Header Top logo

హైదరాబాద్ అంబెద్కర్ విగ్రహంవద్ద సిపిఐ ప్రదర్శన

దేశ సమాఖ్య విధానాన్ని విచ్చినం చేస్తే తాటతీస్తాం
– సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యిద్ అజీజ్ పాషా హెచ్చరిక

ప్రజాస్వామ్యాన్ని పెంపొందిస్తున్న భారత దేశ సమాఖ్య విధానాన్ని విచ్చినం చేస్తే తాటతీస్తామని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ, సయ్యిద్ అజీజ్ పాషా మోడీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

కేంద్రం, రాష్ట్రాల మధ్య విశ్వాసం దెబ్బతినేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్ భవన్ లను దుర్వినియోగం చేస్తుందని, ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడం, ఎమ్యెల్యేలను కొనడం, అడ్డదారిన ప్రభుత్వాలు ఏర్పాటుచేయడం వంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆరోపించారు.

భాజపాయేతర రాష్ట్రాలలో గవర్నర్‌లు ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాల్లో నిర్మొహమాటంగా జోక్యం చేసుకోవడం భయానకమైన చేర్యలని అయన ఆందోళన వ్యక్తం చేసారు. రాజ్యాంగం ప్రకారం మన దేశం “రాష్ట్రాల సమాఖ్య” అని ప్రధాని మోడీ మరిచిపోయి “వన్ నేషన్” పేరుతో శక్తివంతమైన ఫాసిస్ట్ రాజ్యాన్ని స్థాపించడానికి కుట్రలు పన్నుతున్నాడని మండిపడ్డారు.

“ఫెడరలిజం రక్షించాలి” నినాదంతో దేశవ్యాప్త ప్రదర్శనలు నిర్వహించాలని సిపిఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపుమేరకు సిపిఐ హైదరాబాద్ జిల్లా సమితి హైదరాబాద్, ట్యాంక్ బండ్, డా.బి.ఆర్. అంబెడ్కర్ విగ్రహంవద్ద గురువారం ప్రదర్శన నిర్వహించింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking