Header Top logo

డ్రగ్స్ కేసులో త్వరలోనే దీపికా పదుకొణే, రకుల్ లకు నోటీసులు… సారా, శ్రద్ధా కపూర్ లకు కూడా!

  • రియాను విచారించగా పలు పేర్లు వెల్లడి
  • ఎన్డీపీసీ చట్టం సెక్షన్ 67 కింద సమన్లు
  • వెల్లడించిన ఎన్సీబీ డైరెక్టర్ మల్ హోత్రా

బాలీవుడ్ డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చిన తరువాత, సుశాంత్ ప్రేయసి రియా ఇచ్చిన వాంగ్మూలం మేరకు పలువురు సినీ తారలకు నోటీసులు ఇచ్చేందుకు ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారులు సన్నద్ధం అవుతున్నారు. వీరిలో పలువురు పెద్ద తారలు కూడా ఉండటం గమనార్హం. దీపికా పదుకునే, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ లతో పాటు డిజైనర్ సిమోన్, దీపిక మేనేజింగ్ ఏజన్సీ ప్రతినిధి కరిష్మా తదితరుల పేర్లు ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్ హోత్రా, వీరికి ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 67 కింద సమన్లు పంపి, విచారించనున్నామని తెలియజేశారు.

కాగా, ఈ కేసు విచారణలో భాగంగా ఓ నిందితుడిని విచారిస్తున్న సమయంలో అతని చాటింగ్ గ్రూప్ లో ‘డీకే’ అన్న అక్షరాలు కనిపించడం, డీ అంటే దీపిక అని, కే అంటే క్వాన్ టాలెంట్ మేనేజ్ మెంట్ ఏజన్సీ ప్రతినిధి కరిష్మా అని అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఇక ఈ కేసులో అమృతసర్, పాకిస్థాన్ లింకులు కూడా ఉన్నాయని భావిస్తున్న ఎన్సీబీ అధికారులు, మరింత లోతుగా కేసును విచారించాలని నిర్ణయించారు.
Tags: Bollywood Drugs, Deepika Padukone, Rakul Preet Singh, Sara Ali Khan

Leave A Reply

Your email address will not be published.

Breaking