Header Top logo

I am a Kashmiri journalist నేను కశ్మీరీ జర్నలిస్టును

I am a Kashmiri journalist

నేను కశ్మీరీ జర్నలిస్ట్…

ఖురతులైన్ రెహ్బార్ ‘ద వైర్’ కు రాస్తున్న కశ్మీరీ జర్నలిస్టు. అదీ అందరి కళ్లూ ఉన్న పుల్వామా ప్రాంతానికి చెందిన యువతి. ఇటీవల బుల్లి బాయ్ యాప్ ద్వారా వేధింపులకు గురి అయిన ఈమెను ఒక వైపు ముస్లిం మహిళ అనే కారణంగా హిందుత్వ శక్తులు ఆమె స్థైర్యాన్ని బలహీన పర్చాలని ప్రయత్నిస్తుండగా, ఇంకో వైపు కశ్మీర్ జర్నలిస్టుగా ఆమె సైన్యం బెదిరింపులను కూడా ఎదుర్కొంటోంది.

I am a Kashmiri journalist నేను కశ్మీరీ జర్నలిస్టును

ఖురతులైన్ రెహ్బార్

ద్వేషపూరిత అరెస్టులు, అన్యాయంగా మోపుతున్న అసత్య నేరాల సందర్భాల్లో కశ్మీర్ సాంప్రదాయిక సమాజంలో ఎటువంటి అభద్రతనూ, ఒంటరితనాన్నీ భరించి సత్యం వైపు నిలబడవలసి వస్తుందోనని వివరిస్తున్నారు 28 సంవత్సరాల ఖురతులైన్ రెహ్బార్. ఆమె అనుభవించిన సంఘర్షణను, దాని నుంచి స్త్రీలందరికీ ఆదర్శనీయమైన ఆచరణను తనకు తానే ఏ విధంగా రూపొందించుకుందో అనే విషయాలను ఆమె మాటల్లోనే వినాలి! ఆమె అంతరంగ కథనాన్ని, మాతృక ఆమె అనుమతితోనే ప్రచురించింది.

తెలుగు సేత: Siva Lakshmi Pattem

నేను కశ్మీరీనీ, ముస్లింనూ, జర్నలిస్టునూ, మహిళనూ

ఖురతులైన్ రెహ్బర్

శ్రీనగర్, జమ్మూ కశ్మీర్ : ప్రతి వారాంతంలో, నేను నా కుటుంబంతో గడపడానికి పుల్వామాకు ఇతరులతో పంచుకునే ఉమ్మడి సుమో టాక్సీని తీసుకుంటాను. నేను నివశిస్తూ, ఇండిపెండెంట్ జర్నలిస్టుగా పని చేస్తున్న శ్రీనగర్ నుండి పుల్వామాకు దాదాపు గంట సమయం పడుతుంది. మార్గమధ్యంలో, చలికాలంలో మరింత తీవ్రమయ్యే నా ఆందోళనను తగ్గించుకోవడానికి నేను సంగీతాన్ని వింటుంటాను.

I am a Kashmiri journalist నేను కశ్మీరీ జర్నలిస్టును

తుపాకుల కాల్పుల మధ్య జీవితం

నేను దక్షిణ కశ్మీర్లో హింస, టియర్ గ్యాస్ షెల్‌లు వీధిలో పేలడాన్ని చూస్తూ పెరిగాను. నేను చాలా చిన్న వయస్సు నుండి నా మానసిక ఆరోగ్యం దెబ్బతింటున్నట్లు భావించాను. నా పరిసరాల్లోని ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధమైన దుఃఖంతో, స్తబ్ధతతో జీవిస్తున్నారు. 2019 ఆగస్టులో కశ్మీర్ స్వయంప్రతిపత్తిని అమానుషంగా, హఠాత్తుగా రద్దు చేసినప్పుడు మేము అనుభవించిన నిస్సహాయత, అవమానం మమ్మల్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. I am a Kashmiri journalist

నా కుటుంబం బాధలు

అప్పటి నుండి రెండున్నర సంవత్సరాలలో, మీడియాలో స్నేహితులు, సహచరులను ప్రశ్నించడం, భయపెట్టడం, అరెస్టు చేయడం జరిగింది. ప్రతి రోజూ కొత్త కొత్త భయాలు, ఆందోళనలను తెస్తుంది. డిసెంబరులో నన్ను కూడా విచారణ చేయడంతో అది నా శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడం ప్రారంభించి నా ఆందోళనను రెట్టింపు చేసింది. అకస్మాత్తుగా గాభరా పడడం, బహిరంగ ప్రదేశాల్లో నేను భయాందోళనలకు గురవుతున్నాను. వీటన్నింటితో నా కుటుంబం ఎలా బాధపడుతుందోనన్న ఆలోచనలు నన్ను వెంటాడుతున్నాయి. నేను అదుపు తప్పుతున్నానని భయపడి, డిసెంబర్‌లో మొదటిసారిగా వృత్తిపరమైన సహాయాన్ని కోరాను.

