Bitter memories of Kuntala Falls.. కుంటాల జలపాతం చేదు జ్ఞాపకాలు…
Bitter memories of Kuntala Falls..-01
కుంటాల జలపాతం చేదు జ్ఞాపకాలు…
అది 2017 జూలై 2 ..ఆదివారం…
ఏదో కార్యక్రమ నిమిత్తమై బజార్హత్నూర్ మండలం లోని మారుమూల గ్రామానికి నా సహచర మీడియా మితృలతో కలిసి వెల్లాము. మధ్యహ్నం 2 గం” కు అనుకుంటా కార్యక్రమం ముగిసింది భోజనం చేసి బయాల్దేరాల్సి ఉండగా దాదాపు అందరి ఫోన్లు వరుసగా మొగాయి.. ఆ గ్రామంలో సరిగ్గా నెట్వర్క్ అందడం లేదు.. ఫోన్లో మాటలు సరిగ్గా వినిపించడం లేదు… అందరికి ఒకే సారి ఫోన్లు రావడంతో ఏమై ఉంటుందని నెట్వర్క్ అందే ప్రాంతానికి వెల్లి ఫోన్లు మాట్లాడాము.. కుంటాల జలపాతం లో కొంత మంది పర్యాటకులు గల్లంతయినట్లు వినిపిస్తుందని సమాచారం..
ఎంత మంది అనేది క్లారిటీ లేదు… అంతే భోజనం మా కోసం వేచి చూస్తుందని మరిచి అక్కడి నుండి బయల్దేరాము… ఇద్దరు మితృలు చెరో బైక్ నడుపుతుండగా వెనుక సీట్ లో కూచున్న ఇద్దరము పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం.. పోలిసుల నుండి కన్ఫర్మేషన్ కోసం ప్రయత్నిస్తున్నా ప్రమాద సమయంలో మొదటగా రెస్పాండ్ కావాల్సింది వారే కాబట్టి వారు ఆ టైం లో ఫోన్ లేపె తీరికతో అస్సలు ఉండరు కావున వారి తరుపున కూడ ఏమి సమాచారం అందటం లేదు… కుంటాల జలపాతం వద్ద ఉండే అటవీశాఖ బేస్ క్యాంప్ సిబ్బందికి, క్యాంటీన్ వారికి జలపాతం వద్ద నెట్వర్క్ ఉండకపోవడం వల్ల వారికి సైతం ఫోన్ కలవడం లేదు ..
ఎలక్ట్రానిక్ మీడియా లో వేగానికి ప్రాధాన్యత ఎక్కువ… ఎంత తొందరగా సమాచారం ఇవ్వగలిగితే అన్ని మార్కులు, నిమిషం ఆలస్యమైన చివాట్లు తప్పవు.. కాని వేగంతో పాటు సమాచారాన్ని పలుమార్లు క్రాస్ చెక్ చేసుకుని వాస్తవమైన సమాచారాన్ని ఇచ్చే బాధ్యత కూడ అదే స్థాయిలో ఉంటుంది.. ఇటు వేగం, అటు సరైన సమాచారం రెండిటిని బ్యాలేన్స్ చేస్తు వార్తను అందించాలి…
కుంటాల జలాపాతానికి పర్యాటక సీజన్ ప్రారంభ సమయం అది… ప్రతి సంవత్సరం మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి.. పర్యాటక శాఖ జలాపాతాన్ని తమ ఆధీనంలో తీసుకోదు అటు పాలకులు స్పందించరు.. అలా నిండా నిర్లక్ష్యం వెక్కిరిస్తుంటే అతి ఉత్సాహంతో పర్యాటకులు జలపాతపు సుడిగుండాలలో పడి క్షణాల్లో ప్రాణాలు కొల్పోవడం పరిపాటిగా మారిందనే సంభాషణ తో ముందుకు సాగుతున్నాము మేము…అప్పటికి బజార్హత్నూర్ మండల కేంద్రానికి కూడ చేరుకోలేదు… పూర్తిగా రాళ్లతో నిండి ఉన్న రోడ్డు, మార్గమధ్యలో వస్తున్న వాగులు..ఎంత తొందరగా వెల్దామనుకున్న రోడ్డు మాకు సహకరించడం లేదు…ఇంతలో నేరెడిగోండ ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేశారు…
(తరువాయి భాగం రేపు… )
సాయి కిరణ్ జాదవ్, జర్నలిస్ట్ – ఆదిలాబాద్