Header Top logo

How to become a mother మాతృమూర్తి ఎలా అవుతుంది

How to become a mother
మాతృమూర్తి ఎలా అవుతుంది..?

సృష్టికి మూలం ఆడది.. ఈ మాట తరతరాలుగా వింటున్న ముచ్చట. కానీ.. పురుషుడు లేకుండా స్త్రీ, స్త్రీ లేకుండా పురుషుడు సంతానం కనలేరు. సంభోగంతో పురుషుడు తన వీర్యాన్ని స్త్రీ యోనిలో స్కలించడవతోనే స్త్రీ మాతృమూర్తిగా మారుతుంది. పురుషుని వీర్యంలోని కణాలు స్త్రీ అండాన్ని ఫలదీకరించి పిండం స్త్రీ గర్భాశయంలో పెరుగడం ప్రారంభిస్తోంది. స్త్రీ పురుషుడితో సంబోగించినప్పుడు గర్భం దాల్చుతుంది.

ఆమె నీళ్లు పోసుకుంది..

తెలంగాణ పల్లెల్లో గర్భం ధరించిన స్త్రీని నీళ్లు పోసుకుంది అంటారు. గర్భం ధరించిన తరువాత స్త్రీ 38 నుంచి 40 వారాలు అనంతరం అంటె తొమ్మిది నెలలు శిశువు గర్భంలో పెరుగుతుంది. పురుటి నొప్పులు రావడంతో స్త్రీ పండంటి శిశువుకు జన్మనిస్తోంది.

శిశువు జన్మించడానికి ముందు..

గర్భం దాల్చిన స్త్రీ డెలివరికి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉరుకుల పరుగుల జీవితంలో గర్భం దాల్చిన స్త్రీ వైద్యుల సలహాలను పాటించాలి. వ్యాయమం చేయడం.. రక్త పరీక్షలు చేయించుకోవడం.. స్కానింగ్ తో గర్భంలో శిశువు ఎలా ఉందో తెలుసుకోవడం ఇవన్నీ మారిన కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. గర్భవతులకు అధిక రక్తపోటు, మధుమేహం, రక్తహీనత, తీవ్రమైన వికారం, వాంతులు వస్తుంటాయి.

గర్భంలో పెరుగుతున్న శిశువు

గర్భంలో తొమ్మిది నెలలు శిశువును మోసే మాతృమూర్తికి ప్రసవన మరో జన్మనే. డెలివరి టైమ్ లో తాను అనుభవించే నరకయాతనకు బదులుగా సీజరిన్ చేసుకుంటున్నారు చాలా మంది. పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చిన హాస్పిటల్స్ లో కూడా నార్మల్ డెలివరికి బదులుగా డబ్బుల ఆశతో సీజరిన్ తో స్త్రీ గర్భంలో నుంచి శిశువును బయటకు తీస్తున్నారు. How to become a mother

గర్భం ఎలా వస్తోంది.
జీవకణాలతో పిండం..

64లక్షల జీవకణాలు అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే అందులో ఒకే ఒక్క జీవకణ మాత్రమే గర్భంలోకి ప్రవేశిస్తుంది. అదికూడా మొండాన్ని కోల్పోయి శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత కేవలం 24గంటల్లో అండాన్ని పట్టుకొని బ్రతకక పోతే ముక్కలై బయటికి వచ్చేస్తుంది. అదొక పోరాటమే. ఆ పోరాటం నీకు ఇచ్చిన సమయం కేవలం 24గంటలు మాత్రమే. నిలిచావా బ్రతుకుతావు. లేదా ముక్కలై బయటికి వచ్చేస్తావ్.

How to become a mother మాతృమూర్తి ఎలా అవుతుంది..?

రూపం లేకుండా వెళ్లిన కణం

అలా రూపం లేకుండా వెళ్లిన కణం రూపాంతరం చెంది రూపంతో బయటికి వస్తుంది. రూపాన్ని పొందుతుంది. కాళ్ళు చేతులు కదపలేని, నోటితో చెప్పలేని స్థితి. ఏమి చేసినా భరించాలి. క్రమంగా దేహం పెరుగుతుంది. దేహం మీద మోహం పెరుగుతుంది.

ఈ దేహం నేనె అంటాం. కానీ ఎలా?

నీ దేహంలో ఏ భాగం నీ మాట వింటుంది?

ఏ భాగము వినదు.

వినాలి అని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది.

చిన్నప్పుడు 2 అడుగులుగా ఉన్న దేహం క్రమంగా పెరుగుతూ 6 అడుగులు అవుతుంది.

అందంగా మారుతుంది. క్రమంగా అందం మందమై ముదిరిపోయి ముడతలు పడి, ఒక్కొక్క అవయవం క్రమంగా వేగాన్ని తగ్గించుకొని పనిచేయడానికి మొరాయిస్తాయి.

ఈ దేహం నీదే కదా! ఎందుకు మొరాయిస్తుంది?

ఈ దేహం నీదేకదా! ఎందుకు ఒకప్పుడు ఉన్న రూపం ఈరోజు లేదు?

ఈదేహం నీదేకదా! ఎందుకు నీమాట వినడంలేదు?

ఈదేహం నీదేకదా! ఎందుకు వదిలేసి వెళ్లిపోతున్నావ్?

ఎందుకంటే ఈ దేహం నీది కాదు.

శాస్త్రాలు ఏమి చెప్పాయో వాటిని అనుసరించు

ఆ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తప్ప ఈదేహం నాదే. నేను శాశ్వతంగా ఉండిపోతాను అనే భ్రమకి లొంగకూడదు. ఏ కారణం చేత వచ్చామో తెలియనప్పుడు నీకున్న బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించు. శాస్త్రాలు ఏమి చెప్పాయో వాటిని అనుసరించు. ఈ సృష్టి యొక్క అర్థం అని తెలుసుకో. రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం. రూపం పొంది ఎన్నో కార్యాలు చేసి ఉండవచ్చు. చివరికి రూపం ధరించిన రూపం ఇక్కడే వెళ్ళిపోతాం. ఇక్కడ ఉన్నది నువ్వు కాదు. నీకు తల్లిదండ్రులు ఇచ్చిన ఉపకరణం మాత్రమే అనే యధార్థం తెలుసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి.

How to become a mother మాతృమూర్తి ఎలా అవుతుంది..?

ఈ దేహం అమ్మ నాన్న లు ఇచ్చిన ఓ అద్భుత వరం.

రూపానికి ముందు నువ్వున్నావు.
రూపంలో నువ్వున్నావ్.
రూపం వదిలేశాకా నువ్వుంటావు.
ఎక్కడో ఓ చోట నువ్వు అనేవాడివి లేకపోతె అసలు రూపమే ఉండదు.
ఈ దేహం అమ్మ నాన్న లు ఇచ్చిన ఒ అద్భుత వరం.
కాబట్టి ఆ నువ్వు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్..

గర్భవతిగా మాతృమూర్తి

మనం గట్టిగా కష్టపడితే ఒక మూడు కేజీల ప్యాకెట్ ఏదైనా ఒక కిలోమీటరు లేదా రెండు కిలోమీటర్లు పట్టుకొని నడుచుకుంటూ వెళ్లేసరికి ఆ మూడు కేజీల బరువు కాస్త 30 కేజీల భారమవుతుంది. ఎప్పుడు దించేస్తామని చూస్తాం. కానీ బిడ్డ పుట్టేసరికి మూడు కేజీల ఉంటుంది అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. అయినా కానీ 9 నెలలు మోసి మనల్ని భూమికి పరిచయం చేస్తుంది. అదే మనలాగా బరువు మోయలేక దించేద్దాం కాసేపు అనుకుంటే నువ్వు నేను మనము ఇంకా మరెవ్వరు ఈ భూమిపై ఉండేవారిమి కాదు.

How to become a mother మాతృమూర్తి ఎలా అవుతుంది..?

ఈ ఒక్క విషయం చాలదా #ఆడపిల్లలకు #గౌరవ_మర్యాదలు ఇవ్వడానికి.. మోసే బరువుతోపాటు వాంతులు మరియు నడుము నొప్పి. తన నొప్పి ఎంత ఉన్నా భరించి మన ఏడుపు కేకతో మొత్తం బాధ నే మరిచిపోయి చిరునవ్వు చిందిస్తుంది అమ్మ.

Destination is her goal

ప్రతి స్త్రీ అమ్మ అవుతుంది..

అమ్మ నుంచి వచ్చిన ప్రతి అమ్మాయి అమ్మ అవుతుంది. అందుకనే అమ్మ గొప్పతనాన్ని అమ్మాయి ప్రేమతో మర్చిపోకండి. తల్లి పడే బాధ దగ్గర మనం పడే బాధ యుగాలు మారినా చిన్నదే. మనకు జన్మనిచ్చిన అమ్మను ప్రేమించాలి.

How to become a mother మాతృమూర్తి ఎలా అవుతుంది..?

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

గూగుల్ అండ్ సోషల్ మీడియా సహాకారంతో..

Leave A Reply

Your email address will not be published.

Breaking