Muchhinthal is spiritual in Ghadar singing గద్దర్ గానంలో ఆధ్యాత్మికం
Muchhinthal is spiritual in Ghadar singing
గద్దర్ గానంలో ముచ్చింతల్ ఆధ్యాత్మిక విజువల్
వండర్..!!
శ్రీరామానుజాచార్యుని విగ్రహావిష్కరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదిజీ..
శ్రుతిపేయంగా రామానుజాచార్యులు వారిపై గద్దర్ గానం…!!
రండిరో..లెండిరో..పదండిరో..’రామానుజ జాతరకు’!!
ఇప్పుడు అన్ని దారులు..’ముచ్చింతల్’ ఆశ్రమం వైపుకే.!!
ఇది శ్రీ శ్రీ శ్రీ చినజీయర్ స్వామివారి ఆధ్యాత్మిక
మహాద్భుతం…!!
వెయ్యి సంవత్సరాలకు పూర్వమే రామానుజాచార్య (రామానుజాచార్యుడు..క్రీ. శ. 1017 – 1137 ) విశిష్టా
ద్వైతాన్ని ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త, ఆస్తిక హేతువాది, యోగి త్రిమతాచార్యులలో ద్వితీయుడీయన.
11వ శతాబ్దిలో రామానుజాచార్యుడు ప్రతిపాదించిన వేదాంత దర్శనమే…విశిష్టాద్వైతం..!!
కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి,దేవునిపై చూపాల్సిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ,సాటిలేని భక్తికీ,
శ్రీరామానుజాచార్యుని జీవితాన్ని ఓ సజీవ ఉదాహరణగా చెప్పొచ్చు. ఈయనే ‘లక్ష్మణ, ఇలయ పెరుమాళ్ ‘
గా కూడా పిలువబడుతారు.
‘నారాయణుడు పరబ్రహ్మమైన భగవంతుడు’ అని ఈ తత్వం ప్రతిపాదించింది. నారాయణునితో సదా కలసి ఉండే లక్ష్మీదేవికి వారిచ్చిన ప్రాధాన్యత వల్ల ఈ సిద్ధాంతాన్ని ‘శ్రీవైష్ణవ’ మని అంటారు. నారాయణారాధనలో కులవివక్షతను పూర్తిగా త్రోసిపుచ్చిన మార్గం “విశిష్టాద్వైతం.” సమతమమతల మార్గం.కుల,మతాల ప్రసక్తిలేని సర్వమానవుల సమ్మిళిత స్వర్గధామమిది.
శ్రీ రామానుజాచార్యులు వారు శ్రీపెరంబదూర్, ( తమిళనాడు) లో జన్మించారు. శ్రీరంగంలో నిర్యాణం చెందారు. వీరికి ఎంబెరుమార్, ఉదయవార్,యత్రిరాజ, వైష్ణవ మత గురువు’ ..వంటి బిరుదులు న్నాయి.
సాహిత్య రచనలు…!!
వేదార్థ సంగ్రహం, శ్రీ భాష్యం, గీతా భాష్యం, వేదాంతదీపం, వేదాంత సారం, శరణాగతి గద్యం, శ్రీరంగ గద్యం, శ్రీ వైకుంఠ గద్యం,నిత్య గ్రంథం.తదితర రచనలు చేశారు.
శ్రీ రామానుజాచార్యులు అనగానే విశిష్టాద్వైతం గుర్తు కొస్తుంది.అయితే వీరికంటే ముందే విశిష్టాద్వైతాన్నిప్రతిపాదించిన వారూ లేకపోలేదు.సరోయోగి (పొయ్‌గై యాళ్వారు) భూతయోగి (పూదత్తాళ్వారు) మహాయోగి (పేయాళ్వారు) భక్తిసారుఁడు (తిరుమళిశైయాళ్వారు)పరకాలుఁడు (తిరుమంగై యాళ్వారు) శఠారి (నమ్మాళ్ వారు) పరాంకుశదాసుఁడు (మధురకవి ఆళ్వారు)విష్ణుచిత్తుఁడు (పెరియాళ్వారు) గోదాదేవి (చూడికొడుత్తాళ్) మునివాహనుఁడు (తిరుప్పాణాళ్వారు) ప్రభృతులు
శ్రీ రామానుజాచార్యులు వారి కంటే ముందే విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించారు.
హైదరాబాద్ కు సమీపంలో,రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ ఆశ్రమంలో శ్రీ చినజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో సమత,మమతల మూర్తి శ్రీ రామానుజాచార్యులు వారి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే…ఇప్పుడీ కేంద్రం ఆధ్యాత్మిక విజువల్ వండర్ గా అందరి అభిమానం చూరగొంటోంది..