I am a Kashmiri journalist నేను కశ్మీరీ జర్నలిస్టును

ఆన్‌లైన్ వేలంలో నా ఫోటో కూడా

నేను దానిని ఎదుర్కోవడానికి, చివరి గడువులోగా సాధించవలసిన లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ‘బుల్లిబాయి యాప్’ లో టార్గెట్ చేయబడిన ముస్లిం మహిళల్లో నేనూ ఒకదాన్నని తెలుసుకున్నాను. కొత్త సంవత్సరం మొదటి రోజున నేను మా ఇంటికి ప్రయాణిస్తున్నప్పుడు, ముస్లిం మహిళల ఆన్‌లైన్ వేలంలో నా ఫోటో కూడా ఉందని ఢిల్లీ నుండి ఒక జర్నలిస్ట్ స్నేహితురాలు నాకు ఫోన్ చేసింది. నేను దిగ్భ్రాంతితో అవాక్కయ్యాను, కానీ గత సంవత్సరం ఇదే విధమైన ఆన్‌లైన్ వేలం గురించి నేను రిపోర్ట్ చేసి ఉన్నందువల్ల, ఆమె ఏమి చెబుతుందో నాకు అర్థం అయ్యింది. I am a Kashmiri journalist

నా మొదటి ఆలోచన ఏమిటంటే..

నా మొదటి ఆలోచన ఏమిటంటే -‘దేవుడా, ఇది మార్ఫింగ్ చేసిన చిత్రం కాకూడదని నేను ఆశిస్తున్నాను.’ ఇది నా ఆందోళనకు మరో ట్రిగ్గర్ అవుతుందని నా స్నేహితురాలికి చెప్పినప్పుడు నా గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. నేను పుల్వామా ఇంటికి చేరుకున్న తర్వాత, గదిలో తలుపులు బిడాయించుకుని ట్వీట్ తర్వాత ట్వీట్ ఆత్రంగా, ఉద్వేగంగా చదివేశాను. వళ్లంతా తిమ్మిరెక్కినట్లు మొద్దుబారిపోయింది. నా మీద మోపిన ఈ ద్వేషపూరిత నేరం గురించి ఎవరికైనా ఏదైనా చెప్పాలా లేక మౌనంగా ఉండాలా అనేది నాకు తెలియలేదు. మొదటగా నేను నా గురించీ, నా కుటుంబ భద్రత గురించీ ఆందోళన చెందాను.

I am a Kashmiri journalist నేను కశ్మీరీ జర్నలిస్టును

జర్నలిస్ట్ లపై అణిచివేత

కశ్మీరీ జర్నలిస్టులపై అణిచివేత తీవ్రతరం కావడంతో, నేను సోషల్ మీడియా నుండి వైదొలిగాను. నేను దుర్మార్గమైన ట్రోలింగ్ గురించే గాక, నేను జీవిస్తున్న అతి సనాతనమైన సమాజంలో ఈ ఆన్‌లైన్ వేలం వంటిది స్త్రీ జీవితాన్ని నాశనం చేస్తుందని భయపడ్డాను. ప్రజలు దానిని ఏ విధంగా తీసుకుంటారో, ఒక కశ్మీరీ మహిళగా నాకు బాగానే తెలుసు. ఏ పరిస్థితులలోనైనా మహిళలను నిందించేవారు, నేను వేలం జాబితాలో ఉండటానికి కారణమేమై ఉంటుందో, అందుకు నేనేంచేశానో అని సందేహించే వారున్నారు! I am a Kashmiri journalist

