Ap39tv న్యూస్
ఫిబ్రవరి 5
గుడిబండ:-భారతదేశంలో మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం రాజస్థాన్ కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండోది1959 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ లోని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో లో ఈ వ్యవస్థను ప్రారంభించారు 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1994 లో కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని చేసింది ప్రస్తుత వ్యవస్థ దీనికి అనుగుణంగా ఉంది కేంద్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ రాష్ట్రాల మంత్రిత్వ శాఖలతో దీనికి సంబంధించిన కార్యక్రమాలను చేపడుతుంది ఏప్రిల్ 24న పంచాయతీ రాజ్ దినోత్సవం గా కూడా పాటిస్తున్నారు. అనంతపురం జిల్లా గుడిబండ మండలం కొంకల్లు గ్రామ పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు అయినప్పటి నుండి ఇప్పటి వరకు కొంకల్లు గ్రామ సర్పంచుల వివరాలు పరిశీలిస్తే మొదటి సర్పంచ్ మరేగౌడ్ s/o దాసేగౌడ్ 2వ హనుమంత రాయప్ప s/o చిక్కా హనుమప్ప 3వ 4వ పూజారి పెన్నోఒబులప్ప s/o. చీక్కబడ్డప్ప 5వ వెంకటేష్
s/oహనుమంతప్ప 6వ డీసీ లింగన్నs/o సిద్ధ రామప్ప..7వ ఓబన్నs/o పెద్ద ఓబన్న 8 వ హనుమంత రాయప్ప s/o నరసప్ప సర్పంచులుగా కొనసాగారు ప్రస్తుతం కవిత w/o ఓబన్న ను వైయస్సార్ సిపి నాయకులు ఎన్నుకున్నారు తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి గా లక్ష్మమ్మ w/o శ్రీరామప్ప పోటీ చేస్తున్నారు గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి ఏది ఏమైనా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు వీధి దీపాలు మరియు అనేక సమస్యలను పరిష్కరించే దిశగా ప్రజలకు సేవచేసే భాగ్యాన్ని ఎవరికి అవకాశం కల్పిస్తారో వేచి చూడాలి
కొంకల్లు శివన్న
రిపోర్టర్
Ap39tvన్యూస్
గుడిబండ