మానవతా మూర్తి పై గద్దర్…పాట!!
ఈ సందర్భంగా…ప్రముఖ వాగ్గేయ కారుడు గద్దర్.. శ్రీ రామానుజాచార్యులు వారి పై ఓ కీర్తన/ గేయాన్ని రచించి స్వయంగా పాడారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే కొంతమంది గద్దరేంటీ? రామానుజాచార్యులు వారిని కీర్తిస్తూ గానం చేయడమేంటనీ..సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. శ్రీ రామానుజాచార్యులు వారి విశిష్టాద్వైతం గురించి తెలుసుకుంటే….బహుశా వీళ్ళ నోళ్ళు మూతపడొచ్చు.వెయ్యేళ్ళకు పూర్వమే కులమతాల్లేని సమాజం,విశ్వకుటుంబం కోసం కృషిచేశారు శ్రీ రామానుజాచార్యులు వారు. దళితుల్ని ఆలింగనం చేసుకొని కులమతాలకతీతంగా ఓ గొప్ప సమాజాన్ని ఆకాంక్షించారు.. అటువంటి మహనీయుడి పై గద్దర్ పాట రాసి,గానం చేయడంలో తప్పు పట్టాల్సిందేమిటో అర్థం కాదు.. నిజానికి శ్రీ రామానుజాచార్యులు వారు కాంక్షించిన సమత, మమతల సమాజం యేర్పడి వుంటే…ఈరోజున మనం మరొకలావుండేవాళ్ళం.
ఇప్పుడు శ్రీరామానుజుల వారిపై గద్దర్ పాటను
ఓ సారి చదవండి..!!
“ఒహో ! రండిరో…
లెండిరో…..
పదండిరో…. !!
ఆ….
రండిరో !…రామానుజ జాతరకు
పోదాంరో !.. పరమాత్ముని జూడనీకి..
(కోరస్ )
రండిరో…రామానుజ జాతరకు
పోదాంరో.. పరమాత్ముని జూడనీకి…
సమత మూర్తి
మమత మూర్తి
ఒహో!…
సమత మూర్తి
మమత మూర్తి
విశిష్ట అద్వైతం
విశ్వరూపమూ జూడ
రండిరో…రామానుజ జాతరకు
పోదాంరో.. పరమాత్ముని జూడనీకి…
వెయ్యేళ్ళ కిందటే
సమతా మమతలా
సారం జెప్పిండంటా
(కోరస్)
సారం చెప్పిండంటా..
అరె…
అస్పృశ్యుల చేరదీసి
హారతి పట్టిండంట..!!
లెండిరో
అహ..రండిరో…
(కోరస్!!)
రండిరో ..రామానుజ జాతరకు
పోదాంరో.. పరమాత్ముని చూడనీకి
రామానుజం జై..
రామానుజం…
రామానుజం జై..
రామానుజం….!!
(కోరస్!!)
రామానుజం జై
రామానుజం…
రామానుజం జై
రామానుజం….!!
సమత మూర్తి
రామానుజం..
మమత మూర్తి
రామానుజం..
(కోరస్)
సమత మూర్తి
రామానుజం..
మమత మూర్తీ
రామానుజం..
జైజైజైజై రామానుజం
రామానుజం జై
రామానుజం….
ఆ..పద.
లెండి
రండి
నడవండ్రా…
వేదం దేవునీ ……
ప్రసాదమూ తీర్థమైతే
మూసిపెడితే పాశిపోయి
మురిగిపోతదన్నడంట
దేవునీ గోపురమెక్కి
దీనులకూ పంచెనంట
లెండిరో..
రండిరో ..రామానుజ జాతరకు
పోదాంరో.. పరమాత్ముని చూడనీకి
ఆ…
పద..
లెండి..
రండి..
నడవండ్రా…
దేవుని పల్లకిమోసె
హమాలీ శ్రమజీవుల
దేవుని పల్లకీలో
హమాలీ లో మోస్కపోతే
మోక్షం దొరుకుననీ
సాక్ష్యం జెప్పిండంట.
లెండిరో
రండిరో ..రామానుజ జాతరకు
పోదాంరో.. పరమాత్ముని చూడనీకి
రామానుజం జై
రామానుజం….
జైజైజైజై రామానుజం
రామానుజం జై
రామానుజం….
సమత మూర్తి
రామానుజం..
మమత మూర్తీ
రామానుజం..
ఆ…
పద..
