Header Top logo

పాకిస్థాన్‌లో భగ్గుమంటున్న పెట్రోల్‌- డీజిల్‌ ధరలు

ఒక లీటర్ పెట్రోల్  ధర 272 రూపాయలు,

ఒక లీటర్ డీజిల్ ధర 196 రూపాయలు..

ఔను.. మీరు చదువుతున్నది అక్షరాల నిజం. ఇది మన దేశంలో మాత్రం కాదు. మనమంటే మాటి మాటికి కయ్యానికి కాలు దువ్వుతూ మేక పోతు గంభీర్యం ప్రకటించే పాకిస్థాన్ లో.. అక్కడ ఆర్థిక సంక్షోభం ప్రజలను పట్టి పీడిస్తోంది.

పాకిస్థాన్‌లో భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

ఇస్లామాబాద్‌: ఆర్థిక సంక్షభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాక్‌ ప్రజలపై ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను భారీగా పెంచింది. గతనెల 29న లీటర్‌ డీజిల్‌, పెట్రోల్‌పై రూ.35 చొప్పున పెంచిన షాబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం.. తాజాగా పెట్రోల్‌పై రూ.22.20, హై స్పీడ్‌ డీజిల్‌పై రూ.17.20, కిరోసిన్‌పై రూ.12.90 చొప్పున వడ్డించింది. దీంతో దాయాది దేశంలో లీటర్‌ పెట్రోల్‌ కొనాలంటే రూ.272 (పాక్‌ కరెన్సీలో) ఖర్చుచేయాల్సిందే. ఇక హైస్పీడ్‌ డీజిల్‌ ధర రూ.280, లైట్‌ స్పీడ్‌ డీజిల్‌ రూ.196.68, కిరోసిన్‌ రూ.202.73కు పెరిగాయి. పెరిగిన ధరలు గురువారం తెల్లవారుజాము నుంచే అమల్లోకి వచ్చాయి.

డాలర్‌తో పాక్‌ రూపాయి విలువ దారుణంగా పడిపోవడంతో పెట్రోల్‌, డీజిల్‌తోపాటు నిత్యావసర పదార్థాల ధరలు పాకిస్థాన్‌లో చుక్కలనంటాయి. లీటర్‌ పాల ధర రూ.210, కిలో చికెన్‌ రూ.700 నుంచి రూ.800 వరకు పలుకుతున్నది. అంత‌ర్జాతీయ ద్రవ్య నిధి (ఏఎంఎఫ్‌)తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు మినీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కొద్దిగంటల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడం గమనార్హం. కాగా, 2023 మొదటి ఆరు నెలల్లో పాకిస్థాన్‌లో సగటు ద్రవ్యోల్బణం 33 శాతానికి పెరిగే అవకాశం ఉందని మూడీస్ సీనియర్ ఆర్థికవేత్త చెప్పారు. ఐఎంఎఫ్‌ నుంచి బెయిలవుట్ ప్యాకేజీ లభించినా, దేశం ఈ విచారకరమైన స్థితి నుంచి ప్రస్తుతం బయటపడలేదని అంచనావేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking