Header Top logo

Open your mouths you geniuses మేధావులారా నోళ్లు విప్పండి

Open your mouths you geniuses

మేధావులారా నోళ్లు విప్పండి

దేశంలో ప్రజాస్వామ్యం యొక్క విలువలు, పాలనాపరమైన విధానాలు అడుగంటిపోతున్నాయి. పౌరహక్కులు కాలరాసిపోతున్నాయి. ప్రశ్నిస్తే పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారు. దాడులు జరుగుతుంటే దేశంలోని మేధావులు ఏమిచేస్తున్నట్లు ? అసలు మేధావులు ఉన్నారా..? అనే అనుమానం కలుగుతుంది.

అసలు మేధావులు అనగాఎవరు ?

తమ మేధస్సుతో అసంఖ్యాక ప్రజానీకానికి ఉపయోగపడేవిధంగా అలోచించి అచరించే వారే మేధావులుగా పిలువబడుతారు. వారు కొత్తగా సమాజానికి తెలియపరచిన భావాలు, ప్రతిపాదనలు, సమాజాన్ని మరింత మెరుగుపరిచే విధంగా ఉండాలి. ఉదాహరణకి ఫ్రెంచి తత్వవేత్త “రూసో” ప్రచారం చేసిన ” స్వేచ్ఛ , సమానత్వం, సౌభ్రాతృత్వం ” ఆ రోజుల్లో ఫ్రెంచి విప్లవానికి ఊపిరిపోసింది. సాధారణంగా ఇంజనీర్లు, డాక్టర్లూ, లాయర్లు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఏలాంటి స్వార్ధములేకుండా వివిధ రంగాలలో సేవలుచేసిన వారిని మేధావుల జాబితాలో కలుపుతారు. వీరంతా తమ మేథస్సుతో ఆయా రంగాలలో ప్రజలకు మేలు చేసేవిధంగా ఉండాలి. అపుడే వీరు మేధావులౌతారు. లేకపొతే ” మేతావులుగా ” మిగిలిపోతారు.

సృజనాత్మక కృషిద్వారా

అంతేకాదు తమతమ రంగాలలో చదువు లేకపోయినా కార్మికులు, రైతులు ఇతర చేతివృత్తుల వారు కూడా మేధావులే ! అంతేకాదు చదువుకోకపోయినా వారి సృజనాత్మక కృషిద్వారా సమాజాన్ని మరింత ముందుకు తీసుక పోయే ఆలోచనలను అందించే వారంతా కూడా మేధావులే. వీరంతా తప్పని సరిగా ప్రజావ్యతిరేక పాలనను ఖండిస్తూ, నిర్బంధాలకు వ్యతిరేకంగా ముందుకుసాగాలి. అందుకే ప్రముఖ చరిత్రకారిణి “రొమిల్లా థాపర్ ” ఆమధ్య మాట్లాడుతూ “కేంద్ర ప్రభుత్వము పాఠ్య పుస్తకాలలో పురాణాలను, వాస్తూ, జ్యోతిష్యాలను, యోగాను పాఠ్యాంశాలుగా పెడుతుంది. అయినా మేధావులుగా పిలువబడుతున్నవారు ఎందుకు ప్రశ్నించరు ?” అని తన ఆవేదన వెలిబుచ్చింది. రాజ్యాంగంలో వ్రాసుకున్న లౌకిక వాదాన్ని తొలగించి ఈ దేశాన్ని ఒక మతరాజ్యంగా తయారుచేయాలని కొంతమంది చూస్తున్నారు.

మేధావులు నోరు విప్పకుంటే..