లెండి..
రండి..
నడవండ్రా…
సన్యాసం బుచ్చుకుంటె
మనిషి సన్యాసిగాడు
మనసుకు సన్యాసమిస్తె
మనిషి మహారుషి అయితడు
సంసారం సాగరము
ఎదురీదితే సరిగమంట
లెండిరో
సమత మూర్తి
రామానుజం..
మమత మూర్తీ
రామానుజం..
లోకాన్ని మేలుగొలిపె
దేవుడే నిద్రబోతె
(కోరస్)
లోకాన్ని మేలుగొలిపె
దేవుడే నిద్రబోతె
దేవునీ మేల్గొల్పే…
పామరుడూ వచ్చినడంట.
గట్టుమీద దరువువేసి
సున్నుండలు మెల్లంగజేసి
దీనుల రక్షించమని
భోజనం చేసినాడంట
దైవము భక్తుని లో
భక్తుడూ దైవములో
విలీనమవ్వుటే..
విశిష్టాద్వైతమంట
రండిరో ..రామానుజ జాతరకు
పోదాంరో.. పరమాత్ముని చూడనీకి
రామానుజం జై
రామానుజం….
సమత మూర్తి
రామానుజం..
మమత మూర్తీ
రామానుజం
జైజైజైజై రామానుజం
రామానుజం..
జై రామానుజం
జన్మస్థానమొక్కటైతే
జంధ్యమేల జగడమేల
దేవునీ మనిషీ నడుము
గొడవలేల గోడలేల!
మానవత్వమే మనిషీ
మహా మతమన్నడంట
రండిరో
లెండిరో
రండిరో ..రామానుజ జాతరకు
పోదాంరో.. పరమాత్ముని చూడనీకి
సమత మూర్తి
మమత మూర్తి
విశిష్ట అద్వైతము
పరమ మూర్తి జూడ.!!
రండిరో ..రామానుజ జాతరకు
పోదాంరో.. పరమాత్ముని చూడనీకి
..గద్దర్
దైవము భక్తునిలో’ భక్తుడూ దైవములో విలీనమవ్వుటే.. విశిష్టాద్వైతమంట”… ఎంత గొప్ప పాట ఇది.శ్రీ రామాను
జాచార్యులు వారివిశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అలతి అలతి పదాల్లో..ఎంత గొప్పగా ఆవిష్కరించారో చూడండి.
జన్మస్థానమొక్కటైతే..జంధ్యమేల జగడమేల. దేవునీ మనిషీ నడుము గొడవలేల గోడలేల!మానవత్వమే మనిషీ మహా మతమన్నడంట…”.ఈ సున్నితమైనతత్వాన్ని అర్థం చేసుకొని ఆచరిస్తే..మనకు ఈ కుల,మతాల కీచులాటలు తప్పుతాయి.సమాజం శాంతి సామరస్యాలతో అలరారుతూ వుండేది.
సన్యాసం బుచ్చుకుంటె మనిషి సన్యాసిగాడు. మనసుకు సన్యాసమిస్తె మనిషి మహారుషి అయితడు. సంసార సాగరం ఎదురీదితే సరిగమంట..”..నిజమే కదా.!సన్యా సం దేహానికి కాదు..మనసుకు తీసుకోవాలి.కోర్కెలను జయించిన నాడే సన్యాసానికి నిజమైన అర్ధం.పరమార్ధం.
దేవుని పల్లకిమోసే హమాలీ శ్రమజీవుల గురించి చెబుతున్నాడు.. దేవుని పల్లకీలో హమాలీలను మోస్క
పోతే మోక్షం దొరుకుననీ శ్రీ రామానుజాచార్యులు వారు సాక్ష్యం జెప్పారట..ఎంత గొప్ప భావన. శ్రమశక్తికి కిరీటం
పెట్టిన ఘనత కదా ఇది.!
వేదం అందరూ చదవకూడదట.అది కొందరికి మాత్రమే పరిమితమట. వేదం దేవునీ ప్రసాదమూ తీర్థమైతేమూసి
పెడితే పాశిపోయి మురిగిపోతుందన్నారు రామానుజాచార్యులవారు. దేవునీ గోపురమెక్కివేదసారాన్ని దీనుల
కూ పంచిపెట్టిన మహనీయమూర్తి శ్రీ రామానుజాచార్యులు వారు..! అందుకే విశిష్టాద్వైతభావనను,ఆ విశ్వరూపాన్ని కళ్ళారా చూసి,తెలుసుకోడానికి..రండిరో…రామానుజ జాతరకు వెయ్యేళ్ళ కిందటే సమతా మమతలాసారం జెప్పిన పరమాత్ముని జూడనీకి…ముచ్చింతల్ కు వెళ్దాం అంటున్నాడు గద్దర్..!!
