ఏపీ39టీవీన్యూస్
ఏప్రిల్ 26
గుడిబండ:- పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపుల యజమానులకు మరియు ప్రజలకు తెలియజేయడం ఏమనగా
అన్ని ప్రాంతాలలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో అన్ని వ్యాపార సంస్థలు మరియు ఛాంబర్ అఫ్ కామర్స్ వారు స్వచ్ఛందగా (ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల) వరకు మాత్రమే వ్యాపారాలు నిర్వహించుటకు అంగీకరించారు.
(1)..కావున ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతించడం జరిగింది.
(2)..కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ప్రజలు ఎవ్వరూ అనవసరంగా బయటకు రాకూడదని తెలియ చేస్తున్నాము.
(3)..అత్యవసరంగా బహిరంగ ప్రదేశాలకు వచ్చే వారు తప్పని సరిగా మాస్కులు
ధరించాలన్నారు.
(4)..బయటకు వచ్చినప్పుడు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి.
(5) ..ద్విచక్ర వాహనంపై ఒక్కరు మాత్రమే ప్రయాణించాలి.
(6)..కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేసేందుకు ప్రతి ఒక్కరూ తరచూ చేతులు శానిటైజ్ చేసుకుంటూ, అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించాలని ప్రజలను ?? కోరుతున్నాము.
.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియ జేస్తున్నాము.
ఇట్లు
జి.సుధాకర్ యాదవ్,
యస్.ఐ.గుడిబండ పోలీస్ స్టేషన్. అనంతపురం జిల్లా.
కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