Header Top logo

Jaipal Reddy commits suicide ఆత్మహత్యకు ముందు జైపాల్ రెడ్డి..

Jaipal Reddy before committing suicide

ఆత్మహత్యకు ముందు జైపాల్ రెడ్డి అంతరంగం..
ఫేస్ బుక్ లో పోస్ట్ ఇదే..

నా అనారోగ్యమే నన్ను ముప్పుతిప్పలు పెడుతూ ఆగంజేస్తుంది.
గత 18 సంవత్సరాల నుంచి నాతో నేను ఎప్పుడూ చెప్పుకునే మాటలు
” #ధైర్యముంటే ఈధరణీ పైన సాధించనిదంటూ ఏది లేదు” అని నన్ను నేనే కొండంత ధైర్యాన్ని నూరిపోస్తూ
ఆత్మస్థైర్యంతో ఇంతకాలం లోపల కష్టాలు ఉన్నప్పటికీ బయటకు మాత్రం సంతోషంగా కనిపించే ప్రయత్నం చేశాను.

#అప్పుడు,
అది 2003వ సంవత్సరం ఫైల్స్(అర్శమొలలు) వ్యాధి కారణంగా విపరీతంగా నొప్పి భరిస్తూ వచ్చాను.
ఆ ఫైల్స్ వల్ల నా ఆహారపు అలవాట్లలో ఎన్నో మార్పులు చేసిన తర్వాత రోజుల్లో మెల్లమెల్లగా కొన్ని సంవత్సరాల తర్వాత దాదాపుగా తగ్గింది.

#ఆ_మధ్య,
2014 సంవత్సరం ఆగస్టు తర్వాత
అప్పుడు నేను రామాయంపేట,మెదక్ జిల్లాలో ఉండేవాణ్ణి.
హెర్నియా (Hernia) వచ్చి
ఏకంగా అటుఇటుగా మూడు సంవత్సరాలు కదిలితే కష్టం, నడిస్తే నరకం లాగా అనిపించినప్పటికీ నా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఎక్కడ అర్ధాంతరంగా ఆపలేదు. అది చివరకు 2017 జూన్ మాసంలో సర్జరీ వరకు వెళ్ళింది. అటుపిమ్మట, సమస్య పరిష్కారం జీవితం సుఖాంతమైంది.

#ఈమధ్య,
2018 చివరలో భయంకరమైన గ్యాస్ట్రిక్ సమస్య వచ్చి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఆమాంతంగా 2019 సంవత్సరం సంపూర్ణంగా రూమ్ కే పరిమితం చేసింది.
అంటే, ఇంటికి వెళ్ళడం వ్యవసాయ పనులు చేయడం, నర్సంపేట- వరంగల్ లో ఉండటం జరిగింది.

మొత్తానికి డిసెంబర్-2019 లో మళ్ళీ తిరిగి తట్టబుట్ట సదురుకుని పట్నం వచ్చిన సంది ఈ గ్యాస్ట్రిక్ సమస్య తిన్న తిండి పెయ్యికి,శరీరానికి పట్టకుండా చుక్కలు చూపిస్తున్నప్పటికీ బాధను పంటిబిగువుతో భరిస్తూ భయపడకుండా బతకడమే నేర్చుకున్నాను.
కొంత డిప్రెషన్ కు గురైన మాట వాస్తవమే. దానికి తగిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ
అటు మానసిక పునరుత్తేజానికి, శరీరక ఉల్లాసంగా ఉండటానికి ఏకంగా ఓ ఎనిమిది నెలల సమయం పట్టింది.

ఆసుపత్రికి వెళ్లి పలురకాల టెస్ట్ లు చేసుకోవడంతో అన్ని Normal వచ్చాయి. ఈ విషయం నాకు యుద్ధంలో గెలిచిన వీరుడిలా సంబరిపడిపోయాను. ఎగిరి గంతేసిన క్షణాలు ఇప్పటికీ కళ్ళముందు కదలాడుతాయి. హమ్మయ్య గండం గడించింది. ఇక భవిష్యత్ అంతా సంతోషంగా సాగిపోతుందని సంతృప్తి చెందాను. ఈ ముచ్చట జనవరి-2021 లో అనుకున్నాను.

