Header Top logo

దళితుల ఆత్మగౌరవ భీమ కోరేగాం యుద్ధం  

205వ శౌర్యాదివాస్

చరిత్రలో అనేక యుద్దాలు జరిగినవి.

అవి వంశ పారంపర్య పాలనా కోసం, పక్కరాజ్య ఆక్రమణకు, ఇతర రాజ్యాల్లో ఉన్న రాజ్య వజ్ర వైరూఢ్యా సంపదను కొల్ల గొట్టడం కోసం, లేదా మతపరమైన పాలనా స్థాపన కోసం కావచ్చు. ఇలా ఎన్నోరకాల యుద్ధాలు జరిగినవి.. జరుగుతుంటాయి.. జరుగుతున్నాయి కూడా!

కానీ ప్రపంచ చరిత్రలో ఒక జాతి తన ఆత్మగౌరవం కోసం ఇతరుల పక్షాన వీరోచిత యుద్ధం చేసి అట్టి యుద్దంలో గెలిచి రాజ్యాన్ని ఇతర రాజులకు బంగారు పళ్లెంలో అందించి ఆత్మగౌరవం పొందిన యుద్ధమే భీమకోరేగాం యుద్ధం.

భారత స్వతంత్ర చరిత్రలో మూడవ ఆంగ్లో మరాఠా

యుద్ధంగా చెప్పుకొనే యుద్ధం జరిగిన స్థలమే భీమకోరేగాం.

ఇక్కడ జరిగిన యుద్ధ విజయం స్మరించుకొంటూ నేడు భీమకోరేగాం శౌర్యదివాస్ ఉత్సవం జరుపు కొంటున్నాము.

యుద్ధం జరిగిన స్థలంలో నిర్మించిన యుద్ధ విజయ స్మారక స్థూపానికి భారత సైన్యం ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన గౌరవ సూచకంగా పూలతో అలంకరణ చేసి ఆకాశము నుండి హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించే ఏకైక వేదిక ఇదే.

దళితుల ఆత్మగౌరవ భీమ కోరేగాం యుద్ధం చరిత్ర..

భారతదేశంలో బ్రిటిష్ రాజ్య స్థాపనకు బ్రిటిషు వారి దేశంలో ఉన్న స్వతంత్ర రాజ్యాలను ఒక్కొక్కదాన్ని ఆక్రమించుకుంటూ వస్తున్నారు. కర్ణాటక రాజ్యాన్ని ఆక్రమించు కోవడానికి హైదరాలి. టిప్పుసుల్తాన్ లను ఓడించడానికి మూడు కర్ణాటక యుద్దం చేసి ఆక్రమించు కొంటారు. dalit-self-esteem-insurance-koregam-war

రెండు యుద్దాలలో బ్రిటీష్ సైన్యం..

మరాఠా రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి మొదటి, రెండు యుద్దాలు చేసి మరాఠా పీష్వా రాజుల చేతిలో ఘోరంగా పరాజయం పొందిన బ్రిటిషు సైన్యం మూడవ సారి యుద్ధం చేయడానికి ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జర్నల్ లార్డ్ హస్టిన్ నేతృత్వంలో సిద్ధమైతారు.

మరాఠా సైన్యంలో అనేకమంది మహార్లు సైనికులు, సైనికాధికారులుగా ఉండి మొదటి రెండవ మరాఠా యుద్ధంలో పేష్వాలను గెలిపిస్తారు. మూడవసారి బ్రిటిష్ సైన్యంతో యుద్ధానికి సిద్ధమైతున్న పీష్వారాజులకు మహార్ సైనికులు మరాఠా రాజైన రెండవ పీష్వా బాజీరావు ఒక విన్నపం చేస్తారు.

మొదటి, రెండవ యుద్ధాల్లో మిమ్ములను గెలిపించాము, ఈ యుద్ధంలో కూడా మిమ్ములను గెలిపిస్తాము. అనంతరమే మహార్ల పట్ల అనుసరిస్తున్న వివక్షను తొలగించాలని, గ్రామాల్లో తిరిగే స్వేచ్ఛ కల్పించాలని, దేవాలయాల్లో ప్రార్థన ప్రవేశానికి అనుమతిచ్చాలని, చెరువులో నీళ్లుతాగే హక్కు కల్పించాలని హామీ ఇవ్వాలని అప్పుడే మేము యుద్దం చేస్తామని లేదంటే తాము యుద్ధానికి రాలేమని తేల్చిచెబుతారు.

దీనికి కోపోద్రేకుడైన పీష్వా రాజ బాజీరావు యుద్ధంలో గెలిపించినా కూడా మీస్థానం ఏమీకూడా మారదు.  పైగా మీరు యుద్ధానికి రాకపోయిన పరవాలేదు వెళ్ళండి అంటూ మహార్ సైనికుకుల ప్రతినిధి బృందం నాయకుడైన సిద్దినాగ్ తో గర్జిస్తూ చెబుతాడు.

ఆత్మగౌరవం కోసం బ్రిటీష్ వారి పక్షణ యుద్దం

అవమానంతో వెనుదిరిగిన మహార్ సైనికుల బృందం తీవ్రంగా అలోచించి ఇష్టంలేకపోయినా, ఇవే హక్కులు కల్పిస్తే మీ తరఫున యుద్ధము చేసి గెలిపిస్తాము అని బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ హస్టిన్ ను కలసి చెబుతారు. అందుకు బ్రిటిష్ వారు ఒప్పుకొని యుద్ధానికి సిద్దమై వెలుతారు. రెండు సార్లు యుద్ధము చేసి గెలిపించిన మహార్ సైకులు మూడవ మరాఠా యుద్ధంలో తమ ఆత్మ గౌరవ రక్షణకు బ్రిటిష్ పక్షాన యుద్ధానికి సిద్ధమై బయలుదేరుతారు.

యుద్ధ క్షేత్రం పునాకు సమీపంలోని భీమా నది ఒడ్డున మోహరించిన పీష్వా సైన్య పాటల శక్తిని చూసిన బ్రిటిష్ సైన్యం యుద్దం చేయ కుండానే వెను దిరుగుతున్నసమయంలో, మహార్ సైన్య ప్రతినిది సిద్దినాగ్ బ్రిటిష్ సైనికాధికారితో యుద్ధం చేయకపోయిన ఫరవాలేదు. మీరు మీ తరఫున యుద్ధం మేము చేస్తాం. మీరు బీమా నది ఒడ్డున నిలబడి చూడండి యుద్ద చేసే అవకాశం మాకు ఇవ్వండి అంటూ అడుగగా, ఇష్టం లేకపోయినా బ్రిటిష్ సైనికాధికారులు యుద్ధానికి అంగీకరిస్తారు. dalit-self-esteem-insurance-koregam-war

ఆర్ధకాలితో యుద్దంకు సిద్దమై..

మరాఠా పీష్వాల వేధింపులు, అవమానాలకు విసిగివేసారి, పీష్వాలతో యుద్ధానికి కసిగా ఎదురు చూస్తున్నా మహార్ సైనికులకు అవకాశం వచ్చింది. 500 మంది మాత్రమే ఉన్న మహార్ సైనికులు సిరూరు క్యాంపు నుండి బయలు దేరి 56 కిలోమీటర్లు కాలినడకన బీమా నది ఒడ్డుకు చేరుకొన్నారు.

మూడవ మరాఠా యుద్ధం విజయం

తమతో తెచ్చుకున్న ఆహారం సరి పోక పోయిన జొన్న గంజి కాచుకొని తాగి, అర్ధాకలి తీర్చుకొని ఆకలి కన్నా మాకు ఆత్మగౌరవమే ముఖ్యమని, చరిత్రలో కనివిని ఎరుగని, ఒళ్లు గగుర్పొడిచే రీతిలో వీరోచిత పోరాటం చేసారు.  28 వేల పీష్వా సైన్యాన్ని మట్టి కరిపించి, బీమా నది నిండా రక్తం ప్రవహించే రీతిలో యుద్ధం చేసిన మహార్ సైనికులు, పీష్వా సైనికాధికారి బాపురావు గోకులే కుమారుడైన గోవిందరావు బాపు తల నరకడంతో భయ కంపితులైన పీష్వాల సైన్యం యుద్ధ క్షేత్రం నుండి పారి పోవడంతో మూడవ మరాఠా యుద్ధం 1818 జనవరి 1వ తేదీన ఆంగ్లేయుల విజయంతో యుద్ధం ముగిసినట్లుగా ప్రకటించబడింది.

అంటరాని వారి

 ఆత్మగౌరవ, హక్కుల సాధన యుద్ధం

ఈ యుద్ధాన్నే అంటరాని వారి ఆత్మగౌరవ, హక్కుల సాధన యుద్ధంగా చెప్పుకొంటారు. యుద్ద విజయానికి మహార్ల శౌర్యానికి గుర్తుగా బ్రిటిష్ వారు అక్కడ ఒక స్తూపం నిర్మించారు. మహార్ల కోసమే ప్రత్యేకంగా సైన్యంలో మహార్ రెజిమెంట్ బెటాలియన్ ఒకదాన్ని స్థాపించారు. నేటికి భారత సైన్యంలో ఇది కొనసాగడం విశేషం.

అంబేద్కర్ జీవించిన కాలమంతా నివాళులు..

“అంబేద్కర్ జీవించిన కాలమంతా జనవరి ఒకటవ తారీఖున అక్కడ నివాళులర్పిచేవాడు. ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తారీఖున శౌర్యా దివాస్ పేరుతో దేశంలోని లక్షలాది ప్రజలు స్వచ్ఛందంగా అక్కడికి వెళ్లి స్థూపానికి నివాళులు అర్పించడం తమ బాధ్యతగా గుర్తిస్తున్నారు.

హైదరాబాద్ లో భీమా కే హీరోస్ పేరుతో

గత కొన్ని సంవత్సరాలుగా A GROUP OF ELETRICITY EMPLOYEES, భీమా కే హీరోస్ పేరుతో హైదరాబాద్ లో ట్యాంకు బండిపై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నమూనా స్తూపం ఏర్పాటు చేసి ఆనాటి మహార్ సైనికులకు గౌరవ వందనం చేస్తున్నారు.

మామిడి నారాయణ

9441066032

Leave A Reply

Your email address will not be published.

Breaking