Header Top logo

This election is a challenge for political parties ఈ ఎన్నిక చాలేంజ్

 పొలిటికల్ పార్టీలకుహుజురాబాద్ ఉప ఎన్నిక చాలేంజ్..?

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ ప్రకటిత మయ్యింది . పొలిటికల్ పార్టీలు గెలుపు కోసం వ్యహాలతో ముందుకు కదిలాయి.  అక్టోబర్‌ 30న ఎన్నిక నిర్వహించనున్నట్లు నవంబర్‌ 2న కౌంటింగ్‌ చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగో ఉప ఎన్నిక ఇది . పిసిసి అద్యక్షులు రెండు చోట్ల గెలిచి హుజూర్‌నగర్‌లో రాజీనామా చేయగా మొదట ఉప ఎన్నిక జరిగింది . దుబ్బాకలో ఎం‌ఎల్‌ఏ రామలింగా రెడ్డి చనిపోగా జరిగిన ఎన్నికల్లో బి‌జే‌పి గెలిచింది. నాగార్జున సాగర్ లో కూడా ఇలాగే ఉప ఎన్నిక జరిగింది.ఈ మూడు స్థానాలలో పరిస్థితులు వేరు, హుజూర్‌ బాద్ లో వేరు . మూడు పార్టీలు , ముక్కోణపు పోటీ ఉన్నా నిజమైన పోటీ ఈటెల రాజేందర్ ,కెసిఆర్ ల మధ్యనే ఉంటుంది .బి‌జే‌పి అభ్యర్థి బీసీ అయినా ఇంకో రకంగా ఇది వెలమ రెడ్లకు మధ్య జరుగుతున్న పోటీ కూడా . ఆయన భార్య జమున రెడ్డి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జిగా రంగములోకి దిగారు .

ఈటల రాజేందర్‌ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో, బీజేపీ అభ్యర్థిగా ఆయనే బరిలోకి దిగారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజు , జూన్‌ 12 నుండి ప్రచారం మొదలుపెట్టారు . టీఆర్‌ఎస్‌ వారు పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించి, ఇంటింటి ప్రచారాన్ని మొదలు పెట్టారు. బీజేపీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించనే లేదు . కానీ ఇక్కడ బి‌జే‌పి పేరుతో కన్నా అబ్యర్థి ఈటెల పేరుతోనే ఎన్నికలు జరుగుతున్నాయి . పోటీ కే‌సి‌ఆర్ ఈటెలల మధ్యనే జరుగుతున్నది .
హుజూరాబాద్‌ ఎన్నిక ఫలితం ప్రభావం రెండేళ్లలో జరగబోయేమెయిన్స్ పరీక్షల వంటి అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుంది. ఆ మెయిన్ పరీక్షలకు ఇవి ప్రిలిమ్స్ వంటివి . టీఆర్‌ఎస్‌ గెలిస్తే పార్టీకి ఒరిగేది ఏమీ లేదు . పరువు పోకుండా మాత్రం ఉంటుంది .బీజేపీ గెలిస్తే టి‌ఆర్‌ఎస్,కే‌సి‌ఆర్ పరువు పోతుంది ,తెలంగాణలో బి‌జే‌పి అధికారానికి దగ్గరవుతున్నట్లు అవుతుంది . ఆ పార్టీలో ఉత్సాహం పెరుగుతుంది . ఏ రకంగా చూసినా కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిచే అవకాశాలు లేనే లేవు . ఇప్పటి వరకూ మూడు ఉప ఎన్నికల్లో కాంగ్రె్‌సు ఓడి పోయింది . గెలవాల్సిన సాగర్‌లోనే గెలవ లేదు . రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పార్టీకి కొంత ఊపు వచ్చిన మాట నిజమే కానీ అది వాపు లాంటిదే . ఇక్కడ పోటీ టి‌ఆర్‌ఎస్,బి‌జే‌పి ల మధ్యనే ఉంటుంది .

