మహాదేవపూర్పొలంలో దిగబడిన ట్రాక్టర్ తీసివస్తున్న క్రమంలో అదుపుతప్పి బోల్తా పడడంతో డ్రైవర్ శంకర్ (23) మృతిచెందాడు.గురువారం రోజున మహాదేవపూర్ మండలం నాగేపల్లి గ్రామంలో పొలం పనుల నిమిత్తం మధుకర్ ట్రాక్టర్ పొలంలో దిగ పడడంతో ఈ యొక్క ట్రాక్టర్ ను తీసేందుకు సండ్రపల్లి గ్రామ వాసి అయిన జాడి సురేందర్ ట్రాక్టర్ ను తీసుకువెళ్లిన డ్రైవర్ శంకర్ దిగబడిన ట్రాక్టర్ ను తీసి వస్తున్న క్రమంలో నాగ పల్లి గ్రామం లోపలికి వెళ్లే మూలమలుపు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు సమాచారం తెలుసుకున్న కాలేశ్వరం ఎస్ఐ నరహరి సంఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహాదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి కేసు నమోదు చేసుకోవడం జరిగింది.