ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనతను ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి
గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనతను ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు అనంతపురం అర్బన్ నియోజకవర్గం పరిధిలోని అనంతపురం రూరల్ మండలంలోని రుద్రంపేట పంచాయితీ లో ఆదివారం రెండవ రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని శాంతినగర్ ఎస్సీ కాలనీ లో ఆయన మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చామని ఆనాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి చేసిన ఘనత అని తెలిపారు రాష్ట్రంలో 150 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలను అందించారన్నారు గ్రామ పంచాయతీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.
సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి ముంగిటకే సేవలు
సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటిముంగిట సంక్షేమ పథకాలను పాలిండ్ల ద్వారా అందించిన అందించే కార్యక్రమాన్ని రూపొందించామన్నారు ఇళ్లకే పరిమితం అయిన నేపథ్యంలో ప్రతి ఇంటి గడపకు సంక్షేమ పథకాలను అందజేశామన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు కావాల్సిన ప్రతి సంక్షేమ పథకానికీ అందజేసే అందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
అభివృద్ధిని చేసి చూపిస్తాం
పంచాయతీ పరిధిలో అనంతపురం నగరానికి టైటుగా అన్ని పంచాయతీలను అభివృద్ధి చేసి చూపిస్తామని ఆయన తెలిపారు. అనంతపురం నగరంలో అంతర్భాగంగా ఉన్న రుద్రంపేట పంచాయతీకి 12 కోట్లతో అభివృద్ధి పనులను చేపడతామని తెలియజేశారు. ప్రధానంగా కాలువలు రోడ్ల నిర్మాణం తో పాటు కల్వర్టులు నిర్మాణం చేశామని తెలియజేశారు. రుద్రంపేట నుంచి విలువ పెద్ద ఎత్తున పెరుగుతుందని ఆయన తెలిపారు.
అమృత్ పథకం ద్వారా రుద్రంపేట పంచాయితీ కి తాగునీటిని అందిస్తాం..