Something about Kandukuri.. కందుకూరి రమేష్ బాబు గురించి..
Something about Kandukuri ..
కందుకూరి రమేష్ బాబు గురించి..
సోషల్ మీడియా డామినెట్ చేస్తున్న నేటి కాలంలో చాలా మందిలో దాగిన ప్రతిభ వెలుగులోకి వస్తోంది. సుబ్బి ఆర్వీ గారు తన ఫేస్ బుక్ వాల్ పై కందుకూరి రమేష్ బాబుపై రాసిన స్టోరి చూసిన తరువాత ఈ స్టోరిని ‘‘జిందగీ’’లో ఇవ్వాలనిపించింది.
జర్నలిస్ట్… వాళ్ల వీళ్ల బాధలు.. మంచి-చెడు అన్నీ రాస్తాడు. కానీ.. తన బాధనలు రాసుకోలేడు. మరో జర్నలిస్ట్ కూడా రాయలేడు. కానీ.. సుబ్బు ఆర్వీ గారు హైదరాబాద్ (మణికొండ)లోని కందుకూరి రమేష్ బాబు గారి సామాన్య శాస్త్రం ఫోటో గ్యాలరీని సందర్శించి తన ఫీలింగ్ ను ఫేస్ బుక్ లో షేర్ చేసుకోవడం సంతోషమనిపించింది.
అభ్యుదయవాది..
కందుకూరి రమేష్ బాబు గారు అభ్యుదయవాది.. నైతిక విలువలకు నిలువెత్తు నిదర్శనం. కుళ్లి పోతున్న జర్నలిజంలో బతుకలేక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా ‘‘తెలుపు టీవీ’’ వెబ్ సైట్ లో మహానీయుల చరిత్రను పరిచయం చేస్తున్నారు.
కందుకూరి రమేష్ బాబు గారి లక్ష్యం సామాన్యులను పరిచయం చేయడమే. ఉరుకుల పరుగుల జీవితంలో కనిపించే సామాన్యుల దృష్యాలను కెమోరాలో బందించడం అతని హాబి. ఇగో.. సుబ్బు ఆర్వీ గారి పోస్ట్ ఇదే మీరే చదువండి.
– యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్
మనహీరోలు
సామాన్యశాస్త్రం-కందుకూరి రమేష్ బాబు
చూసే కనులుండాలే కానీ అద్భుతాలు చుట్టారా తచ్చాడతాయి. రాసే ఓపిక ఉండాలే కానీ ఆశ్చర్యాలు అబ్బురపరుస్తాయి. ఒడిసిపట్టే ఏకాగ్రత ఉండాలే కానీ ప్రతీ చిత్రం ఓ సందేశం. కవి అద్భుతంగా స్త్రీ ని, ప్రకృతిని వర్ణించినా, రచయిత కనులు చెమ్మగిల్లే వ్యాసం రాసినా, శిల్పి తన ఉలితో కల్లార్పని శిల్ప సౌందర్యాన్ని చెక్కినా, చిత్రకారుడు ఔరా అనిపించే పడుచు చిత్రానికి రంగులద్దినా, ఆమె ప్రేమని, బంధాన్ని ఆరాధిస్తూ పాట పాడినా.. ఆలోచన కలిగించే సాహిత్యం, కవిత్వం, రగిలే విప్లవం, పిడికిలెత్తిన పోరాటం, అందం ,ఆలోచన, వర్ణన, వివక్ష అన్నీ సామాన్యశాస్త్రంలో నువ్వు రోజూ చూసే అధ్యాయాలే. Something about Kandukuri.
సామాన్య శాస్త్రం :
అసామాన్య ప్రతిభగల వ్యక్తులు తన గొప్పదనాన్ని తన జీవనోపాధికి వినియోగిస్తూ తమలోని ప్రతిభను, వృత్తిని నిస్వార్థంగా భావితరాలకు అందిస్తూ ఏ మాత్రం ప్రశంస, పొగడ్త కోసం ఆరాటపడని పాత్రల సమూహారమే సామాన్యశాస్త్రం. శ్రమైక జీవన సౌందర్యాన్ని ఒకచోట చేర్చి సామాన్యునికి దేవాలయాన్ని నిర్మించి హీరోలుగా, సెలెబ్రిటీలుగా చెప్పుకుంటూ చెలామణి అవుతున్న వారిచేత నిజ జీవిత కథానాయికీ నాయకులకు మొక్కించిన అసామాన్యుడు మా మీసాల కెమెరా కర్ణుడు కందుకూరి రమేష్ బాబు.
