Header Top logo

Public service ప్రజా సేవాలో సురేష్ మంగల్ ఫ్యామిలీ

Public service

ప్రజా సేవాలో సురేష్ మంగల్ ఫ్యామిలీ

హైదరాబాద్ మహానగరంలో కూటికి లేనోళ్లు ఆకలితో అలమటించేవాళ్లు చాలామందే. కళ్ల ముందు ఆకలి అంటూ కేకలు వేసినా పట్టించుకునేవాళ్లు కొందరే. అలాంటి కొందరిలో ఏమీ ఆశించకుండా సేవా  చేసేవాళ్ల కోసం టార్చ్ లైట్ తో వెతికి పట్టుకోవాల్సిందే. కోట్ల రూపాయల డబ్బున్న ధనవంతుడి కంటే దానం చేసే వారే గొప్పవాళ్లు అనే సూక్తిని నిరూపించే వాళ్లున్నారు.

Public service ప్రజా సేవాలో సురేష్ మంగళ్ ఫ్యామిలీ

Public service ప్రజా సేవాలో సురేష్ మంగళ్ ఫ్యామిలీ

ఆకలితో అలమటించే పేదలు..

సికింద్రాబాద్ అల్వాల్ లోని పంచశీల కాలోనిలో హై టెన్షన్ రోడ్ .. మధ్యాహ్నం ఒంటి గంట అవుతే చాలు  ఎక్కడెక్కడి నుంచి వస్తారో తెలియదు. అక్కడ వందల మంది పోగైతారు. కొందరైతే గంట ముందే అక్కడ చేరుకుని ఆశతో ఆకలితో ఎదురు చూస్తుంటారు. పొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చి బతుకు వెళ్ల తీస్తున్నపేదలే  ఎక్కువగా కనిపిస్తారు. అన్నదానం చేసే ప్యామిలీ, వర్కర్స్  అన్నంతో అక్కడికి వస్తుంటే ఆ పేదల మొఖాల్లో వెలుగు కనిపిస్తాది. కడుపు నిండ అన్నం పెట్టి ఆకలి తీరుస్తున్న ఆ పెద్దాయనకు చేతులెత్తి దండం పెడుతారు ఆ పేదలు. Public service 

Public service

హర్యాన నుంచి బిజినెస్ కోసం..

సురేష్ మంగల్ ది లోకల్ కాదు. 1994లో బిజినెస్ కోసం హర్యాన నుంచి ప్యామిలీతో సికింద్రాబాద్ వచ్చాడు.  అల్వాల్ పంచశీల కాలోనిలో ఉంటున్నాడు. రిలయెన్స్ ప్లాస్టిక్ గ్రేనివాల్యుస్ సప్లయ్ చేసే డెల్ క్రెడిట్ ఎజెంట్ పని చేస్తూ బిజినెస్ డెవలప్ చేసుకుంటున్నాడు. ముగ్గురు కొడుకులలో ఒక్కరు అమెరికాలో ఉంటాడు. మరో ఇద్దరు హైదరాబాద్ లో బిజినెస్ లు చూసుకుంటారు. సంపాదన బాగానే ఉంది. తాము సంపాదించే దాంట్లో పేదలకు సహాయం చేయలనుకున్నాడు సురేష్ మంగళ్. పేదలకు అన్నదానం చేయడమే సరియైన సేవా అని భావించారు. ఫ్యామిలీతో చర్చించారు. వాళ్లు ఒకే చెప్పారు. అంతే.. 29 జూలై 2020 నుంచి అన్నదానం ప్రారంభించాడు.

Public service

జీవితాంతం అన్నదానం

 అళ్వాల్ నుంచి కొంపల్లి వెళ్లే హైటెన్షన్ రోడ్ పక్కనే ప్రతి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు బోజనం పెడుతున్నాడు సురేష్ మంగల్ ఫ్యామిలీ.  ఉచితంగా బోజనం పెడితే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదని భావించిన అతను ఆరవై ఏళ్ల వృద్దులకు ఉచితంగా బోజనం పెడుతారు. మిగతా వారి నుంచి ఐదు రూపాయలు తీసుకుని కడుపు నిండ బోజనం వడ్డిస్తారు. సురేష్ మంగల్ మాత్రం జీవితాంతం అన్నదానం చేస్తానని చెబుతున్నాడు. ఎవరైనా విరాళాలు ఇస్తాంటే ముట్టుకోడు. బోజనానికి ఉపయోగపడే బియ్యం, కూరగాయలు ఇస్తే నో ప్రాబ్లం అంటాడు. Public service

Public service

గివ్ ఆర్ టేక్ ఫాలీసి

ఒక ఐడియా ఎందరికో లాభం అంటాడు సురేష్ మంగల్. ఇంట్లో ఉపయోగించి వృధగా పడి ఉన్న వస్తువులను గివ్ ఆర్ టేక్ ఫాలిసీ కింద తీసుకుంటారు. ఆ వస్తువులను ఎవరికి అవసరమో వారికి ఇస్తుంటాడు. అందుకోసం ముగ్గురు ఉద్యోగులను నియమించారు. పంచశీల ప్రాంతంలో గోడలపై గివ్ ఆర్ టేక్ అనే బోర్డులు వెల్ కమ్ చెబుతాయి. ఇవే గాకుండా భవిష్యత్ తో తాండాలకు వెళ్లి గిరిజనుల ఆకలి తీరుస్తనంటున్నాడు సురేష్ మంగల్.

Public service

కడుపు నిండ బోజనం

ఆకలితో వచ్చే తమకు ప్రతి రోజు బోజనం పెడుతున్న శ్రీ క్రిష్ణ పూర్ణి దేవి మంగళ్ ట్రస్ట్ వారిని కృతజ్ఞతలు తెలుపుతున్నారు పేదలు. ఐదు రూపాయలకు ఛాయ్ రాని నేటి కాలంలో కడుపు నిండ బోజనం పెట్టి ఆకలి తీరుస్తున్నరన్నారు. డబ్బున్నోళ్లు ఎందరో ఉన్నా పేదల నిస్వార్థంగా సేవాలు చేయడం అరుదుగా ఉంటరంటున్నారు వారు. Public service

Public service

గిరిజనులకు సేవా చేయాలని..

సురేష్ మంగల్ చేస్తున్న సేవాలను అభినందిస్తున్నాడు పంచశీల కాలోని అభివృద్ది కమిటీ అధ్యక్షులు రవీంధర్ నాయుడు. ఆకలితో అలమటించే పేదలకు ప్రతి రోజు వేలాది రూపాయలు స్వంతంగా ఖర్చు చేసి బోజంన పెట్టడం గొప్ప విషయమన్నారు. సురేష్ మంగళ్ డబ్బులు విరాళంగా ఇస్తే తీసుకోడని.. అదే బియ్యం, వస్తువులిస్తే మాత్రం తీసుకుంటడన్నారు.

YATAKARLA MALLESH

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

949 222 5111

 

Leave A Reply

Your email address will not be published.

Breaking