మేధావులన్నవారు ఇపుడు నోరు విప్పకుంటే ప్రజాస్వామ్యం ఖూనీ చెయ్యబడుతుంది. ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్యదేశం కాస్త ఒక నియంతృత్వ దేశంగా మిగలవచ్చు. ప్రభుత్వాలే బాబాలను, స్వాములను, మూఢనమ్మకాలను పెంచిపోషిస్తుంది. ప్రభుత్వభూములను దొంగస్వాములకు దారాధత్తం చేస్తుంది. అందువల్లనే తెలిసికూడా ప్రశ్నించకుండా వుండే వారివల్లనే దేశానికి చాలా ప్రమాదం. అందుకే ఇప్పుడైనా నోరువిప్పండి అని దేశ ప్రజలు కోరుతున్నారు. నోరు తెరవండి అంటే తినటానికికాదు. ప్రభుత్వాలని నిలదీయ్యటానికి. ఇపుడు కాకపోతే నోరు ఎపుడు తెరుస్తారు? మనం ఎన్నకున్న పాలకులు దేశంలోఉన్న పెద్ద పెద్ద పరిశ్రమలను అమ్ముకుంటున్నారు. లేదా అద్దెకిస్తున్నారు. వీరు ప్రజల ఆస్తులకు రక్షకులు మాత్రమే. అమ్మె హక్కు వీరికిలేదు. Open your mouths you geniuses

ఆస్తులు అమ్మెుతుంటే..?

కేంద్రప్రభుత్వం రైల్వేలను, విమానాలను, రోడ్లను, స్టీల్ ప్లాంట్లను, LIC ని, బ్యాంకులను అమ్ముతుంది. లీజ్ కి ఇస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలెక్టరు కార్యాలయాలను, MRO కార్యాలయాలను, పెద్ద పెద్ద ప్రభుత్వ ఖాళీస్థలాలను అమ్ముకుంటుంది.
ప్రశ్నిస్తే కేసులు, దాడులు చివరికి ప్రతిసారి జీతాలు, అలవెన్సులు, పెన్షన్లు, విషయంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వాలని బెదిరించి అదిరించి తమ సమస్యలు పరిష్కరించుకొనే ఉద్యోగులుకూడా ఈరొజు ఆర్థిక మంత్రే స్వయానా ఉద్యోగులకు జీతాలు నాలుగురోజులు ఆలస్యమైతే ఏమి కొంపలు మునుగుతాయా అని అంటున్నారు. అయినా వారు నోరుమెదపలేని స్థితిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అలాయితే సామాన్యుని స్థితిగతులు ఎవరు పట్టించుకుంటారు?

సీనియర్ సిటిజన్స్

గతంలో సీనియర్ సిటిజన్స్ కి రైల్వే ప్రయాణికులకు ౩౩/శాతం రాయతీ ఉండేది. ఇపుడు దాన్ని గురించి అడిగే వాడేలేడు. అలాగే బస్సులలో కూడా సీనియర్ సిటిజన్స్ రాయితీలు తీసివేశారు. అదేమంటే కరొనా వలన దేశం ఆర్థికంగా ఎంతో నష్టపోయింది అని అంటారు. మరి పార్లమెంటు సభ్యులకు, మంత్రులకు, ముఖ్యమంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఐఏఎస్ లకు, ఐపీసీలకు అంతజీతాలు, అలవెన్సులు, పెన్షన్లు ఎందుకూ ?
కేంద్రంలోను ర్రాష్ట్రంలోను ఒక ఆరాచక పాలన జరుగుతుంది. ఇపుడు ప్రశ్నించక పోతే భావి తరాల భవిష్యత్తు అంధకారమైపోతుంది. అపుడు ఎంత మొత్తుకున్నా ప్రయోజనం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంతమంది సలహాదారులెందుకు ? వీరే సేవకులు. వారికి మరలా సేవకులేందుకు ? వారికి మరలాసేవకులా ! అవసరమనుకుంటె సలహాదారులే వారి జీతంలో కొంత ఇచ్చి సేవకులను పెట్టుకోవాలి. ఇలాంటి చిన్నచిన్న వాటికి కూడా ఫ్రభుత్వం కోట్లు తగలేస్తుంది. రాష్ట్ర ఖజాణా ఖాళీఅయిపోయింది. ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టినా కూడా చాలడంలేదు. మీకు భాధ్యత లేదా !! అందుకే మేధావులారా నోళ్ళు విప్పండని ప్రజలు కోరుతున్నారు. Open your mouths you geniuses

Narne Venkatasubbaiah

నార్నె వెంకట సుబ్బయ్య, రచయిత
జన విజ్ఞాన వేధిక

Leave A Reply

Your email address will not be published.

Breaking