సామాన్యశాస్త్రం సందర్శిస్తే..
జర్నలిస్టుగా, రైటర్ గా, ఫోటోగ్రాఫర్ గా ఎందరికో సుపరిచితమే అయినా వారి కళాత్మకత తెలియాలి అంటే సామాన్యశాస్త్రం సందర్శించాల్సిందే. అక్కడ జరిగే పండుగ సామాన్యుడిది. సామాన్యుని జీవితాన్ని ప్రతిబింబించే కోణాల సమూహారం రమేష్ గారి జీవితం. బాల్యం నుండే కెమెరాతో విడదీయని బంధం ఉన్నప్పటికీ పత్రికా రంగాల్లో, రచనల్లో సామాన్యునికి పెద్దపీట వేయాలని జర్నలిస్టుగా, రచయితగా మారారు. రియాల్టీ షోలు, వ్యాసాల్లో సామాన్యుడిని సెలెబ్రిటీగా నిలబెట్టారు. Something about Kandukuri.
దిన పత్రికలలో..
సాక్షి సలాం, మీ జయసుధ- N టీవీ, సామాన్యుడి ఆటోగ్రాఫ్ -తేజ టీవీ, సుప్రభాతం, సామాన్యాసాస్త్రం- సండే ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ సండే ఎడిటర్ గా ప్రింటింగ్, ఎలెక్ట్రానిక్ మీడియాలో తనదైన ముద్ర వేసి నేడు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా చేస్తున్నారు.
ఫోటో గ్రాఫర్ గా..
జర్నలిస్టుగా ,రచయితగా సాగుతున్న రోజుల్లో ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ రఘరాయ్ గారిని కలిసి వారితో ప్రయాణించిన తరుణంలో వారిలో పుట్టుకతో ఉన్న కెమెరా మరలా వారి జీవనంలో చేరింది. అప్పటి నుండి తెల్ల కాగితం నల్లక్షరం ఎలా పుతిప్పుకోనివ్వదో, తన విధానం దానికి అనుగుణంగా సామాన్యుడి బాధ్యత తీసుకుని నడిచే అంబాసిడర్గా నల్లచొక్కా, క్రీం కలర్ ప్యాంట్ , పైన ఒక టోపి( నార్మల్ ది కాదు), మెడలో తేలియా రుమాల్ , ఎప్పుడూ భుజంపై వేలాడుతూ వుండే కెమెరా తో గుబురైన మీసాలతో సహజత్వం ఎక్కడున్నా కనిపించే తీరుతో సామాన్యుడి శ్రేయస్సుకి ఓ రూపంగా మారారు. తలపై చేరిన టోపీ నుండి నల్ల చొక్కా, క్రీమ్ ప్యాంట్, తేలియా రుమాల్ ప్రతీదానికి ఒక ప్రత్యేక కారణం దాని వెనుక ఓ కథనం దాగి ఉన్నాయి.
జీవితంలో కనిపించే దృష్యాలే…
రోజు వారీ జీవనంలో కనిపించే అనేక అద్భుతాలను బంధించి సహజత్వం లోని విశిష్టతను అందరికి దర్శించే అవకాశం కోసం సామాన్య శాస్త్రం గ్యాలరీని తెరిచారు. గ్యాలరీని తెరిచినప్పటి నుండి ఇప్పటికి 13 ప్రదర్శనలు ఇచ్చారు. సామాన్యుడిని దేశంలోనే అత్యుత్తమమైన జహంగీర్ ఆర్ట్ గ్యాలరీకి చేర్చి ప్రదర్శన నిర్వహించిన ఘనత మన రమేష్ బాబు గారిది. సామాన్యుడు తనకి అన్నీ తెలిసే గుప్తంగా వున్నాడు. అసలైన సెలబ్రిటీ సామాన్యుడేనంటూ.., సామాన్యం, సహజం, ఆచరణా దృక్పథంతో పేరులేని పెద్దమనుషులే పాత్రలుగా సామాన్యుల పరిచయ వ్యాసాలు 12 పుస్తకాలుగా రాశారు.