*సహస్రాబ్ది ఉత్సవాలు..!!
*శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలకు …”ముచ్చింతల్ ” ముస్తాబైంది.45 ఎకరాల్లో రూ.1000 కోట్లతో ఓ ఆధ్యా
త్మిక దివ్యక్షేత్రం..వెలిసింది.దీని నిర్మాణానికి ఆరేళ్ళు పెట్టింది. 216 అడుగుల ఎత్తుతో రామానుజులు వారి
పంచలోహ విగ్రహాన్ని నిర్మించారు.దీని బరువు 1800 కిలోలు.. ఈ విగ్రహాన్ని 1600 భాగాలుగా చైనాలోతయా
రు చేశారు. గర్భగుడిలో 120 కిలోల బంగారంతో ‘నిత్యపూజా మూర్తి’ కొలువై వున్నాడు.సమతామూర్తి చుట్టూ 108 ఆలయాలు.. మధ్యలో భారీ మండపం.నిర్మించబడింది. ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు మొత్తం 12 రోజుల పాటు ఉత్సవాలు..జరుగుతాయి.ఈవేడుకలకు రాష్ట్రపతి, ప్రధాని..ఉభయరాష్టాల సిఎంలు, గవర్నర్ లు,ఇంకా దేశం విదేశాలనుంచి పలువురు ప్రముఖులుహాజరవుతున్నారు. 5నమహావిగ్రహ ఆవిష్కరణను మన ప్రధాని మోదీజీ జాతికి అంకితంచేస్తారు.13న రాష్ట్రపతి చేతులమీదుగా నిత్యపూజా మూర్తి విగ్రహానికి తొలిపూజ!
పద్మపీఠంపై పద్మాసనంలో ఆసీనుడిగా త్రిదండ ధారుడై ముకుళిత హస్తాలతో దివ్య తేజస్సుతో వెయ్యేళ్ల క్రితం ధరాతలంపై నడయాడిన సమతామూర్తి జగద్గురు శ్రీరామానుజాచార్యులు వారు మళ్లీ మనకు దర్శనమివ్వనున్నారు.శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల కోసం దేశం నలుమూలల నుంచి 5వేల మంది రుత్వికులు వస్తున్నారు.వారు హోమాల్లో పారాయణాల్లో పాల్గొంటారు. పండితులు కోటి సార్లు అష్టాక్షరి మహా మంత్రాన్ని జపిస్తారు.హోమంలో రెండు లక్షల కిలోల ఆవు నెయ్యిని వినియోగిస్తున్నారు. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని దేశీయ ఆవుల నుంచి సేకరించిన స్వచ్ఛమైన నెయ్యిని ఇందుకు వినియోగిస్తున్నారు.
12 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా 120 యాగ
శాలల్లో 1035 హోమగుండాలలో..
సమతామూర్తి మహా విగ్రహం చుట్టూ శ్రీవైష్ణవంలో దివ్యదేశాలుగా భావించే 108 పుణ్య క్షేత్రాలు, గర్భాలయాల ఆకృతిలో 108 ఆలయాలను నిర్మించారు. వీటిని అనుసంధానిస్తూ మధ్యలో 468 స్తంభాలతో భారీ దివ్యదేశ మండపాన్ని నిర్మించారు. ఈ దివ్య క్షేత్రంలోకి అడుగుపెట్టగానే అష్టదళ పద్మాకృతిలో ఉండే 45 అడుగుల ఎత్తుతో కూడిన ఫౌంటెయిన్ కనిపిస్తుంది. పద్మ పత్రాలు విచ్చుకునేలా దాదాపు రూ.25 కోట్లతో ఫౌంటెయిన్‌ను నిర్మించారు. పద్మపత్రాల మధ్య నుంచి నీళ్లు, రామానుజులను అభిషేకి
స్తున్న భావన భక్తులకు కలుగుతుంది. అదే సమయంలో రామనుజుల కీర్తనలను శ్రావ్యంగా వినిపిస్తాయి. సూర్యాస్తమయం తరువాత రామానుజులు ప్రభోధించిన సమానత్వ ఘట్టాలను మ్యూజిక్‌తో త్రీడీ షో ద్వారా ప్రదర్శించారు. ఈ ప్రాంగణం ప్రధానాకర్షణ అతిపెద్ద ఫౌంటెన్!