మహనీయుడైన మహోన్నత వ్యక్తి అంబేద్కర్
శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి
తను నమ్మిన ఆశయాలను..ఆచరణలో పెట్టి..తద్వారా ప్రగతి ఫలాలను సాధించిన నాడు..ఆ మానవుడు మహనీయుడు అవుతాడని..అతనే సంఘ సంస్కర్త, రాజ్యాంగ శిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి కొనియాడారు. నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా శింగనమల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం మాట్లాడుతూ న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా ఎన్నో ప్రమాణాలు పాటించి.. తన కోసమే కాదు.. సమాజానికి మేలు చేసిన మహోన్నత వ్యక్తి..అందరికీ ఆదర్శప్రాయుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. ఈ రోజు మన దేశంలో ఒక సామాన్యుడికి ఏమైనా న్యాయం జరుగుతుంది అంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సాధ్యమైందని చెప్పవచ్చు. ఆయన ఎన్నో పుస్తకాలు చదివారు..వాటన్నింటినీ లెక్కవేస్తే ఒక పెద్ద పడవలో ఎన్ని పడతాయో అన్ని ఉంటాయని వివరించారు. నాడు పాదయాత్ర సందర్భంగా జగనన్నకు నేను ఒక మాట చెప్పాను..ఎందుకన్నా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలు అని పేర్లు పెట్టడం అంటే..అన్న అధికారంలోకి రాగానే ఆ పేర్లను తొలగించారు. అలాగే శింగనమల నియోజకవర్గంలో నేను వచ్చిన తర్వాత ఎవరూ చేయనటువంటి అభివృద్ధి జరిగింది. అది చెప్పడం కాదు చేసి చూపించామని ప్రజల హర్షధ్వానాల మధ్య తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం చుట్టూ గ్రానైట్ తో అందంగా ఒక గోడ కట్టి..దానికి ఐరన్ గ్రిల్ ఏర్పాటుచేసి..వాటిని, విగ్రహాన్ని పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి.. ఆ మహానుభావుడికి ఎమ్మెల్యేగారు ఘన నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ విద్యార్థులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ మీరు భవిష్యత్తులో గొప్పవాళ్లు కావాలంటే చదువు ఒక్కటే మార్గం, మీకు అండగా జగనన్న ఉన్నాడు.. మిమ్మల్నిబాగా చదివిస్తాడు.. మరి బాగా చదువుతారా?అంటే వాళ్లందరూ సంతోషంగా చదువుతామని బదులిచ్చారు.. ఇలా ఎమ్మెల్యే ప్రజలందరితో మమేకమై..చేసిన జయంతి కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.