ఈటెల రాజీనామా తర్వాత కే‌సి‌ఆర్ గడిచిన నాలుగు నెలలుగా హుజూరాబాద్‌ నియోజకవర్గంపైనే దృష్టి పెట్టారు. అది సాధారణ ఎన్నిక అని పైకి చెబుతున్నా టీఆర్‌ఎస్‌ సర్వ శక్తులను ఒడ్డుతున్నది .చేయ గూడని పనులు చేస్తున్నది . నియోజకవర్గ పరిధిలో దళిత ఓటర్లు అత్యధికంగా 40 వేలకుపైగా ఉండడంతో వారి ఓట్ల కోసమే ‘దళిత బంధు’ పథకాన్ని ప్రకటించి , ఎవరు ఏమనుకుంటే మాకేమీ అన్నట్లు బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించింది . పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయడానికి హుజూరాబాద్‌నే ఎంపిక చేసింది. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు యుద్ద ప్రాతిపదికన మొదలయ్యాయి . పార్టీలో కొందరికి బడా నామినేషన్ పోస్టులను ప్రకటించారు .
టీఆర్‌ఎస్‌ ముఖ్యులు నాలుగు నెలలుగా దివరాత్రులు ప్రచారంలోనే ఉన్నారు. గ్రామ, మండల పార్టీ నాయకులతో సి‌ఎం స్వయంగా మాట్లాడుతున్నారు . స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఇతర పార్టీల నేతలు, కుల, వృత్తి సంఘాలు, ఉద్యోగులు సహా అన్ని వర్గాలను పిలిపించుకుని దన, కనక వస్తు, వాహానాలను ఇస్తూ వొట్ల కోసం పడ రాని పాట్లు పడుతున్నారు . బి‌జే‌పి పన్నా ప్రముఖ్ లతో సహా పార్టీ అనుబంద విభాగాల పెద్దలను రంగములోకి దింపింది .

ఐదు సార్లు గెలిచిన ఈటల రాజేందర్‌ సొంత ఇమేజ్‌తోపాటు పార్టీ అండతో గెలవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని 119 గ్రామాలకు గాను 80 గ్రామాల్లో పాదయాత్ర పూర్తి చేశారు. అస్వస్థత అయ్యే దాకా కాలికి బలపం కట్టుకునితిరిగారు . ఈటల రాజేందర్‌ వ్యక్తిగతంగానే కాకుండా తన రాజకీయ భవిష్యత్తు విషయంలో ఈ ఉ
ప ఎన్నికను చావో బతుకో అన్నట్లు భావిస్తున్నారు.
పార్టీ పరంగా బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పాదయాత్రలు, ఆత్మీయ సమ్మేళనాలు, ఇంటింటి ప్రచారం ముమ్మరం చేసింది. ప్రచారం చివరలో అమిత్‌ షా, జేపీ నడ్డాతోపాటు పలువురు జాతీయ నాయకులు రానున్నారు. గౌడ, కురవ యాదవులు, పెరిక, విశ్వకర్మల సమ్మేళనాలు జరిగాయి.మున్నూరుకాపు, పద్మశాలి, ముదిరాజ్‌ తదితర సమ్మేళనాలు నిర్వహించనున్నారు. ఈ సెగ్మెంట్‌ తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే ఉండడంతో బండి సంజయ్‌ కూడా ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకున్నారు.
ఇక్కడ కాంగ్రెస్ కు డిపాసిట్ దక్కించుకుని గౌరవనీయమైన వోట్లు తెచ్చుకోవడమే పెద్ద పని అవుతుంది . రేవంత్‌ రెడ్డి కి ఈ ఉప ఎన్నిక ‘ ఇజ్జత్ కా సవాల్‌ ‘ అవుతుంది . వైఎ్‌సఆర్‌టీపీని స్థాపించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూతురు షర్మిల ఎన్నికలో నిరుద్యోగులను పెద్దఎత్తున బరిలో దించడానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు .
హుజురాబాద్ ఓటర్లు కులాల వారీగా

రెడ్డి – 22,600

మున్నూర్కాపు -29,100
పద్మశాలి – 26,350
గౌడ్ – 24,200
ముదిరాజ్ – 23,220
యాదవ్ – 22,150
రాజక – 7,600
నాయి బ్రాహ్మణ – 3,300

మాదిగ – 42,600
మాల- 11,100
ఎస్టీలు – 4,220
మైనారిటీలు – 5,100
ఇతరులు – 12,050

Durgam Ravinder, Journalist

దుర్గం రవీందర్, సీనియర్ జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking