Kuntala Falls – Bitter Memories .. 04 కుంటాల చేదు జ్ఞాపకాలు..
Kuntala Falls – Bitter Memories .. 04
కుంటాల జలపాతం – చేదు జ్ఞాపకాలు..
జిల్లా రిపోర్టర్ ల నుంచి వార్తల కోసం ఫోన్ లు..
కుంటాల జలపాతంలో పడి మృతి..
టీవీ ఛానల్స్ లలో భ్రేకింగ్ వార్తలు..
రెండవ గుండం పైనుండి జాలువారుతు వచ్చే నీటి ప్రవాహం వలయాకారంలో సుడి తిరుగుత ఉంటుంది.. కావున అందులో ఎవరు పడ్డా పైకి రాకుండా మునగడం ఖాయం… గల్లంతైన వారి స్నేహితుల వద్ద ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్న మేము వార్తను కంపోజ్ చేయడానికి పైకి వచ్చేశాము.. అప్పటి వరకు ఆకలి మరిచిన మేము అలసిపోయాము… నీరసంగా అనిపిస్తుంది.. అక్కడున్న క్యాంటీన్ లలో ఏది దొరికితే అది కడుపులోకి అప్ లోడ్ చేద్దామని సిద్ధమయ్యాము.. అంతలో అప్పటి వరకు నెట్వర్క్ లేక మూగబోయిన మా ఫోన్ లు పైకి వచ్చేసరికి ఒక్కసారిగా మోగడం ప్రారంభమయ్యాయి…
జిల్లా రిపోర్టర్ ల నుంచి వార్తల కోసం ఫోన్..
స్టాఫ్ రిపోర్టర్ల నుండి ఫోన్ లు.. వార్త పంపేందుకు ఇంత ఆలస్యమా అంటు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.. జలపాతానికి 5 కిలోమీటర్ల దూరం వెలితే కాని ఇంటర్నెట్ రాదు అక్కడికి వెల్లి వెంటనే వార్త కంపోజ్ చేసి పెట్టేశాము.. ప్రింట్ మీడియా తో పోల్చుకుంటే ఎలక్ట్రానిక్ మీడియా లో వార్త సేకరణ లో కష్టం ఎక్కువ… వార్తకు సంబంధించి వివిధ కోణాలలో వీడియోలు చిత్రికరించి వాటిని స్క్రిప్ట్ కు తగ్గట్లు వరుసక్రమంలో పేర్చి సపోర్ట్ బైట్స్ జత చేసి పంపిచాల్సి ఉంటుంది.. చెప్పడానికి సులభంగా ఉన్న చేతల్లో మాత్రం చాల కష్టం. జలాపాతం వద్ద సిబ్బంది లేమి,అడుగడుగున అటవీశాఖ నిర్లక్ష్యాన్ని ఎండగడుతు వార్త పంపాము(జలపాతం అటవీ శాఖ నిర్వహణ లో ఉంది)…
టీవీ ఛానల్స్ లలో భ్రేకింగ్ వార్తలు..
మా నుండి ఎప్పడెప్పుడు స్టఫ్ వస్తుందో అని ఎదురు చూసినట్లున్నారు ఛానెల్ వారు పంపిన వెంటనే అన్ని ఛానల్ లలో బ్రేకింగ్ లు ప్రారంభమయ్యాయి… హమ్మయ్య ఓ ఘట్టం ముగిసిందనుకోని వెంటనే క్యాంటీన్ లోకి వెల్లి కడుపు నింపుకున్నాము. అప్పటికి సమయం సాయంత్రం 6 దాటింది.. గాలింపు ఎక్కడివరకు వచ్చిందో తెలుసుకోవడానికి మల్లి జలపాతం కిందికి దిగాము. ఆ సమయంలో జలాపాతం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షంతో క్రమంగా నీటి ప్రవాహం పెరుగుతుంది…. దానికి తోడు చీకటి జతకట్టడంతో గాలింపు చర్యలను ఆపేశారు..తెల్లవారుజామునే మల్లి గాలింపు చర్యలను ప్రారంభిస్తామని పోలిసులు తెలిపారు ..దాంతో మేము మా స్వగృహాలకు తిరుగు ప్రయాణమయ్యాము. కుంటాల గ్రామానికి చెందిన గజ ఈతగాల్ల బృందానికి విశేషమైన పేరుంది….
జలపాతంలో ప్రాణాలు కోల్పోయిన వారిని రక్షించే..
సాహస బాలుడు అవార్డు గ్రహీత అయిన సోమన్న నేతృత్వంలో ఈ బృందం ఉంటుంది… 2001 లో కుంటాల జలపాతం వద్ద పెద్ద ప్రమాదం చోటుచేసుకుంది…కుంటాల చరిత్ర లోనే అతి పెద్ద ప్రమాదంగా చెప్తారు ఈ ఘటనను…బెల్లంపల్లి నుండి వచ్చిన 6 గురు పర్యాటకులతో పాటు ఓ బ్యాంక్ మేనేజర్ కుటుంబానికి చెందిన నలుగురు, మరో ఇద్దరు జీపు డైవర్, క్లీనర్ లు మొత్తం 12 మంది అనుకోకుండా వచ్చిన నీటి ప్రవాహం లో కొట్టుకపోయారు…బెల్లంపల్లి నుండి వచ్చిన 6 గురు పర్యాటకులు ప్రాణాలుకోల్పోగా, బ్యాంకు మేనేజర్ కుటుంబాన్ని, జీపు డ్రైవర్, క్లీనర్ మొత్తం 6 గురిని సోమన్న కాపాడగలిగాడు..
సోమన్నకు ధైర్య సహాస బాలుడి అవార్డు..
అప్పుడు సోమన్నా కు 16 ఏళ్ల వయస్సు… సోమన్న ధైర్య సాహసాలను మెచ్చిన అప్పటి ప్రభుత్వం సాహాస బాలుడు అవార్డు ఇచ్చి సత్కరించింది… జలపాతం వద్వద్ద చిన్న క్యాంటీన్ పెట్టి ప్రస్తుతం తన బతుకు బండిని లాగుతున్నాడు సోమన్న. జలాపాతం వద్ద నుండి ఇంటికి తిరుగు ప్రయాణమవుతున్న మాకు వార్తకు బలం చేకూర్చే ఓ అధ్బుతమైన అస్త్రం దొరికింది… దాంతో మల్లి జలపాతం వైపుకు మా ద్విచక్ర వాహనాలను తింపాల్సి వచ్చింది… (తరువాయి 5వ భాగంలో )
సాయి కిరణ్ జాదవ్, జర్నలిస్ట్ ఆదిలాబాద్