I am a Kashmiri journalist నేను కశ్మీరీ జర్నలిస్టును

కొద్దిమంది మహిళా జర్నలిస్టులు

కశ్మీర్‌లో కొద్దిమంది మహిళా జర్నలిస్టులు మాత్రమే ఉన్నారు, నా కలను నెరవేర్చుకోవడానికి నన్ను అనుమతించినందుకు మా బంధువులు నా తల్లిదండ్రులను చాలా సతాయిస్తూ, ఇప్పటికీ బాధ కలిగిస్తుంటారు. నేను పుల్వామాను విడిచిపెట్టడానికి గల ముఖ్య కారణం మేమిటంటే, నామీద రాష్ట్ర నిఘా మాత్రమే కాకుండా ప్రజలు కూడా ఎల్లవేళలా నా కదలికలను గమనిస్తున్నారని భావించినందువల్లనే శ్రీనగర్ కి నా మకాం మార్చాను. లో ప్రొఫైల్‌ లో ఉండాలని ఫేస్ బుక్  వాడడం మానేశాను. మా గ్రామంలో ట్విట్టర్‌ ని ఉపయోగిస్తున్నవారు తక్కువగా ఉండడం వల్ల అక్కడ పోస్ట్ చేయడం సురక్షితమనుకున్నాను.

ప్రజలు చదవాలని నేను కోరుకుంటున్నా

నేను మాట్లాడాలంటే సంకోచించటానికి మరొక కారణ మేమిటంటే, నేనెప్పుడూ కథగా మారకూడదనుకుంటున్నాను. జర్నలిస్ట్‌గా, నా గురించి కాకుండా నా కథలను ప్రజలు చదవాలని నేను కోరుకుంటున్నాను. కొన్ని వారాల ముందు పోలీసులు నన్ను పిలిపించి ప్రశ్నించడం  గురించి నేను మౌనంగా ఉండటానికి ఇదొక కారణం. ఇతర కశ్మీరీ జర్నలిస్టులు (స్త్రీ – పురుషులిద్దరూ) కొంతకాలంగా ఎదుర్కొంటున్న బెదిరింపుల గురించి కూడా నాకు తెలుసు.

బుల్లిబాయి యాప్ విషయంలో

 కానీ బుల్లిబాయి యాప్ విషయంలో జర్నలిస్టుగా మాట్లాడటం నా బాధ్యత అని మాత్రం నేను దృఢంగా నిర్ణయించుకున్నాను. గత సంవత్సరం ముస్లిం మహిళల ఆన్‌లైన్ వేలం గురించి రిపోర్ట్ చేసిన కథనాన్ని నేను ట్వీట్ చేశాను. దాని తర్వాత, మీడియా నుండి చాలా కాల్స్ వచ్చాయి, అంతేకాదు, బోలెడంత ఒత్తిడి వచ్చింది. ఒక సమయంలో, నేనీ నివేదిక ఇవ్వడం ద్వారా సరైన, మంచి పనే చేశానా అని నాలో నేను తేల్చుకోలేకపోయేదాన్ని. వెనక్కి తిరిగి చూస్తే, నేనలా వాస్తవ సమాచారమందించి నందుకు ఇప్పుడు సంతోషిస్తున్నాను. 

I am a Kashmiri journalist నేను కశ్మీరీ జర్నలిస్టును

నన్ను ఆన్‌లైన్ వేలం పాటలో

నన్ను కూడా ఆన్‌లైన్ వేలం పాటలో లక్ష్యంగా పెట్టుకున్నారని నా తల్లిదండ్రులకు ఇప్పటికీ తెలియదు, కానీ ఇటీవల నన్ను పోలీస్ స్టేషన్‌కి పిలిపించి, ప్రశ్నించారని వారికి తెలుసు. దానికి నేను వాడుక ప్రకారం చేసే తనిఖీ అని మాత్రమే చెప్పాను. కశ్మీర్‌లో జరిగే జర్నలిస్టుల బెదిరింపుల గురించి మీకు తెలిసినప్పటికీ, మీ సహోద్యోగులు అదే విధంగా లేకపోతే ఇంకా అధ్వాన్నమైన పరిస్థితుల నెదుర్కొంటున్నారని తెలిసినప్పటికీ, మీ స్వంత విచారణకు మిమ్మల్ని ఏమీ సిద్ధం చేయదు. వాళ్లు మీ పేరు, మీ తల్లిదండ్రుల పేరు, మీ కుటుంబంలో ఎంత మంది ఉన్నారని అడుగుతారు.

ఎవరి కోసం రాస్తున్నారు?

