వారి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుని రాజకీయ నాయకులుగా చలామణి అయ్యే మైనింగ్ వ్యాపారుల అక్రమాలను,
ఎన్నికల్లో వాళ్లు చేసే దందాలను,
ఎన్నికల వ్యవస్థ ని చిన్నాభిన్నం చేసే వాళ్ల
దుర్మార్గ వైఖరులని ఎండగట్టిన సినిమా.
బూటకపు ఎన్నికలు బహిష్కరించాలని ఓవైపు మావోయిస్టులు చేసే వాదనకి,
ఇంకోవైపు అవే ఎన్నికలను తన పెత్తనానికి అనుకూలంగా మార్చుకోవడానికి
చేసే దుర్మార్గ ఎత్తుగడలను
వీటి మధ్యలో నలిగిపోయే, ఆదివాసుల,
పేద వర్గాలకు చెందిన పోలీసులు వేదనని సున్నితంగా చెప్పే సినిమా.
పోలీసు వ్యవస్థలో చేరినప్పటికీ
దళిత, గిరిజన, ఆదివాసులను అవమానంగా చూసే కొందరు పోలీసు అధికారుల వైఖరికి నిదర్శనంగా చూపిన సినిమా.
చాలా సున్నితమైన అంశాన్ని
సున్నితంగా తీసిన సినిమా.
ఎక్కడా బయాస్డ్గా అనిపించదు.
అమెజాన్ లో
ఊరికే… అలా చూద్దామని 10 గంటలకు కూర్చుంటే అయిపోయే వరకు నన్ను కట్టిపడేసిన సినిమా.