Header Top logo

Sankranthi festival సంక్రాంతి పండుగ

Sankranthi festival
సంక్రాంతి పండుగ

Sankranthi festival

సంక్రాంతి నవ రాత్రి లాగా పద్ధతిగా 9 రోజుల పాటు చేసుకోము కానీ అంత కంటే ఎక్కువ రోజులు సాగే సంరంభం మాకైతే.ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒకటైన కరీంనగర్ మాది. ఆ రోజుల్లో కరీంనగర్లో అత్యంత కలర్ఫుల్ కాలనీల్లో మాది ముందుంటుందని నా ఫీలింగ్. అందుకు నా దగ్గర లాజిక్ ఉందండి. మా కాలనీ ఉమెన్స్ కాలేజ్ కి సరిగ్గా వెనక ఉంటుంది. అందువల్ల ఆడపిల్లలు ఎక్కువ. అందమైన భామలు, లేత మెరుపుతీగలు తిరిగే ప్రదేశం అన్నట్టు.

Sankranthi festival

ముగ్గుల సందడి మొదలు

ధనుర్మాసం మొదలు కాగానే సంక్రాంతి నెల పెట్టినట్టు. ఇక ముగ్గుల సందడి మొదలు. అప్పట్లో ఈ రంగుల ముగ్గులు చాలా తక్కువ. అందరూ చుక్కల ముగ్గుల నిపుణులే. పొద్దున్నే అమ్మాయిలు ముగ్గులు, అమ్మలు గుడికి వెళ్ళటం మా కాలనీ పరిపాటి. ఇక పిండి వంటలు ఆంగ్ల సంవ్సరాది నుంచే మొదలు. తెలంగాణ పిండి వంటల్లో ముఖ్యమైన వంటకం సకినాలు. ఇది ఒక్కరో ఇద్దరో కలిసి చేసుకోవటం కుదరదు. ఇందుకు వాడ కట్టున ఉన్న ఆడవాళ్ళు కలిసి schedule చేసుకోవాల్సిన బృహత్ కార్యక్రమము.

ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కో రోజు

వదినమ్మలంతా వంతుల వారీగా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కో రోజు చొప్పున పిండి వంటలు చేస్తూ పోతారు. ఇదంతా పండగకు ముందు జరిగే పండగ వంటి కార్యక్రమమే. వాడంతా పదిహేను ఇరవై రోజుల సందడి. పొద్దున్నే త్వరత్వరగా రోజు వారి పనులు పూర్తి చేసుకొని ఎవరో ఒకరిఇంట్లో సకినాలు చేసేందుకు వెళ్ళాలి మరి. 

అమ్మాయిలు కన్నె నోము

సకినాలు,అరిసెలు ముఖ్యమైనవి. గారెలు ( పప్పుచెక్కలు), మూరుకులు, కారప్పూస వంటివి ఆప్షనల్, ఇలా పిండి వంటల ప్రహసనం ఒక వైపు సాగుతుండగానే shopping అనే మరో ముఖ్యమైన ఘట్టం పూర్తి చెయ్యాల్సి ఉంటుంది. ఇందులో కొత్త బట్టల కంటే కూడా నోములు కొనటం అనేదే అత్యంత ముఖ్యమైనది. తెలంగాణ లో సంక్రాంతి నోము ప్రతీ ఒక్కరూ నోచుకుంటారు. కొంతమంది అమ్మాయిలు కూడా కన్నె నోము అని పెళ్లికి ముందరే సరదాగా నోము ప్రారంభం చేస్తారు కూడా.

ఒక్కో నోములో 13 వస్తువులు

ఇక పండగ రానే వచ్చింది. భోగి మంటల భోగం టౌన్లలో పెద్దగా కనిపించదు కానీ… ముగ్గుల ఆరాటం మాత్రం జాస్తి. భోగి రోజున మా అమ్మ మల్లె పందిరి ముగ్గు వెయ్యాలని అదే వేసేది. వాకిలి లో ఖాళీ కనిపించ కుండా ముగ్గు పరిచేయ్యాలి. భోగి రోజున ముగ్గే ప్రత్యేకత. తర్వాత రోజు సంక్రాంతి. అసలు పండగ అన్నమాట. ఈ రోజు వాకిట్లో ముగ్గు సిరిచాప. దుర్ముహూర్తం, రాహు కాలం వంటివి చూసుకొని నోము చేస్తారు. ఇదొక ప్రహసనం రెండు, నోములు, మూడు నోములు నోచుకుంటారు. శక్తిని బట్టి వాటి ఖర్చు ఉంటుంది. ఒక్కో నోములో 13 వస్తువులు ఉంటాయి. ఇలా నోముకున్న వస్తువులు ముత్తైదువులను పిలిచి పసుపు, కుంకుమతో పంచుతారు. మా కాలనీలో నోము నోచుకోని ఇల్లు లేనే లేదు. Sankranthi festival

నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు

కనుక సంక్రాంతి కి మా వాడ ఏడు రంగుల ఇంద్రధనస్సు కూడా ఈర్ష్య పడేంత అద్భుతంగా ఉండేది. సంక్రాంతి నాడు పంచే వారు కొందరైతే, ఎక్కువ మంది కనుమ రోజునే ఈ పేరంటాల కార్యక్రమం పెట్టుకునే వారు. సంక్రాంతి రోజున పసుపు గౌరమ్మ చేసి పూజ చేసి నోము పూర్తి చేస్తారు. ఆమెకు నువ్వులు బెల్లం కలిపి చేసిన ముద్దల్తో పాటు బియ్యంపిండి, బెల్లం కలిపి చేసిన చలిమిడి ముద్దలు కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. తెల్లవారి అంటే కనుమ రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి ముందు రోజు పూజలో ఉంచిన గౌరమ్మను పూసుకొని ఆమెకు సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. అన్నట్టు ఈ రోజు ముగ్గు రథం.

కల్లుతో అల్లుల్లకు మర్యాద

ఇక కనుమ నాడు nonveg తినే వారు తింటారు. తెలంగాణ స్పెషల్ కొంత మంది కల్లు కూడా తెప్పించి అల్లుల్లకు ప్రత్యేక మర్యాద చేస్తారు. ఆడవాళ్ళు పసుపు, కుంకుమ, గంధం, కొత్త చీరలు, పట్టు బట్టలతో ఘుమఘుమలాడుతూ, మిలమిల మెరుస్తూ ఆ శోభ చూడలే తప్ప చెప్పలేము. ఎక్కడో ఎవరో రాస్తే ఈ మధ్యే తెలంగాణలో పీడ పండగ అని చదివాను. నాకు చిన్నప్పటి నుంచీ ఈ సంక్రంతి శోభ మాత్రమే తెలుసు. మరి పీడ పండగ ఎందుకో అర్థం కాలేదు. అందుకే నా అనుభవాన్ని ఇలా చెప్పుకున్నాను.


 భవాని, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking