A true lover Balakrishnareddy నిజమైన ప్రేమికుడు కవి కె బాలకృష్ణారెడ్డి
A true lover
Balakrishnareddy
ఆయన నిజమైన ప్రేమికుడు
(True Lover )
నిజమైన ప్రేమికుడు కె బాలకృష్ణారెడ్డి
అలా వెళ్ళిపోతే ఎలా?
*“ప్రేయసీ,! ప్రేయసీ! ప్రియుడనే ! ప్రేయసీ !
వేయి కన్నులు దాల్చి వెదుకుచున్నానే!
నల్ల మేఘాలలో న్యాయమా దాగంగ?
తల్లడిలవో నన్ను తలచి రావో ! “
దేవులపల్లి కృష్ణశాస్త్రి..!!
ఏ ముహూర్తాన దేవులపల్లి వారు ప్రేయసి గురించి కలవరించారో కానీ.. చాలామంది కవులు అదే బాటను అనుసరించారు.మనో ఫలకంపై తమ ఊహా సుందరిని చిత్రించుకొని కవిత్వం రాయడం మొదలు పెట్టారు. అటువంటివారిలో కె.బాలకృష్ణారెడ్డి గారు ముందువరుసలో వున్నారు. తన ప్రేయసిని కలవరిస్తూ ఆయన ఎన్నో కవితలల్లారు. కావ్యాలు రాశారు. ఇంకా రాస్తున్నారు. మచ్చుకు ఈ కవితను చూడండి.
ఒక
చిన్న నవ్వు నవ్వి ..
నువ్వు..
అలా వెళ్ళిపోతే ఎలా !
నా ముంగిలిలో
రతనాలు
మణులు మాణిక్యాలు
వెదజల్లిపోతే ఎలా!
నీకై
ఎంతగానో
ఎదురు చూచే నాపై..
ఒక చిలిపి చూపు
విసిరిపోతే ఎలా !
నడిచిపోతూ..
నా మనసుని
నీతో..అలా
ఎత్తుకెళ్ళి పోతే ఎలా !
కె.*బాలకృష్ణారెడ్డి.”!!
బాలకృష్ణా రెడ్డి గారి ప్రేయసి ముచ్చట్లివి….!!
ఆమె ఇలా వచ్చి..అలా ఓ చిన్న నవ్వు నవ్వి వెళ్ళిపోయింది.కవి మనసు అల్లకల్లోలమైంది.అదేంటి ఇలా వచ్చి ఓ నువ్వు నవ్వి అలా వెళ్ళిపోతే ఎలా…? ఇక్కడ తాను పడే బాధ ఆమెకు పట్టదా..? A true lover Balakrishnareddy
ఆమె నవ్వు నవ్వి..తన ముంగిలిలో రతనాలు,మణులు మాణిక్యాలు వెదజల్లిపోయింది.! ఆమె కోసం తాను ఎప్పటినుంచో ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. అలాంటిది ఆమె ఇలా వచ్చి అలా ఒక చిలిపి చూపు విసిరిపోతే ఎలా? ఆమెకోసం వేచి వేచి కళ్ళు కాయలు గాచాయి. ఆమె వచ్చిందన్న సంతోషం మిగల్చకుండానే మెరుపు తీగకుమల్లే ఒక చిలిపి చూపు విసిరి
క్షణకాలంలో వెళ్ళిపోతే ఇక కవి హృదయం పడే బాధను వర్ణించడం ఎవరి తరం? మాటల్లో చెప్పలేని బాధను మిగిల్చి
ఆమె నడిచిపోతూ కవి మనసుని తనతో అలాఎత్తుకెళ్ళి పోయింది.ఇంకా కవి పడే బాధ అంతా ఇంతా కాదు అంటున్నారు బాలకృష్ణారెడ్డి గారు.తన తనువులో..’ సగమైన’ ఆమె అలా ఓరగా చూస్తూ వెళ్ళిపోతే….? ఎవరికైనా ఎంత బాధ వుంటుందో మాటల్లో చెప్పలేం.
ప్రేయసి కనబడక పోవడం వేరు..కానీ కనబడి క్షణకాలంలో దూరమైతే..ప్రియుడి ❤గుండె కు ఆ బాధ రంపపు కోతే….!!
బాలకృష్ణారెడ్డి గారి కవిత్వంలో 90 శాతం ప్రేమ కవిత్వమే. ఆయన ప్రేయసి కూడా ఊహా సుందరే. ఏ రచనకైనా తుది లక్ష్యం మనిషే ఏ మనిషికైనా ప్రథమ విరోధి మనసే’బాలకృష్ణారెడ్డి గారి భావుకత గురించి ఎంత చెప్పినా తక్కువే.ఆయన కవితా వసంతుడు. మల్లెపూవంత మెత్తని మనస్సు,వెన్నెలంత చల్లని అక్షరం ఆయనది.
“ఎన్ని కన్నులు వెలిగించావో ఎంత వెన్నెల కురిపించావో అంతలోనే ఒక జ్ఞాపకమైనావు తెల్లారని ఒక వేకువ వైనావు “ అంటారు బాలకృష్ణారెడ్డి గారు. అవును మరి..ఆయన నిజమైన ప్రేమికుడు ( A true lover Balakrishnareddy ).!!