అంతా సవ్యంగా సాగితే అది జీవితం ఎందుకు అవుతుంది.
మళ్ళీ మార్చి నెల చివరలో 2021 గ్యాస్ట్రిక్ సమస్య మళ్ళీ నా బతుకు ప్రయాణం పైన పంజా విసిరింది. అయితే దానిపై నేను మందు గోళీలు వాడి నయం జేసుకునే పని ముందేసుకుని ఆత్మస్థైర్యంతో ముందుకు పోయిన.
సరిగ్గా జులై మాసం వచ్చే సమయంలో నన్ను ఆలోచింపజేసే అంశం మనసును తట్టింది.
అదే IMPACT స్వచ్ఛంద సంస్థ.
( జులై 2021 నుంచి గౌరవ గంపా నాగేశ్వరరావు సార్ గారు తన మిత్రులు కలిసి సేవా ముసుగులో వ్యాపారం చేస్తున్న విషయం పైన పరిశోధన జరపడానికి నిశ్చయించుకున్నాను).

ఓ వైపు భయంకరమైన గ్యాస్ట్రిక్ సమస్య మరోవైపు ఇంప్యాక్ట్ గురించి పరిశోధన మరోవైపు కరోనా కారణంగా నా స్వచ్ఛంద సేవలు ఆగిపోయాయి నన్ను మానసికంగా జరంతా ఇబ్బంది పెడుతున్న నన్ను సర్దిచెప్పుకుని సాఫీగా సాగాను.

◆◆#తట్టుకోలేకనన్నుతమాయించున్న◆◆

గత 18 సంవత్సరాలుగా ఒకటి తర్వాత
ఒక రోగం మోపై,వచ్చి నన్ను అధైర్యపరిచినప్పటికీ
నాతో నేను
నాలో నేను
లోలోపల కుమిలిపోతున్న
ఎంతమాత్రం బయటపకుండా
నేను ఎక్కడ ఇసమంతా కూడా నా ధైర్యాన్ని సడలించకుండా అఖండమైన ఆత్మవిశ్వాసంతో, మహత్తరమైన పట్టుదలతో, పకడ్బందీగా ప్రణాలికతో, వజ్ర సంకల్పంతో నేను లక్ష్యాన్ని సంపూర్ణంగా పూర్తి చేశాను.

◆◆#గతఎనిమిదిరోజులు,
గత నాలుగైదు రోజుల నుంచి మళ్ళీ ఫైల్స్ Piles మరియు ఇటు గ్యాస్ట్రిక్ సమస్య మరింత జఠిలమైంది.

ఒక రోజుకు ల్యాట్రీన్( బత్రూమ్) ఏడు ఎనిమిది సార్లు వెళ్ళాల్సి వస్తుంది. ల్యాప్టిక్ యాసిడ్ ఎక్కువగా రిలీజ్ కావడంతో విపరీతమైన వాసన వస్తుంది.
పిత్తులు రాకుండానే గ్యాస్ రిలీజ్ అవుతుంది.
అందుకే, గత ఇరవై రోజుల నుంచి ఎవరితోనైనా కలవడానికి చాలా ఇబ్బందిగా అవుతుంది.
———————————————–
#ముఖ్యగమనిక:

● ఎన్ని మందులు వాడిన ఫలితం శూన్యం. ఆరోగ్యం చక్కగా రావడానికి ఎలాంటి మార్గం కనిపిస్తలేదు.
అందువల్ల, ఇకపై జీవన గమనం కష్టంగా మారింది.

● నాకు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు, ఆర్థిక పరమైన కష్టాలు అంతకన్నా లేవు.
గతంలో ఉండేవి. మా కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని నా సమస్యలు పరిష్కరించారు.

● నాకు ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవు. నడుపలేదు, అసలు అలాంటి విషయం గురించి ఎప్పుడూ ఆలోచన రాలేదు. కారణం, చిన్నప్పటి నుండి ఆదర్శంగా ఉండాలనే బలమైన కోరిక వల్ల కావచ్చు.
లేదంటే, స్వామి వివేకానంద భావాలతో స్వచ్ఛంద సేవలను కోనసాగిస్తున్నప్పుడు మనపై ఎలాంటి మచ్చ, చెడు ముద్ర ఉండద్దనే భావనతో ఆ ప్రేమ తెరువుకు , జోలికి పోలేదు.

● 2019 సంవత్సరం నుంచి మా యాయి-బాపు( అమ్మనాన్న) , అన్నయ్య,అక్క-బావలు మరియు మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండటంతో పట్నంలో నెలకు రూమ్ ఖర్చుల నిమిత్తం ఎలాంటి అడ్డంకులు ఎదురు కాలేదు.

● నాకు ఎవరూ బధ్ధ శత్రువులు లేరు.
అలాగే, నేను ఎవరిని కూడా శత్రువుగా చూడలేదు.
సదా అందరితో కలిసి మెలిసి ఉండటమే నాకు అలవాటు.

కాసాల జైపాల్ రెడ్డి.

Leave A Reply

Your email address will not be published.

Breaking