ఏపీ39టీవీ న్యూస్
జూన్ 16
గుడిబండ :-రాష్ట్రంలో కోవిడ్ సోకి మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని. తెదేపా అధ్యక్షుడు మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి ఆదేశాలతో బుధవారం తెదేపా నాయకులు గుడిబండ తహసీల్దార్ మహబూబ్ ఫీరా కు వినతి పత్రం అందజేశారు. ఈ సంధర్భంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతు రాష్ట్రంలో ప్రజలకు కోవిడ్ సోకి ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యలకు రూ.25 లక్షలు, కోవిడ్ తో మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కోవిడ్ సోకిన వారికి రూ.10వేలు ఆర్థిక సాయం ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గుడిబండ జడ్పీటిసి అభ్యర్థి మంజునాథ్,గునేమోరుబాగల్ సర్పంచ్ నారాయణప్ప, సి.టీ. స్వామి , రామాంజనేయులు , మోరుబాగల్ ఎంపీటీసీ అభ్యర్థి శ్రీకాంత్, మంతేష్, తిప్పేస్వామి, జగన్నాథ్ తదితరులు పాల్గోన్నారు.
కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