వాళ్లు నన్ను, ‘మీ భావజాలం ఏమిటి? మీరు ఎవరి కోసం రాస్తున్నారు? మీరు ఎంత సంపాదిస్తున్నారు? మీకు ఎంతమంది సోదరులున్నారు? ఎవరైనా పాకిస్థాన్‌కు వెళ్లారా? మీ ఫేస్ బుక్ ఐ డి ఏమిటి’- అని అడిగారు. వృద్ధ తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు ఉన్నవారికి, ఈ ప్రశ్నలు ఎప్పటికీ మేల్కొనలేని పీడకలగా వెన్నులోనుంచి వణుకు తెప్పిస్తాయి. నాకు జమాతే ఇస్లామీ నేపథ్యం ఉందా అని మూడు సార్లు అడిగారు. నేను లేదని చెప్పాను. నేను ఎక్కడ పని చేస్తానో, ఏమి రాస్తానో వారికి చెప్పడంలో జాగ్రత్తగా ఉండాలనుకున్నాను, కాని నేను ఏ తప్పు చేయడం లేదని, వాళ్లు ఏ నిమిషంలోనై గూగుల్ చేసి కనుక్కుంటారని అనుకున్నాను.

ఆర్మీ క్యాంపు నుంచి నాకు కాల్

మీరు ఎక్కడ నివసిస్తున్నారు అని వాళ్లు నన్ను అడిగినప్పుడు, నేను శ్రీనగర్ అని చెప్పాను, కాని వారు నేను ఎక్కడ నివసిస్తున్నానో ఖచ్చితంగా తెలుసుకోవాలనుకున్నారు. అక్కడ నాకు సొంత ఇల్లు ఉందా అని కూడా అడిగారు. నా మటుకు నేను స్వంతంగా జీవించే స్త్రీని. నేను ఎక్కడ నివసిస్తున్నానో ఎవరికైనా ఎందుకు చెప్పాలి? అది నాకు అభద్రతగా, అసౌకర్యంగా అనిపిస్తుంది. ఫోన్‌లో మూడు రోజులుగా అవే ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. నేను ఇబ్బందుల్లో ఉన్నానా, నాపై ఎఫ్‌ ఐ ఆర్ ఉండి ఉంటే, పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయా అని నేను ఆశ్చర్యపోయాను. పోలీసుల విచారణ తర్వాత పుల్వామాలోని ఆర్మీ క్యాంపు నుంచి నాకు కాల్ వచ్చింది. పోలీసులు ఎందుకు తనిఖీ చేయాలనుకుంటున్నారో నేను అర్థం చేసుకోగలను, కానీ సైన్యానికి నా సమాచారం ఎందుకు కావాలి.

అన్నయ్యకి ఫోన్ చేసి ఆర్మీ క్యాంపుకి నన్ను

పుల్వామాలో కొన్ని దశాబ్దాలుగా రైతులు సాగు చేసుకుంటున్న భూమిని పారామిలటరీ స్వాధీనం చేసుకోవడంపై నేను చేసిన రిపోర్ట్ తర్వాత ఇది జరిగింది. వాళ్లు మా ఇరుగు పొరుగు వారిని కూడా సంప్రదించి, మా నాన్నగారి నంబర్‌ ను అడిగారు. మా అన్నయ్యకి ఫోన్ చేసి ఆర్మీ క్యాంపుకి నన్ను రమ్మని చెప్పమన్నారు. నాకు ఫోన్ చేసినప్పుడు, మీరు ఎప్పుడైనా పాకిస్తాన్‌కు వెళ్లారా అని అడిగారు. దీన్ని నేను భయోత్పాతానికి గురి చేసే బెదిరింపుగా భావిస్తున్నాను.

I am a Kashmiri journalist నేను కశ్మీరీ జర్నలిస్టును

మా కుటుంబంలో ఎవరూ కూడా పోలీసు స్టేషన్‌ కు గానీ, ఒంటరిగా ఆర్మీ క్యాంప్‌కు గానీ వెళ్లలేదు. నేను శ్రీనగర్‌లో ఒంటరిగా ఉంటున్నందుకు నా తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందారు. వారు పుల్వామాలో ఉన్నందు వల్ల నేను వారి గురించి ఆందోళన చెందుతున్నాను. శ్రీనగర్‌లోని ఆర్మీ ప్రతినిధితో మాట్లాడిన నప్పటినుంచి కాల్స్ ఆగిపోయాయి, నేను రెండు రోజులు నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాను, అయితే దీని వల్ల కలిగిన  ఒత్తిడి నా మానసిక ఆరోగ్యంపై విపరీతమైన నష్టాన్ని కలిగించింది. 

