Header Top logo

ఒక ఎస్సై ముగ్గురు కానిస్టేబుళ్ళకు జైలు శిక్ష

గిరిజనుడిని చితుక బాదిన

ఒక ఎస్సై ముగ్గురు కానిస్టేబుళ్ళకు జైలు శిక్ష

విశాఖపట్నం క్రైమ్ : గిరిజనుడిని నిర్బంధించి చిత్ర హింసలకు గురి చేసినందుకు తీర్పు వెల్లడించిన మొదటి ఏడిసి జడ్జి యుగంధర్. ఎస్సై బీబీ గణేష్, ముగ్గురు కానిస్టేబుళ్ళకు జైలు శిక్ష,జరిమానా విధించారు న్యాయమూర్తి.

గిరిజన యువకుడిని అక్రమంగా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి అకారణంగా చిత్రహింసలకు గురిచేసిన ఎస్సై బిబి గణేష్, కానిస్టేబుళ్లు ఏ గణేష్, టి సంతోష్ కుమార్, పివివి రామకృష్ణలకు కోర్టు ఏడాది జైలు శిక్ష, జరిమానాతో పాటు నష్టపరహరం చెల్లించాల్సిందిగా ఆదేశించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలకలం సృష్టిస్తున్న ఈ కేసు వివరాలులో కి వెళ్లితే.. నగరంలో నివాసం ఉంటున్న అధరశెట్టి చంద్రశేఖర్ అనే గిరిజన యువకుడిని 2013, అక్టోబర్ 6న రాత్రి 9 గంటల సమయంలో అప్పటి నాలుగో పట్టణ పిఎస్ ఎస్ఐ బి బి గణేష్, పైన పేర్కొన్న ముగ్గురు కానిస్టేబుళ్లు కలిసి అదుపులోకి తీసుకొని స్టేషనకి తరలించారు.

అయితే చంద్రశేఖర్ పై ఎటువంటి ఫిర్యాదు, కేసు లేకుండా పోలీసులు మరుసటి రోజు వరకు లాకప్ లో ఉంచి చిత్ర హింసలకు గురి చేశారు. రెండు రోజులు కావస్తున్నా కుమారుడు ఇంటికి చేరకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి, చంద్రశేఖర్ చిన్నాన్న డాక్టర్ ఏ గోపాలరావుకు ఫోన్ చేసి, కుమారుడు ఇంటికి రాలేదని చెప్పాడు.

దీంతో గోపాలరావు వాకబు చేయగా చంద్రశేఖర్ నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. అయితే అప్పటికే చంద్రశేఖర్ ను పోలీసులు చిత్ర హింసలకు గురి చేయడంతో కాలుకు చేతులకు తీవ్ర గాయాలై, నడవలేని పరిస్థితిలో ఉన్నాడు.

దీంతో చిన్నాన్న గోపాలరావు పోలీసులను నిలదీయగా, వెంటనే చంద్రశేఖర్ని వదిలేశారు. గాయాల పాలైన చంద్రశేఖర్ని చికిత్స నిమిత్తం కేజీహెచ్ కి తరలించారు. వైద్యులు కేజీహెచ్ లో చంద్రశేఖర కు సర్జరీతో పాటు , ప్లాస్టిక్ సర్జరీ చేశారు.

ఈ నేపథ్యంలో పౌర హక్కుల నేత ఎన్ హెచ్ అక్బర్ సహాయంతో ఫస్ట్ ఎడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో బాధితుడు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ విషయం అప్పట్లో వెలుగులోకి వచ్చింది.

అప్పటి సీపీ దీనిపై శాఖపరమైన విచారణ చేపట్టినప్పటికీ,  ఈ ఘాతుకానికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోకపోవడం విశేషం. ఈ తరుణంలో కోర్టులో వాదోపవాదాలు జరిగి 8మంది సాక్షులను విచారించగా నేరం రుజువు అయింది. ముఖ్యంగా చంద్రశేఖర్ ని పోలీసులు నిర్బంధించి చిత్రహింసలు గురైనట్టు ఆధారాలు లభించడం, సర్జరీలు చేసిన నలుగురు వైద్యులు కోర్టులో తమ వాంగ్మూలాలను ఇవ్వడం కేసుకు బలం చేకూరింది.

ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం ఫస్ట్ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ జడ్జి యుగంధర్ తీర్పునిస్తూ ఎస్సై గణేష్, ముగ్గురు కానిస్టేబుళ్ళకు ఏడాది జైలు శిక్ష, జరిమానా విధించారు…

ఐపీసీ 326 సెక్షన్ కింద గణేష్ కు ఏడాది జైలు, రూ.10వేలు జరిమానా, 342 సెక్షన్ల కింద నలుగురికి ఏడాది జైలు జరిమానా, మరో రెండు సెక్షన్ల కింద నలుగురికి ఏడాది జైలు, జరిమానాలు విధిస్తూ ఆయన తీర్పు వెల్లడించారు. మొత్తంగా ఎస్సైకి మూడు సంవత్సరాలు, కానిస్టేబుళ్ళకు రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. జరిమానాలు కట్టని పక్షంలో మరో నెల రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

అలాగే బాధితునికి రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ప్రస్తుతం గణేష్ పోలీస్ కమిషనరేట్ లోని ఇంటిలిజెన్స్ విభాగంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. తాము గతంలో విధులు నిర్వహించిన నాలుగో పోలీస్ స్టేషన్ లోనే ఇప్పుడు ముద్దాయిలుగా ఆ నలుగురు మారిపోయారు. శిక్ష పడ్డ ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లను అక్కడి సిబ్బంది సాయంత్రానికి అదుపులోకి తీసుకొని జైలుకు తరలించడం గమనార్హం. పై నలుగురికి కోర్టు శిక్ష విధించడంతో వారిని సిపి శ్రీకాంత్ సస్పెండ్ చేయనున్నట్టు తెలిసింది…

Leave A Reply

Your email address will not be published.

Breaking