Header Top logo

Naini’s first funeral on the 22nd అక్టోబర్ 22న నాయిని ప్రథమ వర్ధంతి

Naini’s first funeral on the 22nd

నిబద్దత గల నేత నాయిని
అక్టోబర్ 22న నాయిని నర్సింహారెడ్డి ప్రథమ వర్ధంతి

నాయిని నర్సింహారెడ్డి నల్గొండ జిల్లా నేరెడుగొమ్ము గ్రామంలో 12 మే 1944న పుట్టి, అక్కడే పెరిగాడు. ఆయన హెచ్ఎస్సి వరకు విద్యను అభ్యసించాడు. మొదట వి.ఎస్.టి పరిశ్రమలలో కార్మిక సంఘం నాయకుడు. ప్రధానంగా 1969 లో తెలంగాణ ఆందోళనలో చురుకైన పాత్రను పోషించాడు. జనతా పార్టీ నుండి తన రాజకీయ వృత్తిని ప్రారంభించాడు. చురుకైన విద్యార్థిగా ఉంటూ వచ్చిన నాయిని ఆ ప్రాంతంలో జరిగే ప్రగతిశీల ఉద్య మాల్లో పాల్గొంటుండే వాడు.

నాయిని 1958 జనవరి 26వ తేదీన సోషలిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు. ఈ పార్టీ సమావేశం నాగార్జున సాగర్లో జరగగా దానికి సోషలిస్టు నాయకుడు బద్రి విశాల్ పిత్తి హై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1970 లలో హైదరాబాద్‌కు వలస వచ్చినందున హైదరాబాద్‌లో క్రియాశీల రాజకీ యాలకు దిగారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో 1978లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఒకవైపు ఇందిరా కాంగ్రెస్ నుంచి అప్పటి కార్మిక మంత్రి టి.అంజయ్య, మరో వైపు రెడ్డి కాంగ్రెస్ నుంచి గతంలో కార్మిక మంత్రిగా పనిచేసిన జి.సంజీవరెడ్డి లతో ఆయన ఢీ కొన్నారు.

ఆ ఇద్దరినీ ఓడించాడు. 2,167 ఓట్ల మెజార్టీతో గెలుపొంది సంచలనం సృష్టించి జెయింట్ కిల్లర్ గా ఖ్యాతి పొందాడు. 1985లో రెండోసారి, 2004లో మూడోసారి అదేస్థానం నుంచి గెలుపొందాడు. ముషీరా బాద్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 2005 నుండి 2008 వరకు వై.ఎస్. రాజ శేఖర్ రెడ్డి కేబినెట్‌లో సాంకేతిక విద్య మంత్రిగా పనిచేశాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా తెరాస ఏర్పాటు చేయగా, కెసిఆర్ మరియు టిఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులతో చురుకైన పాత్రలో పాల్గొన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ నుంచి టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ నిర్ణయం మేరకు, అమెరికాలో ఉన్న నాయిని అక్కడి నుంచే నేరుగా తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు పంపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏర్పాటు విషయంలో తన నిబద్ధతను చాటుకున్నాడు. ఆయన 2014 నుండి 2018 వరకు తెలంగాణ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నాడు.

ఆయన తెలంగాణ మొదటి హోంమంత్రి. జైళ్లు, ఫైర్ సర్వీసెస్, సైనిక్ వెల్ఫేర్, లేబర్, ఎంప్లాయ్‌మెంట్‌తో సహా దస్త్రాల బాధ్యతలు స్వీకరించాడు. ఆయన తెలంగాణలో గవర్నర్ నామినేట్ చేసిన లెజిస్లేటివ్ కౌన్సిల్ (ఎంఎల్‌సి) సభ్యుడు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో, అవసరం ఉన్నవారికి సాయం చేయడంతో ఆయనది అందె వేసిన చేయి. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, బుల్లెట్ పై తిరుగుతూ, బుల్లెట్ నర్సన్న, మీసాల నర్సన్నగా సుపరిచితుడు. 1978లో నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రమీజాబీ అత్యాచార సంఘటన లో నాయిని బాధితురాలి పక్షాన సుదీర్ఘ పోరాటం చేశాడు. నాయిని నరసింహరెడ్డి గత సంవత్సరం అక్టోబర్ 22న మృతి చెందారు. 76 ఏళ్ల రెడ్డి కరోనా బారినపడి, కోలుకొని మళ్లీ అస్వస్థతకు గురయి, ఆక్సిజన్‌ పడిపోవడంతో గత అక్టోబర్ 13న‌ తిరిగి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచగా, పరిస్థితి విషమంగా మారి నర్సింహరెడ్డి వెంటిలేటర్, డయాలసిస్ చికిత్సలో పొందుతూ ఊపిరితిత్తుల దెబ్బతినడంతో మరణించాడు.

Ramakistaiah sangabhatla1

రామ కిష్టయ్య సంగన భట్ల
9440595494

Leave A Reply

Your email address will not be published.

Breaking