Header Top logo

బట్టి విక్రమార్క ప్రతిపాదన వ్యక్తిగతం-రేవంత్ రెడ్డి

బట్టి వ్యాఖ్యలపై నిరసన.
-పాదయాత్రకు అడ్డుకున్న ముదిరాజ్ లు

ఆ ప్రతిపాదన వ్యక్తిగతం
– రేవంత్ రెడ్డి వెల్లడి

మహబూబాబాద్ : నిండు శాసనసభలో మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలలో అన్ని సామాజిక వర్గాలకు సభ్యత్వాలు కల్పించాలని ప్రభుత్వ జీవోలు సహకార చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడిన సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క మాట్లాడిన దానిపై మహబూబాబాద్ జిల్లాలో ముదిరాజ్ లు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాదయాత్రను అడ్డుకోవడం జరిగింది.

మల్లు బట్టి విక్రమార్క మత్స్యకార్మికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడటం జరిగిందని, దానిని వెంటనే వెనక్కి తీసుకోవాలని రేవంత్ రెడ్డిని కోరడం జరిగింది. పాదయాత్ర ముదిరాజుల సమీపంలోకి రాగానే పెద్ద ఎత్తున ముదిరాజులు ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి…… భట్టి విక్రమార్క మాటలు వెనక్కి తీసుకోవాలి…….అనే నినాదాలు హోరెత్తించారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్ మహబూబాద్ జిల్లా అధ్యక్షులు జిల్లా సహదేవ్ గార్లతో రేవంత్ రెడ్డి మాట్లాడినారు.

వారు రేవంత్ రెడ్డికి శాసనసభలో భట్టి విక్రమార్క ప్రభుత్వ విధానాలకు,1964 లో తీసిన జీవో ఎంఎస్ 98 విరుద్ధంగా, అనంతరామన్ కమిషన్ నివేదికను పూర్తిగా విస్మరించే విధంగా మాట్లాడిన దానిని ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అంతే కాకుండా ఈ రెండు వేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినవని తెలియజేయడం జరిగింది.

దానికి స్పందించిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముదిరాజ్ మత్స్యకార్మికులకు వ్యతిరేకం కాదని తాను ముదిరాజులకు పూర్తి మద్దతు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు.‍ శాసనసభలో బట్టి విక్రమార్క మాట్లాడినది ఆయన వ్యక్తిగత తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని అన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించగా *రాష్ట్ర కార్యదర్శి గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్, జిల్లా అధ్యక్షుడు జిల్లా సహదేవ్ ముదిరాజ్ అధ్వర్యంలో మరిపెడ మండల అధ్యక్షులు బయ్యా ఉపేందర్ ముదిరాజ్, కురవి అధ్యక్షులు గోల్కొండ వీరన్న ముదిరాజ్, నర్సింహులపేట అధ్యక్షులు మంద వెంకన్న ముదిరాజ్, చిన్నగూడూర్ అధ్యక్షులు గంగారాబోయిన శ్రీను ముదిరాజ్, మరిపెడ కౌన్సిలర్ బయ్యా బిక్షం ముదిరాజ్, మారబోయిన వెంకటేశ్వర్లు ముదిరాజ్, మాజీ సర్పంచ్ దుస్స నర్సయ్య ముదిరాజ్, మరిపెడ మత్స్య పారిశ్రామిక సహాకార సంఘం కార్యదర్శి శ్రీను ముదిరాజ్, ముదిరాజ్, ముదిరాజ్, రవి ముదిరాజ్, పాపయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking