Header Top logo

Kidnapped By Naxals -07 ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిన నక్సల్స్

కిడ్నాప్

నక్సల్స్ చెరలో ఎమ్మెల్యే-07

మల్హోల్ రావు ఏ తప్పు చేయలేడు.. అయినా.. అతనిని నక్సల్స్ కాల్చీ చంపారు. కారణం..? అతను తెలుగుదేశం పార్టీకి చెందిన మండలాధ్యక్షుడు కావడమే. టీడీపీ ప్రభుత్వం నక్సల్స్ కార్యకలపాలను అణిసింది. ఎన్ కౌంటర్ లో చాలా మంది నక్సల్స్ ను హత్య చేసింది. కానీ.. ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలో లేదు. నేను ప్రతి పక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను.. నన్ను విడిపించడానికి నక్సల్స్ ను రిలీజ్ చేస్తారా..?

ఇప్పటికే రేడియోలో నన్ను నక్సల్స్ కిడ్నాప్ చేశారని వార్తలు వచ్చాయి… టీవీలో భ్రేకింగ్ వార్తలు వస్తుండచ్చు.. తెల్లారి డెయిలీ పేపరులో అన్నీ నా కిడ్నాప్ వార్తలే రావచ్చు.

నన్ను కిడ్నాప్ చేసారని తెలియగానే కన్న తల్లి హృదయం ఎంత తల్లడిల్లుతుందో..

కన్న తండ్రి ఎంత బాధ పడుతాడో.. భార్య నళిని.. ఇద్దరు కూతురులు ఎంత ఆందోళన చెందుతున్నారో..

నన్ను కిడ్నాప్ చేసారని బంధువులు.. శ్రేయోభిలాషులు ఇంటికి వస్తుండొచ్చు..

ఏడు గంటల ముందు వరకు నేను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిసిన సంతోషంతో ఉన్నాను.ఇప్పుడు నక్సల్స్ బందిలో బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్ల తీస్తున్నాను.

24 గంటల్లో నక్సల్స్ ను జైల్ నుంచి రిలీజ్ చేయక పోతే..

నన్ను ఖతం చేస్తామని కలెక్టర్ కు పంపిన లేఖలో హెచ్చరించారు నక్సల్స్..

అంటే..? నేను ఈ భూమి మీద బతుకడానికి కొన్ని గంటలే..

పుట్టిన ప్రతి మనిషికి చావు తప్పదు.. ఆ చావు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు..

కానీ.. నా చావు కళ్ల ముందు కనిపిస్తోంది.. నక్సల్స్ తమ లక్ష్యం కోసం పోరాటాలు చేస్తున్నారు.

ఒకవేళ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే నన్ను ఖతం చేసి తమ ఉనికి చాటుకుంటారెమో నక్సల్స్..

అయినా.. నక్సలైట్లు నన్ను కిడ్నాప్ చేసినట్లుగా వ్యవహరించడం లేదు.

నేను పారి పోతానని నా కాళ్లు, చేతులు కట్టేయలేరు.. హింసించడం లేదు ఎందుకు..?

నన్ను కిడ్నాప్ చేసిన నక్సల్స్ ఎంతో మర్యాదగా మాట్లాడుతున్నారు.

అడవిలో కూడా నాకు అవసరమగు అన్నీ సదుపాయాలు కల్పిస్తున్నారు.

నేను కిడ్నాప్ అయ్యాను.. కానీ.. నన్ను మర్యాదగా చూసుకుంటున్నారు నక్సల్స్.

‘‘ప్రాంతీయ వార్తలు విన్న తరువాత భయం వేస్తుందా.. దీర్ఘ ఆలోచనలో ఉన్నావు.. ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాని ఆలోచిస్తున్నావా..?’’ నన్ను అడిగాడు దళ నేత ప్రసాద్.

గడిచిన నా జీవితం గుర్తుకు వచ్చింది. మొదటి నుంచి ఈ బూర్జువ రాజకీయాలంటే నాకు ఇష్టం ఉండేది కాదు.. ఈ బూర్జువ రాజకీయాలు వద్దురా.. అంటూ నాన్న చెప్పేవాడు.. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలంటే గిట్టక ఎన్టీఆర్ తో రాజకీయాల్లోకి వచ్చాను. చట్టాన్ని గౌరవించే నేను ఎవరు తప్పు చేసినా.. తప్పే అనే మెంటాల్టీ..

అందుకే కార్యకర్తలు తప్పు చేసినా.. శిక్ష అనుభవించాలని భావించే వాణ్ణి.. నేనేప్పుడు పోలీసు స్టేషన్ లో ఫైరావీలు చేసి నా కార్యకర్తకు సహాయం చేయక పోవడానికి చట్టం అంటే నాకు ఎనలేని గౌరవం.. ఒకరు వేలేత్తి నా వైపు చూపించవద్దనేది నా ఫాలిసీ.. కానీ.. తెలిసి ఎప్పుడు తప్పు చేయలేదు.. పొరపాటున తప్పు చేసుంటే మార్చుకుంటాను.. భయమంటావా..? పుట్టిన ప్రతి మనిషికి చావు తప్పదు.. మనిషి ఎక్సిడెంట్ లోనో.. రోగంతోనో చని పోయేకంటే.. తప్పు చేయకుండా ఇలా చని పోతే నా చావు చరిత్రలో నిలుస్తోంది. ఇకపోతే.. ఇక్కడి నుంచి తప్పించుకోవానే ఆలోచనే నాకు రాలేదు..’’ అన్నాను.

అప్పటికే పడమర దిక్కు సూరీడు గుట్ట మధ్య నుంచి నిష్క్రమించి గంటయింది.. వెలుతురు వెళ్లి పోవడంతో చీకటి రాజ్యమేలడానికి వచ్చినట్లుంది. ఎక్కడో దూరంగా నక్కల అరుపులు వినిపిస్తున్నాయి. చల్లని గాలికి చెట్లు ఊగుతున్నాయి. మాకు కొంత దూరంలో రెండు గంటలుగా సెంట్రీ చేస్తున్న దళ సభ్యుడికి రిలీవ్ ఇచ్చాడు మరో దళ సభ్యుడు.

శతృవు నుంచి ప్రమాదం ఉంటుందని ఇరువై నాలుగు గంటలు సెంట్రీ డ్యూటీ చేస్తూ తమను తాము నక్సల్స్ రక్షించుకుంటారనిపించింది. పోలీసులు ఉమ్మడిగా తమ స్థావరంపై దాడి చేసిన ఎదుర్కోవడానికి నక్సల్స్ వద్ద అధునాతమైన ఆయుధాలున్నాయి. పోలీసులకు కనబడకుండా మా చుట్టూ మందుపాతరలు భూమిలో పాతి పెట్టారు. ఒకవేళ పోలీసులు మా వద్దకు రాగానే మందుపాతరు పేల్చడానికి రిమోట్ కంట్రోల్ తమ వద్ద పెట్టుకున్నాడు దళ కమాండర్ ప్రసాద్.

అంతుల వారిగా రెండు గంట చొప్పున సెంట్రీ డ్యూటీ చేస్తున్నారు నక్సల్స్. డిప్యూటీ దళ కమాండర్.. ముగ్గురు దళ సభ్యులు రాత్రంతా ఎప్పుడెప్పుడు సెంట్రీ డ్యూటీ చేయాలో వివరించి తాను ఎప్పుడు సెంట్రీ చేస్తాడో చెప్పాడు దళ కమాండర్ ప్రసాద్.. రామడుగు నుంచి సుమారు పది కిలో మీటర్ల దూరం కాలి నడుకన నడిసి ఉంటాము.. కాళ్లు నొప్పులు పెడుతున్నాయి.

అయినా.. అక్కడి నుంచి మరో ప్రాంతానికి నడువడం ప్రారంభించాము. గంట నడిచిన తరువాత గౌరారం అడవులకు చేరుకున్నాము. సెక్యూర్టీ ఉంటుందని గుట్టపైన కూర్చున్నాము. ఆ చీకట్లో చెట్లు.. రాళ్లు కూడా కనిపించడం లేదు. కానీ.. వెలుతురుంటే.. అక్కడి నుంచి పోలీసుల కదలికలు కనిపిస్తాయి. ధర్పల్లి`ఇందల్వాయి మధ్య రోడ్లో వెళ్లే వాహణాలు కనిపిస్తున్నాయి.. కానీ.. చలిలో శరీరం వణుకుతుంది. ఆ చీకట్లో వీస్తున్న చలి గాలులను తట్టుకోలేక పోతున్నాను. రాత్రి పది గంటల తరువాత గౌరారం తాండాలోనికి వెళ్లాము. నక్సల్స్ ను చూసిన గిరిజనులు ఆత్మీయతతో పలుకరించారు. నా వైపు విచిత్రంగా చూసారు ఆ గిరిజనులు..

‘‘భయ్యా వచ్చాడు’’ అంటూ నన్ను పరిచయం చేసాడు దళ కమాండర్ ప్రసాద్. కుటుంభీకులు వారి కోసం ఎండిన చాప కూర.. రొట్టె రడి చేసుకున్నారు గిరిజనులు. పొద్దున నుంచి బోజనం చేయనట్లున్నారు నక్సల్స్..వారి కోసం వంట చేసుకున్న వంటనే ఆ గిరిజనులు వడ్డన చేయగానే తిన్నారు.. ఆ గిరిజనులు ‘‘తిను తినూ అన్నా..’’ అంటూ అప్యాయతతో కొసిరి కొసిరి వడ్డన చేస్తున్నారు.

నక్సల్స్ పై గిరిజనులు చూపిస్తున్న ప్రేమను చూసి ఆశ్చర్య పోయాను.

నాకు కారం ఎక్కువ తినే అలవాటు లేదు. చప్పటి బోజనం తినే అలవాటు.

కానీ.. ఆ గిరిజనులు వండిన ఎండిన చాప కూరలో కారం ఘాటు ఎక్కువుంది.

అయినా.. పొద్దున నుంచి ఏమి తినక పోయిన నాకు ఆకలిగా లేదు.

ఆలోచనలే నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

ఆ గిరిజన తాండాలోని గుడిసెలో వేడిగా ఉంది.

అక్కడే రెండు గంటలు విశ్రాంతి తీసుకున్నాము.

ఒక్కసారిగా కుక్కలు మొరుగడంతో అలర్టు అయ్యారు నక్సల్స్.

సెంట్రీ చేస్తున్న దళ సభ్యుడు గుడిచెలోనికి వచ్చి నక్క గుంపు తాండా దగ్గరకు వచ్చినట్లుంది. వాటి అరుపుకు కుక్కలు అరుస్తున్నాయి అన్నాడు.

చేతికి ఉన్న గడియారంలో టైమ్ చూసాను. అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది.

బయట చలి ఎక్కువగా ఉంది. ఆ గిరిజనులు ఇచ్చిన మూడు దుప్పట్లను తీసుకుని మళ్లీ అడవిలో నడవడం ప్రారంభించాము. చంద్రుడి వెలుగులో జిగ్జగ్ తోవలో నడుస్తున్నాము.

ఆ తాండా నుంచి ఇద్దరు గిరిజన యువకులు మాతో పాటు వస్తున్నారు.

సెక్యూర్టీ దృష్ట్యా నక్సల్స్ రోడ్ పై వెళ్లడం లేదనిపించింది. ఒకవేళ రోడ్ పై వెళితే పోలీసులు మాటు వేసి కాల్పులు జరుపుతారని నక్సల్స్ భావించి ఎప్పుడు కొత్త మార్గంలోనే వెళుతారనిపించింది.

ఈ దట్టమైన అడవిలో తమ గమ్యం చేరడానికి నడుస్తున్నప్పుడు తప్పి పోయే అవకాశం ఉంటుందనిపించింది.

