Maoist leader R.K. Love story.. మావోయిస్టు నేత ఆర్.కె. లవ్ స్టోరీ..
Maoist leader R.K. Love story..
మావోయిస్టు నేత ఆర్.కె. లవ్ స్టోరీ..
(కులాంతర వివాహం అంటే,ఆధిపత్య కులపు ధనిక అమ్మాయీ, పేద దళిత అబ్బాయీ మాత్రమే అని, మెజారిటీ దళితసమాజపు భావన. సినిమాలు, నవలలు కూడా అదే romanticise చేసాయి. కానీ దళిత ఆడపిల్లను పెద్దకులపు అబ్బాయి ప్రేమించి పెళ్లాడడం..పెద్దగా ఎవరూ కోరుకోరు, ఆలోచించరు. దళిత అమ్మాయిని పెద్దకులపు అబ్బాయి ప్రేమించి మోసగించడమో, సామూహిక అత్యాచారానికి గురిచేసి చంపడమో, ఉంపుడుగత్తెగా ఉంచడమో తప్ప, ప్రేమకు పెళ్లికి అర్హత లేనిదీ అన్నట్టే చూసిన నాకు.. “మా బ్రతుకులు నిరంతర ఛీత్కారాలేనా ఇంటా బయటా” అనే దుఃఖం ఉంది లోలోపల. కానీ అమరుడు ఆర్కే వైవాహిక జీవితం గురించి నిన్న చదివాక, చాలా ఆనందమైంది. శిరీష అనే దళితయువతిని ఆయన ప్రేమించి పెళ్లాడడం,ఆపై అతడి ఉద్యమ జీవితంవల్ల, ఇద్దరూ దూరంగా ఉన్నా ఒకటిగా ఉండడం..తెలిసికొని.. కళ్ళు చెమర్చాయి. శిరీష గారికి నా ఆత్మీయ ఆలింగనం.🤗)
“మార్క్స్ జెన్నీ ప్రేమ కథను మీరు చదివి ఉంటారు విని ఉంటారు. అలాంటి ఆచరణతో ఉన్న గొప్ప ప్రేమికులు కామ్రేడ్ ఆర్కే. శిరీష..!! అవును విప్లవంలో త్యాగము ప్రేమ ఈ రెండు ఒకటికి మించి ఒకటి పోటీ పడుతూ ఉంటాయి. కామ్రేడ్ ఆర్ కె పీడిత ప్రజల కోసం అలుపెరుగని యోధుడే కాదు. విప్లవోద్యమంలో గొప్ప నిబద్ధత క్రమశిక్షణ కలిగిన ఆదర్శప్రాయుడు . కేడర్ అందరి ప్రేమ అభిమానాలను పొందిన నాయకుడు.
బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈ పంతులు. ఆలకూరపాడు లోని దళిత కుటుంబంలో పుట్టిన శిరీష మ్మను. ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
నిర్బంధం పెరిగేకొద్ది ఒకరికొకరు దూరమవుతూ వచ్చారు. అయినా వీళ్ళ ప్రేమ మరింత రోజురోజుకీ దగ్గరయింది. ఆర్కే అంటే శిరీష్ అమ్మకు ఎనలేని గౌరవం. అంతకుమించి నమ్మకం. ఈ రెండింటినీ మించిన ప్రేమ. శిరీష తో ఎప్పుడు మాట్లాడినా అన్న పేరెత్తగానే కళ్ళలో ఉన్న వెలుగును నేను ఎప్పటికీ మర్చిపోలేను.
మున్నా పుట్టాక… నిర్బంధం నడమే ఎక్కని గడపలేదు శిరీష. పసిబిడ్డను పట్టుకొని ఎక్కడెక్కడో తలదాచుకుంది. ఎన్నో కష్టాలు పడింది. ఎన్నో ఆకలి రాత్రులు గడిపింది. కానీ ఏ రోజు శిరీష్ అమ్మ ఆర్కే నిందించలేదు. తన కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూసేది. ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి దశాబ్దాలు గడిచాయి. మున్నా మీద అన్ని ఆశలు పెట్టుకుని పెంచుతూ మున్ననే జీవితంగా మలుచుకుంది. పెద్దయ్యే కొద్దీ మున్నా నాన్నను చూడాలన్న పట్టుదలతో.. నాన్న ను నాన్న ఉంటున్న సమాజాన్ని చూసి ఇదే కదా నిజమైన సమాజం. అమ్మ ఇన్ని కష్టాల తో మనం ఎందుకు బయట ఉండాలి అన్ని ప్రేమలు ఉన్నా నిజమైన ప్రపంచం ఇదే కదా మనం ఇక్కడే ఉందాం. అంటూ మున్నా అమ్మను బ్రతిమాలాడు. శిరీష కుప్పకూలిపోయింది. తనకున్న ఒక్క తోడు కూడా తెగిపోయింది. అడవిలో ఉందామంటే ఆరోగ్యం సహకరించదు. అందుకే ఒంటరిగా మళ్లీ తన జీవితంతో యుద్ధం చేసింది. అనేక అవమానాలతో…. అనుమానాలతో… నిత్య నిర్బంధం మధ్య… తను బతకడానికి ఎన్నో కష్టాలు పడింది. చీరల అమ్మింది. కోళ్లు పెంచింది. చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని తన కడుపు తన పోషించుకుంది. కానీ ఏ ఒక్కరికీ తనుచేయి చా చి ఆర్కే భార్యగా ఒక్కపైసా అడగలేదు. అలా దశాబ్దాలుగా తను జీవించంది. చాలా సార్లు ఆర్కె.. Maoist leader R.K. Love story
నీ జీవితాన్ని నువ్వు ఎంచుకో… నీవు ఇక్కడికి రాలేకపోతున్నావు. కనుక మరో జీవితాన్ని ఎంచుకొని సంతోషంగా ఉండు అంటూ వేడుకున్నాడు. అయినా శిరీష ఎప్పుడూ ఒప్పుకోలేదు సరి కదా… నీవే ముందుగా ఒకరిని పెళ్లి చేసుకో కామ్రేడ్ అని చెప్పేది. కానీ ఆర్ కె ఏ రోజు ఆ ప్రయత్నం చేయలేదు. ముసి ముసి గా నవ్వుతూ… అదే సాధ్యంకాని పని అంటూ తోసిపుచ్చేవాడు. ఇలా ఒకరికొకరు.. ఒక్కరికై ఒకరు జీవించారు. తను ఎంత దూరంలో ఉన్నా.. తన ప్రేమ జ్ఞాపకాలతో జీవించిన శిరీష… ఈరోజు ఒంటరి అయింది. ఎంతో కష్టపడి కనిపించిన కడుపుకోత దూరమైనా బరంచింది శిరీష. ఇక సాధ్యం కాకపోవచ్చు ఏమో?? శిరీష గుండెల్లో ఉన్న అగ్నిపర్వతం గురించి అమరుల బంధుమిత్రుల కుటుంబాలలో ఉన్న మా అందరికీ తెలిసిన విషయమే… అందుకే ఆర్ కె అమరత్వం చెందాడు అన్న వార్త విన్నప్పుడు. ఆర్కే జ్ఞాపకం గన్న శిరీష నే ప్రశ్న అయి నిలిచింది. ఆర్కే లేని నిజాన్నిశిరీష జీర్ణించుకో గలదా ?? Maoist leader R.K. Love story
శిరీష అక్క నేనెప్పుడూ అన్నట్టుగానే మీరు గొప్ప ప్రేమికులు… మీరు మాకు ఆదర్శం మూర్తులు… అన్న ఆశయం కోసమేనా నీవు గుండె ధైర్యం చేసుకుంటావని ఆశిస్తున్నాను.
కన్నీళ్లతో వేడుకుంటున్నాను…”
సుమ అరుణ ఫేస్ బుక్ నుంచి…
👌👏👍🌹😭💘