Header Top logo

హైకోర్టు తీర్పు ఎఫెక్ట్.. అమరావతి పనుల్లో కదలిక

  • ఐఏఎస్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస సముదాయాల నిర్మాణంపై దృష్టి
  • నవంబరు నాటికి పూర్తిచేయాలని లక్ష్యం
  • రూ. 200 కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చిన కన్సార్షియం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో కదలిక వచ్చింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పటికే మూడొంతుల నిర్మాణాన్ని పూర్తిచేసుకున్న ఐఏఎస్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస సముదాయాల నిర్మాణాలను పూర్తిచేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది నవంబరు నాటికి వీటిని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పనులు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తుది విడత రుణంకోసం కన్సార్షియంకు లేఖ రాశారు. దీంతో రూ. 200 కోట్ల రుణం ఇచ్చేందుకు అది ముందుకొచ్చింది. 
ఇప్పటికే అందిన రూ. 95 కోట్ల నుంచి కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించనున్నారు. మిగిలిన రూ. 105 కోట్లు కూడా త్వరలోనే అందుతాయని భావిస్తున్నారు. అలాగే, 65 శాతం పూర్తయిన టైప్ 1, 2, నాలుగో తరగతి ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణ పనులను కూడా త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking