Mahaprasthana of Bapu dolls-4 బాపు బొమ్మల మహాప్రస్థానం..4
Mahaprasthana of Bapu dolls-4
బాపు బొమ్మల మహాప్రస్థానం..4
చలం గారు చెప్పినట్లు ” ఈనాటి కవిత్వమంతా ఏమిటి? ఎందుకు వుంది? ఏం చేస్తోంది?” అనీ దిఖ్ఖరించి అడిగే తెలుగు ప్రజలకు. శ్రీశ్రీ కవిత్వం ప్రత్యుత్తరం”. యోగ్యతా పత్రం నుంచి !!
‘శ్రీశ్రీ’… రెండక్షరాలే కానీ..వాటి శక్తి ‘ అనంతం’.!
ఇరవయ్యో శతాబ్దపు తెలుగు కవిత్వం మీద తిరుగులేని నియంతృత్వం చలాయించాలని నిశ్చయించుకొని ఓ కమిట్మెంట్ తో కవిత్వం రాశారు శ్రీశ్రీ. తొలినుంచీ ఆయన కవిత్వానికి ధిక్కార గుణమే ప్రాతిపదిక. కల్పనా ప్రపంచం నుంచి కవిత్వాన్ని వాస్తవ లోకానికి మళ్ళించడమే ఆయన ధ్యేయం. నిష్టురమైన నిజాన్ని ఆయన ఆరాధించాడు. ఎప్పుడూ కొత్త దనం కోసమే అన్వేషించాడు.దానికోసం కఠోర తపస్సు చేశాడు.ఎన్ని కష్టాలు,నష్టాలు వచ్చినా లెక్క చేయలేదు. తపోభంగం లేకుండా కవితా మహాప్రస్థానం కొనసాగించాడు.కళా రవిగా వెలుగులు విరజిమ్మాడు.
*’కళారవీ’…!!
“పోనీ, పోనీ,
పోతే పోనీ !
సతుల్, సుతుల్, హితుల్ పోనీ !
పోతే పోనీ !
రానీ, రానీ !
వస్తే రానీ !
కష్టాల్, నష్టాల్!
కోపాల్, తాపాల్, శాపాల్ రానీ !
వస్తే రానీ !
తిట్లూ, రాట్లూ, పాట్లూ,రానీ!
రానీ,రానీ !
కానీ, కానీ !
గానం, ధ్యానం!
హాసం,లాసం ,
కానీ, కానీ !
కళారవీ,! పవీ ,! కవీ !
.. శ్రీశ్రీ 11.7.1934.
శ్రీశ్రీ కవిత్వంతో తన మమేకతను
ఈ గేయంలో శ్రీశ్రీ కవిత్వంతో తన మమేకతను చాటుకున్నాడు. కళారాధన ఒక తపస్సు లాంటిది. కళాకారుడొంక యోగి. కళా నిష్ఠుడైన యోగి సమాధినిష్ఠుడై తన ఆంతరంగిక లోకాలని దర్శిస్తాడు.తన తేజో స్పర్శచే స్పృశించే సార్వ లౌకిక విషయాల్ని కళాత్మకంగా మార్చివేస్తాడు. కవి దివ్యానిష్టుడు. భవ్యా విష్టుడు. Mahaprasthana of Bapu dolls-4
బాపు గారు కళారవీ! కవితకు ‘బొమ్మ’..
కళారవీ! కవితకు ‘బొమ్మ’ వేయడానికి బాపు గారు. పెద్దగా ఆలోచించాల్సిన అవసరం రాలేదు. శ్రీశ్రీ గారి ‘చిరదీక్షా తపస్సమీక్షణ’ కళ్ళ ముందు మెదిలింది. అంతే కవితా తపస్సు చేస్తున్న ‘ శ్రీశ్రీ ‘ ని సజీవంగా మన ముందు నిలిపారు. ధ్యానం లో వున్న కళారవి శ్రీశ్రీ. చేతిలో తంబూర సంగీతానికి చిహ్నం..సాహిత్యం సంగీతం కేవలం పిల్లలు. ఒకటి ఆపాత మధురం(సంగీతం) ఇంకొకటి (కవిత్వం) ఆలోచనామృతమ్ ‘ అందుకే గానం, ధ్యానం చేస్తున్న యోగి పుంగవడిగా శ్రీశ్రీ కళ్ళముందు మెదిలాడు. ఇంకేంఈ బొమ్మ ఇలా మన ముందు నిలిచింది.
*బ్నిం వివరణ..!!
“కవికి అడ్డంకులుండొచ్చు.! కవిత్వానికి ఆటంకాలు వుండవు.కవిచేస్తున్న ప్రయాణ ప్రవాహాన్ని ఆపి తమ వైపు తిప్పుకుందామనుకున్న మదాంధులు,ధనాంధులు, కవిని చాలా ఇక్కట్లు పెట్టారు.ఈ కట్లకి,చీకట్లోకి, కట్టు బాట్లకి కూడా ఆగక సాగిపోవటమే ధ్యానం.. ధైర్యంగా తను గొంతు వినిపించడం మే గానం.! పోతన భాగవతానికి ,అన్నమయ్య కీర్తనలకి కూడా ఇలా తపోభంగం చేయాలని చూశారు. Mahaprasthana of Bapu dolls-4
బాపుగారు ధ్యాన ముగ్ధుడైన కవిని భావించారు.ఆయనని శ్రీశ్రీ లాగే ఊహించారు.గానం..ధ్యానంతో వున్న పరమ శివుని భంగిమలో కూర్చోపెట్టి ,ఆ వెనుక కాంతి చక్రం (ఆర)ఎర్రగా చూపడం ప్రజ్ఞా..ఉపజ్ఞా కూడా” అంటారు ‘బ్నిం’…!!
ఎ.రజాహుస్సేన్, రచయిత
హైదరాబాద్..!!