అయినా.. చెట్ల మధ్య నుంచి నడిచి వెళుతున్నాము.. ఎక్కడ కూడా తప్పి పోయినట్లనిపించలేదు. ఆ నక్సల్స్ వద్ద టార్చ్ లైట్టన్నాయి..

కానీ.. ఆ చీకట్లో ఎప్పుడు ఉపయోగించలేరు.

కారణం..?

రాత్రి వేళ టార్చ్ లైట్ ఉపయోగిస్తే ఆ వెలుతురు చాలా దూరం కనిపిస్థుందని నక్సల్స్ భావిస్తారు.

తప్పదనుకున్నప్పుడు మినహా ఎప్పుడు ఆ టార్చ్ లైట్ ను ఉపయోగించలేరు వారు.

నిశ్చబ్దంగా ఒకరిని అనుచరిస్తూ మరోకరం నడుస్తున్నాము.

ఆకాశం నుంచి చంద్రుడు వెదజల్లుతున్న వెన్నెల మమ్మలిని గమనిస్తున్నడనిపిస్తోంది.

రెండు గంటలు నడిచిన తరువాత ఓ గుట్టపైన స్థావరం ఏర్పాటు చేసారు.

గౌరారం తాండా నుంచి మాతో వచ్చిన ఇద్దరు మిలిటెంట్లు వెళ్లిన తరువాత డొన్కల్ గ్రామం నుంచి మరో ఇద్దరు మిలిటెంట్లు వచ్చారు. అక్కడి నుంచి మరో కిలో మీటరు నడిచాము.

ఎత్తైన గుట్టపైకి వెళ్లి చుట్టూ పరిసర ప్రాంతాలను పరిశీలించాడు దళ కమాండర్ ప్రసాద్.. చిన్న పొరపాటు జరిగినా.. ప్రాణాలు పోతాయని దళ నేతకు తెలుసు.

MLA Kidnapped By Naxals -06 ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిన నక్సల్స్

పోలీసులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అతను. ఆ గుట్టపైకి వెళ్లే మార్గంలో మందుపాతరలు పెట్టి తాము పడుకునే స్థలం వరకు విద్యుత్ వైరు తీసుకుని సెంట్రీని పెట్టి నిదుర పోయాము.. మాతో పాటు తెచ్చుకున్న దుప్పట్లు చలి నుంచి రక్షిస్తున్నాయి.

కానీ.. నాకు నిదుర రావడం లేదు.

‘‘అన్నా.. మీకు తెలిసిందా.. మనోళ్లు ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసారట..’’ అన్నాడు ఓ మిలిటెంట్.

‘‘వాడేమి తప్పు చేసాడో.. అందుకే కిడ్నాప్ చేసిండ్రు.’’ అన్నాడు మరో మిలిటెంట్.

‘‘ఔనా..?’’ ఏమి తెలియనట్లు అన్నాడు దళ కమాండర్ ప్రసాద్.

‘‘సరే.. గాని.. కుక్కలు (పోలీసులు) కనబడ్డాయా..’’ అడిగాడు డిప్యూటి దళ కమాండర్ కూర మల్లన్న.

‘‘పోలీసులు రావడం లేదు.’’ అన్నాడు మిలిటెంట్.. నేను అక్కడే ఉన్నా నన్ను ఆ మిలిటెంట్లు గుర్తు పట్టడం లేదనిపించింది.

అరగంట పాటు ఆ అర్దరాత్రి మిలిటెంట్లతో మాట్లాడారు నక్సల్స్.

ఆ తరువాత చలికి గొంగడి కప్పుకుని పడుకున్నాను. ఆలోచనలతో నాకు నిదుర రావడం లేదు.

తెల్లవారు జామున కంటికి నిదుర పట్టినట్లనిపించింది.

(అడవిలో రహాస్య ప్రాంతంలో ఉన్న స్థావరానికి ఆ రోజు దిన పత్రికలు చూసి ఆశ్చర్య పోయిన ఎమ్మెల్యే.. ఎల్లుండి వరకు ఎదురు చూడాల్సిందే..)

mallesh yatakarla

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking