Header Top logo

Humanity Poetry మనిషితనం (కవిత్వం)

Humanity 

మనిషితనం (కవిత్వం)

రాగమో..?  విరాగమో?

బంధమో ? అనుబంధమో?

వేదనో.. శోధనో…

సాధనో.. తెలీదు..!!

ఊపిరున్నంతవరకే…

ఆటైనా..? పాటైనా ?

నువ్వైనా..? నేనైనా ? ఆపైన…

ఆరడుగుల అంగవస్త్రమేగా?

మనిషితనం వున్నోడు

మట్టిలో కలిసినా మళ్ళీ

మొక్కై మొలకెత్తుతాడు

మహా వృక్షమై విస్తరిస్తాడు

 

మనిషితనం లేనోడు

నేలలోనే యింకిపోతాడు

కనుమరుగై పోతాడు..

మనిషితనం …

మనం వున్నప్పుడే కాదు

లేనప్పుడు కూడా..

బతికుంటుంది…

అది చిరంజీవి…!!

Abdul Rajahussen writer..

ఎ.రజాహుస్సేన్, కవి

చిత్రం:  అన్వర్

Leave A Reply

Your email address will not be published.

Breaking