ఏపీ 39 టీవీ,
జూన్ 9,
బొమ్మనహల్:-అనంతపురం జిల్లా, రాయదుర్గం తాలూకా, బొమ్మనహాళ్ మండలం పరిధిలోని ఉద్దేహళ్ గ్రామంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ వద్ద ఎటువంటి సామాజిక దూరం పాటించకుండా ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ బ్యాంకులో క్రాప్ లోన్ కోసం రైతులు విల విల, ప్రజలు కనీసం సామాజిక దూరం కూడా పాటించకుండా ప్రస్తుతం మనం చాలా ప్రమాదకరమైన పరిస్థితి లో ఉన్నాం అని తెలిసినా కూడా ప్రజలు ఎటువంటి సామాజిక దూరం పాటించకుండా రైతులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, బ్యాంకు వారు ఎంత చెప్పిన ఖాతాదారులు వారి మాట వినడం లేదని బ్యాంకు వారు తెలియజేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీసం 6 అడుగులు సామాజిక దూరం పాటించాల్సి ఉండగా సంబంధిత అధికారులు దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు కరోనా పైఅవగాహన కల్పించాలని అక్కడ ప్రజలు కోరుతున్నారు.
R.ఓబులేసు,
ఏపీ 39 టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇంచార్జి.