Header Top logo

కరోనాతో మరణించిన జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే 5 లక్షలు విడుదల చేయాలి

కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబం పిల్లలకు 10 లక్షలు డిపాజిట్ చేసి చదివించాలి

జర్నలిస్టుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తాం

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (A.P.W.J.U) కమిటీలు ఏర్పాటు చేస్తాం.

50లక్షల జర్నలిస్ట్ హెల్త్ భీమాను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి.

మచ్చా రామలింగారెడ్డి
రాష్ట్ర అధ్యక్షులు
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (A.P.W.J.U) డిమాండ్.

——————————————–

?కరోనా కల్లోలంతో రాష్ట్రంలో జర్నలిస్టులు పిట్టల్లా రాలిపోతున్నారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెంటనే సహాయం చేయాలని కోరారు.

?అనంతపురం R&B గెస్ట్ హౌస్ నందు ఈరోజు ఉదయం మచ్చా రామలింగారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు (A.P.W.J.U) విలేకరుల సమావేశంలో ప్రసంగించారు.

?మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని జర్నలిస్టులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని జర్నలిస్టుల సమస్యలపై అన్నారు.

?కరోనాతో మరణించిన జర్నలిస్టు కుటుంబానికి వెంటనే ప్రభుత్వం 5 లక్షల రూపాయలు విడుదల చేయాలని కోరారు.

?అక్రిడేషన్ తో సంబంధం లేకుండా మరణించిన వర్కింగ్ జర్నలిస్టులందరికి ఇవ్వాలని, అదేవిధంగా వారి పిల్లలకు 10 లక్షల రూపాయలు ఫిక్సడ్ డిపాజిట్ చేయాలని, మరణించిన జర్నలిస్టు పిల్లలని ప్రభుత్వమే చదివించాలని కోరారు.

?ప్రధానమంత్రి కళ్యాణ్ యోజన (PMKY) పథకం ద్వారా జర్నలిస్టులకు 50 లక్షల హెల్త్ బీమాను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి అని అన్నారు.

?రాష్ట్రంలో అక్రిడేషన్లు లేక జర్నలిస్టులు చాలా ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు వీలైనంత త్వరగా ప్రభుత్వం అక్రిడేషన్లు ఇచ్చే విధంగా A.P.W.J.U కృషి చేస్తుందని అన్నారు

?రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు అందరూ ఐకమత్యంగా ముందుకు వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కు అండగా ఉండాలని అందరూ కలిసి రావాలని మచ్చా సూచించారు.

?రాష్ట్రంలోని 13 జిల్లాలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (A.P.W.J.U) కమిటీలను ఏర్పాటు చేస్తామని మచ్చా రామలింగారెడ్డి అన్నారు.

?రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న జర్నలిస్టులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (A.P.W.J.U) కు అండగా ఉండాలని అన్నారు.

?రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులు, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న పత్రికలు, సీనియర్ జర్నలిస్టులకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్లో (A.P.W.J.U) అందరికీ స్థానం ఉంటుందని జిల్లాలో జర్నలిస్టుల సమస్యలపై పోరాడే వారితో కమిటీలు ఏర్పాటు చేస్తామని అందరూ సహకరించాలని మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు (A.P.W.J.U) విజ్ఞప్తి చేశారు.

?ఈ కార్యక్రమంలో వెంకటేష్, ఆంధ్రప్రభ రాజు, విజయరాజు, శివప్రసాద్, శ్రావణ్, షకీర్, జానీ, అది, ఉపేంద్ర, చలపతి, దాదు, సీనియర్ జర్నలిస్టులు తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking