చేనేత రంగం అభివృద్ధి కి ప్రతి ఒక్కరూ తోడ్పడ్డాలి…
■ ప్రజలను కోరిన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు
అనంతపురం, 25.03.2021 :
చేనేత రంగం అభివృద్ధి కి ప్రతి ఒక్కరు తోడ్పడాలని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రజలను కోరారు.గురువారం అనంతపురం నగరంలో టవర్ క్లాక్ వద్దగల కృష్ణకళ పరిషత్ లో స్పెషల్ హ్యాండ్ లూమ్స్ ఎక్స్ పో వారి ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకాలు దుకాణం ను ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ,ఎంపీ రంగయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మీడియా తో మాట్లాడుతూ చేనేత రంగం వ్యవసాయ రంగం తరువాత రెండవ అతి పెద్ద రంగం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రంగం పై ఆధారపడి వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. చేనేత రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. వారికి నేతన్న నేస్తం పథకం ద్వారా ప్రతి ఏటా రూ 24 వెలను అందిస్తున్నామని తెలిపారు. ఇలాంటి వస్త్రు ప్రదర్శన లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ అందుబాటు లో ఉండే విధంగా సరసమైన ధరలకు అందిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఆదరించాలని కోరారు.