International Poverty Alleviation Day పేదరిక నిర్మూలన దినం
October 17 is International Poverty Alleviation Day
పేదరికానికి అడ్డుకట్టలో పాలకుల వైఫల్యాలు
అక్టోబర్ 17న అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం
హింసకు అత్యంత హీనరూపం పేదరికం అనేది మహాత్మాగాంధీ మాట. పేదరిక నిర్మూలన పేరిట ప్రత్యేకంగా ఏటా ఓ రోజును కేటాయించి జరుపుకొంటూనే ఉన్నాం. అదే అక్టోబర్ 17 అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం. పేదరికం (Poverty) ఒక సామాజిక, ఆర్థిక సమస్య. ఇది దీర్ఘకాలిక సామాజిక సమస్యగా ఉంది. సమాజంలో ఒక వర్గం కనీస అవసరాలైన ఆహారం, గృహవసతి, దుస్తులు పొందలేని పరిస్థితిని పేదరికం అంటారు. పేదరికంతో బాధపడుతున్న వారిని “పేదలు” అంటారు. పేదలకు ప్రధాన ఆదాయ వనరు ఉపాధి. కాబట్టి, ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. సరైన ఉపాధి అవ కాశాలు లేని ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కష్టమైన పని. పేదరిక నిర్మూలన, సామాజిక పురోగతి కోసం చేపడుతున్న కార్యక్రమాలకు, పెరుగుతున్న ఆర్థిక అసమానతలు అతిపెద్ద సవాలుగా మారు తున్నాయి”. ప్రజల చేతుల్లో డబ్బు ఉన్నంత మాత్రాన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందినట్లు కాదు, వారికి విద్య, వైద్యం, రుణ సదుపాయం, మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలి. అవన్నీ లేవంటే సమగ్ర అభివృద్ధి జరగడం లేదని భావించాలి.
ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 2030 నాటికి పేదరికాన్ని నిర్మూలించాలన్నది ఒకటి. కానీ, ఆ గడువు పూర్తయ్యే నాటికి కూడా ప్రపంచ జనాభాలో ఆరు శాతం మంది అంతర్జాతీయ దారిద్ర్య రేఖకు దిగువనే ఉంటారని 2019 జూలైలో ఆ సంస్థ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ప్రస్తుత అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనాలు “పేదలకు బాగానే అందు తున్నాయి. కానీ, నిరుపేదలకు అందడం లేదు”. కొందరి గుప్పిట్లోనే సంపద ‘దారిద్యానికి అంతం పలికి సంపదను సమానంగా పంపిణీ చేద్దాం’ పేరిట ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన నివేదిక ఆసక్తికర అంశాలను వెల్లడించింది.101 దేశాల్లో 23.1 శాతం మంది పేదరికంలో ఉన్నట్లు తేలింది. ఇందులో సగం 18 ఏళ్లలోపువారే. అధ్యయనం జరిపిన దేశాల్లో 17.5 శాతం వయోజనులు
2012లో అంతర్జాతీయంగా 90 కోట్ల మంది రోజుకు 1.90 డాలర్ల కంటే తక్కువ కోట్లకు పడి పోయింది. ఈ గణాంకాలు ఎలా ఉన్నా, దుర్భర దారిద్యం ప్రపంచ మానవాళిని దారుణంగా వేధిస్తోంది. ‘క్రెడిట్ న్యూస్’ నివేదిక ప్రకారం కేవలం ఒక శాతం సంపన్నుల చేతిలో ప్రపంచం లోని సగానికిపైగా సంపద కేంద్రీకృతమై ఉంది. శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన రంగాల్లో మానవ మేధ గగన సీమలను చుంబిస్తున్నా సర్వకాల సర్వావస్థల్లో విస్తరిస్తున్న పేదరి కానికి అడ్డుకట్ట వేయడంలో దారుణ వైఫల్యం వెక్కిరిస్తోంది. నేటికీ లక్షల మంది చిన్నారుల బాల్యం దోపిడికి గురవుతోంది.
పేదరికంలో మగ్గుతున్న చిన్నారులు తమ హక్కుల్ని, ఆరోగ్యాన్ని, పోషకాల్ని, విద్యావకాశాలను కోల్పోతున్నారు. ఇవాళ అంతర్జాతీయ దారిద్య్ర నిర్మూలన దినోత్సవం జరుపు కొంటున్నాం. ప్రపంచం నుంచి పేదరికాన్ని తరిమి కొట్టడం సహస్రాబ్ది, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో కీలకంగా చెప్పుకొన్నారు. కానీ, ఆ లక్ష్యాలు సాకారమయ్యే అవకాశం కనుచూపు మేరలో కనిపించక పోవడమే బాధాకరం. అవమానాల నుంచి, వెలివేతల నుంచి బాధా సర్పదష్టులనూ విముక్తి కలిగించి, అందరి భాగస్వామ్యంతో పేదరికాన్ని పునాదుల నుంచి పరిమార్చడమే నినాదంగా పేదరిక నిర్మూలన దినోత్సవం జరుపుతున్నారు. సర్వత్రా పెనువేగంతో విస్తరిస్తున్న అసమానతలు ఇప్పుడు ప్రపంచానికి అతిపెద్ద సవాలుగా నిలుస్తున్నాయి. దేశాల మధ్య యుద్ధం కాదు, పేదరికంపై సమరం చేయాలని ఆ మధ్య భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాల్సి ఉంది. అందరికీ ఉపాధి కల్పించినట్లయితే పేదరికం, ఆదాయ అసమానతలను తగ్గించవచ్చు. ప్రభుత్వం, నీతి ఆయోగ్ ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించాలి. భారత దేశంలో వ్యవసాయం 50 శాతం శ్రామికులకు జీవనాధారం కల్పిస్తోంది. ఈ రంగం అనుబంధ వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగాలను పెద్ద సంఖ్యలో అందించ గలదు. 2022 కల్లా రైతుల ఆదాయాలను సమయాల్లోనే కాదు, పంటలు విరగ పండిన సంవత్సరాల్లోనూ రైతులకు అరకొర ధరలైనా దక్కడం లేదు. అన్నదాతల ఆదాయాలు పెరగనంత వరకు పేదరికాన్ని నిర్మూలించలేం. ఇక భారతీయ శ్రామికుల్లో 92 శాతం అసంఘటిత రంగాల్లోనే పని చేస్తున్నారు. వారికి వేతనాలు బహు తక్కువ. పింఛన్ల వంటి సామాజిక భద్రత భృతులేవీ లభించవు. పైగా పని పరిస్థితులు దుర్భరం. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారిపోతున్న దృష్ట్యా సంఘటిత రంగ కార్మికులు సరికొత్త ఉద్యోగాల్లో మహిళల వాటా సైతం పెరగాలి. ఇతర దేశాల్లో 50 నుంచి శాతం మంది మహిళలు ఉద్యోగాలు చేస్తుంటే, భారత దేశంలో వారి సంఖ్య కేవలం 24 శాతం. స్థూలంగా చూస్తే భారత్, చైనాలు రెండింటిలో అసమానత ఒకేరకంగా ఉన్నట్లు కనిపించినా భారతీయ పేదలు కనీస అవసరాలు కూడా తీరని దుస్థితిలో ఉన్నారు. International Poverty Alleviation Day
విద్య, వైద్యం, ఇతర సేవలూ సరిగ్గా అందడం లేదు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా… ఏళ్లయినా రైతులకు ఇప్పటికీ గిట్టుబాటు ధరలను అందించ లేక పోవడం విచారకరం. అనావృష్టి పీడిత ప్రతి పౌరుడికి కొంత ఆదాయం అందించడానికి సార్వజన కనీస ఆదాయ పథకం పెట్టాలని ప్రపంచ మంతటా ప్రతిపాదనలు వస్తున్నాయి. ఈ పథకాన్ని మొదట వృద్ధుల సంక్షేమం కోసం అమలు చేయవచ్చు. దేశ జనాభాలో ఎనిమిది శాతంగా ఉన్న వృద్ధులకు దీనివల్ల ఎంతో ఊరట కలుగుతుంది. తరవాత మిగతా లబ్ధిదారులకు క్రమంగా ఈ పథకాన్ని వర్తింప జేయవచ్చు. అనారోగ్యం ఉపాధి కోల్పోవడం, పంట నష్టం వంటి అనూహ్య విపత్తులతో అతలా కుతలమయ్యే పేదలకు కనీసాదాయ పథకం ఎంతో కొంత ఆసరా ఇస్తుంది. అదే సమయంలో పేదలకు సరైన ఉపాధి కల్పించడం ఎంతో ముఖ్యం.
రామ కిష్టయ్య సంగన భట్ల
9440595494