సామాన్యుల జీవితాలే పుస్తకాలుగా..
కోళ్లమంగారం, లేపెన్స్యూర్, గణితం అతడి వేళ్ళమీద సంగీతం, బాలుడి శిల్పం, తొమ్మండుగురు, బతికిన కోడి, గడ్డిపరకలు, కల్లెపాటలో, నామవాచకం మొదలైనవి వారి పుస్తకాలు. తను రాసిన ఏభై ఒక్కమంది సామాన్యుల పరిచయ వ్యాసాల్లోని కథానాయకులను ఒక చోట చేర్చాలనే క్రమంలో ఒక తత్వాన్ని గ్రహించారు. ఆ వెతుకులాటలో తెలిసింది ఏంటంటే అందులో కొందరు మరణించివున్నారు. అప్పుడు రమేష్ గారు రాసిన ఒకమాట ” పాత్రలుగా సదరు వ్యక్తులు, వాటిని రాసిన రచయితా, ముందుమాట రాసిన వ్యక్తి, పుస్తక ప్రూఫ్ రీడర్లతో సహా అచ్చువేసిన వారెవరూ కూడా ఒకానొకరోజు ఉండరని అవగతమైంది.
మీరు సామాన్యులు కావడం ఎలా..?
ఆ అవగాహనకు నవ్వు కూడా వచ్చింది.” ఆ తత్వమే తరువాత ‘మీరు సామాన్యులు కావడం ఎలా..? అనే ( ఫిలాసఫీ) పుస్తకం రాయడానికి కారణం అయ్యిందని కూడా అనుకోవచ్చు. ఈ పుస్తకాలన్నీ మరలా రీ ప్రింట్ వేస్తే బాగుణ్ణు, సామాన్యుడికి మరింత మందిని చేరే అవకాశం కలుగుతుంది. ఆ బాధ్యత ఎవరైనా దాతలు తీసుకుంటే ఇంకా బాగుణ్ణు కదా. సామాన్యుడు మళ్ళీ మన కళ్లముందుకు పుస్తకరూపంలో ముస్తాబై వస్తాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ జగత్తులో బ్రతికిన మనుషులందరి గురించి ఓ లైబ్రరీ తెరవాలి అందులో మీ పరిచయ వ్యాసం తప్పక ఉండాలి. Celebrating the ordinary. ఇదే సామాన్య శాస్త్రానికి మూలం.
తెలుపు టీవీ వెబ్ సైట్..
రమేష్ బాబు గారు ఏ మాత్రం తడబడకుండా సామాన్య శాస్త్రం గ్యాలరీ నడుపుతూ , సామాన్యుడే సాధనగా, శోధనగా కవచకుండల కెమెరాతో సహజత్వాన్ని బంధిస్తూ తెలుపు అనే వెబ్సైట్, యూ ట్యూబ్ ఛానెల్ ని నడుపుతున్నారు. సామాన్యునికి పెద్దపీట వేసి, వారి జీవితాన్ని అర్పించిన అసామాన్య సేవకులు, దీని కోసం వారి వస్త్ర, జీవన విధానాన్నే మార్చుకున్న మహనీయులు కందుకూరి రమేష్ బాబు గారు. ప్రతిభ ప్రతిఒక్కరిలోనూ ఉంటుంది మరి ఆ ప్రతిభను దేనికి వినియోగిస్తావు అనేదే నీ వ్యక్తిత్వం. నీ దగ్గర వంద వున్నప్పుడు పది సాయం చేయడం సహజమే. కానీ, పది వున్నప్పుడు వంద సాయం చేద్దామని తపిస్తావు చూడు అదే అసలైన బాధ్యత. Something about Kandukuri.
సుబ్బుఆర్వీ, రచయిత
చిత్రం: PS బాబు
#మనహీరోలు #untoldstories #samanyasastram #సామాన్యశాస్త్రం #సుబ్బుఆర్వీ