పోలీసులు కొట్టారని ట్వీట్‌ పై

నన్ను పోలీస్ స్టేషన్‌కి పిలిపించింది దీని కొక్కదానికే కాదు. జూన్‌లో, పుల్వామాలో ఇద్దరు ముగ్గురు దుకాణదారులను పోలీసులు కొట్టారని నేను చేసిన ట్వీట్‌ పై నాలుగు గంటలపాటు నన్ను ప్రశ్నించారు. నేను పెరిగిన ప్రాంతంలో డ్రగ్స్ సమస్య గురించి ఎందుకు రాయలేదని, పోలీసుల ప్రతిష్టను ఎందుకు దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని నన్ను ప్రశ్నించారు. ‘నేను చూసింది రాయడమే నా పని’ అని నేనన్నాను.  ఒక మహిళను పోలీస్ స్టేషన్‌కు పిలిపించడం వల్ల ఒక మహిళకు వచ్చే నష్టం, పురుషుడి కొచ్చే నష్టం కంటే చాలా భిన్నంగా ఉంటుంది.

ఒంటరిగా వెళ్లలేని అనేక ప్రాంతాలు

మహిళా జర్నలిస్టులు కూడా పురుష జర్నలిస్టులతో కలిసి పని చేసినందుకు తప్పుగా తీర్పులిస్తారు. కానీ, కశ్మీరీ మహిళా జర్నలిస్టులు ఒంటరిగా వెళ్లలేని అనేక ప్రాంతాలు ఇప్పటికీ దక్షిణ కశ్మీర్‌లో ఉన్నాయని ప్రజలకు అర్థం కాని విషయం. నేను ప్రజలతో మాట్లాడాలంటే నేను ఒక పురుష సభ్యుడిని నాతో తీసుకెళ్లాలి.  నేను ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే, తరచుగా పోలీస్ స్టేషన్‌ కి వెళ్లి వస్తూ, మానవ హక్కుల గురించి రాస్తూ, సహచర మహిళా జర్నలిస్టులతో పని చేసే వారిలో నుంచే అచ్చం నాలాంటి పరిస్థితుల్లో ఉన్న పురుష జర్నలిస్టును మాత్రమే వెతుక్కోవలసి ఉంటుందని మా సోదరుడు ఒకసారి నాతో చెప్పాడు.

I am a Kashmiri journalist నేను కశ్మీరీ జర్నలిస్టును

 మహిళా జర్నలిస్ట్‌గా బతకాలంటే

స్నేహితులు, సహోద్యోగుల అరెస్టులు చాలా బాధ కలిగిస్తాయి. తాజాగా సజాద్ గుల్ అరెస్టయ్యారు. పోలీసులు మీ కోసం ఎప్పుడు వస్తారో, ఆ తదుపరి కథనం లేదా ట్వీట్ ఏ హింసాత్మక చర్యను  ప్రేరేపిస్తుందోనని మీరు ఆలోచించకుండా ఉండలేరు. కశ్మీర్ వెలుపల నాకు తెలిసిన రిపోర్టర్లు, సంపాదకులు ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను, కానీ ప్రతి ఒక్కరికీ వారి కోసం మాట్లాడే వ్యక్తులు ఉండరు. కశ్మీర్‌లో మహిళా జర్నలిస్ట్‌గా బతకాలంటే ఒంటరితనాన్ని భరించవలసి ఉంటుంది. నాతో పాటు కలిసి పెరిగిన సన్నిహిత స్నేహితులు కూడా దూరమయ్యారు. కొందరు నేను జర్నలిస్ట్‌ నని నా పట్ల చాలా విమర్శనాత్మకంగా ఉన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను వారితో మాట్లాడటం మానేయవలసి వచ్చింది.

I am a Kashmiri journalist నేను కశ్మీరీ జర్నలిస్టును

‘బుల్లీ బాయి’ యాప్‌లో కొంతమంది

మహిళా జర్నలిస్టులను ప్రజలు సీరియస్‌గా తీసుకోని ధోరణి కూడా ఉంది.  నాకు చాలా తరచుగా మీరు పెళ్లి తర్వాత కూడా దీన్ని కొనసాగిస్తారా? అనే ప్రశ్న వస్తుండేది. కొన్నిసార్లు నన్ను అర్థం చేసుకోగల వ్యక్తులు నా వృత్తి నుండి మాత్రమే దొరుకుతారని భావించేదాన్ని. వారు మాత్రమే ఈ వృత్తిలోని సాధక బాధకాలతోనూ, పరిస్థితులతోనూ సంబంధం కలిగి ఉంటారు. ఇక్కడ ప్రజలు తమ జీవితాల్లో పూర్తిగా మునిగిపోయి, అంతులేని సమస్యలతో సతమతమవుతుంటారని నేను భావిస్తున్నాను, వారికి మరొకరిని పట్టించుకోవడానికి గానీ సంఘీభావం చూపడానికి గానీ సమయ ముండదు. ‘బుల్లీ బాయి’ యాప్‌లో కొంతమంది కశ్మీరీ మహిళా జర్నలిస్టుల్ని లక్ష్యంగా చేసి, వేధిస్తున్నప్పటికీ ప్రజలందరినుంచి రావలసినంత మద్దతు రాలేదు.

నిజాల్ని వెలికి తీసే మంచి జర్నలిస్ట్‌గా

కాబట్టి, సురక్షితమైన, మంచి వేతనంతో కూడిన ఈ ఉద్యోగాన్ని నేను ఎందుకు వదులుకోవాలి? నేను ప్రజల్ని శ్రద్ధతో వినగలిగిన మంచి శ్రోతని, కశ్మీరీల సంవేదనల్ని తాదాత్మ్యంతో పట్టించుకుని సహానుభూతితో స్పందించగల హృదయమున్నదాన్ని. ఈ నేలని అర్ధం చేసుకుంటూ, ఇప్పుడున్న ఈ పరిస్థితికి రావడానికి నాకు చాలా సమయం పట్టింది. అందువల్ల నేను ఎప్పటికీ నిజాల్ని వెలికి తీసే మంచి జర్నలిస్ట్‌గా ఉండాలని కోరుకుంటున్నాను.  చాలామంది కశ్మీరీ తల్లిదండ్రుల్లాగే, మా అమ్మ నన్ను డాక్టర్‌ ని చెయ్యాలని కోరుకుంది. దానిలో నాకంత అభిరుచి లేకపోయినప్పటికీ, నేను ప్రయత్నించాను. అది కుదరకపోవడంతో జర్నలిజంలో గ్రాడ్యుయేట్ కోర్సులో చేరాను.

I am a Kashmiri journalist నేను కశ్మీరీ జర్నలిస్టును

వరస హింసాకాండల కారణంగా

ఇటీవల వరస హింసాకాండల కారణంగా కశ్మీర్‌ లో పనులన్నీ మూత బడిపోవడం వల్ల, నా కుటుంబం ఆర్థికంగా క్లిష్టతరమైన పరిస్థితిలో ఉందని గుర్తించి, అడ్మిషన్‌ చివరి రోజున చిల్లర ఖర్చులకోసం ఉంచుకున్న నా సొంత డబ్బు నుంచి కోర్సు ఫీజు చెల్లించాను. వేరే వృత్తిలో ఖాళీగా ఉండటం కంటే జర్నలిజంలో కష్టపడాలని నేను నిర్ణయించుకున్నాను.

జర్నలిస్ట్ లుగా…

కశ్మీర్‌ లోని చాలా మంది అమ్మాయిలు తాము కూడా పాత్రికేయులు  కావాలనుకుంటున్నామని నన్ను సంప్రదించారు. కానీ ఇది చాలా ప్రమాదకరమైన ఉద్యోగమనీ, చుట్టూ సమాజంలో ఏమంటారోననే భయాలతో వారి కుటుంబాలు వారిని అనుమతించవనీ చెప్తున్నారు. చివరికి రాబర్ట్ ఫ్రాస్ట్ “But I have promises to keep, And miles to go before I sleep” అని చెప్పినట్లు కశ్మీర్‌ లో మహిళా జర్నలిస్టుల పరిస్థితులు మెరుగుపడటానికి చాలా మైళ్ల దూరం ప్రయాణించవలసి ఉందని చెప్తుంది.

కానీ ఈ మార్గంలోనే నేను నమ్మిన, పోరాడుతున్న ఇదే దారిలో కొనసాగాలని నిశ్చయించుకున్నానని ఖురతులైన్ రెహ్బార్ బలంగా ప్రతిపాదిస్తుంది. ఈ ప్రతిపాదన ఖురతులైన్ రెహ్బార్ కే కాదు, కశ్మీర్‌ మహిళలకే కాదు, వాస్తవాలను ప్రజలకి చెప్పదలచుకున్న స్త్రీ-పురుషులందరికీ ఆచరణియమే!

I am a Kashmiri journalist నేను కశ్మీరీ జర్నలిస్టును

రమా సుందరి, రచయిత

Leave A Reply

Your email address will not be published.

Breaking