- ‘గాడ్ ఫాదర్’ సినిమాలో కలిసి నటిస్తున్న చిరంజీవి, సల్మాన్ ఖాన్
- వారం రోజుల పాటు వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ ముంబైలో చిత్రీకరణ
- తన ఫామ్ హౌస్ లో చిరంజీవికి ఆతిథ్యం ఇవ్వనున్న సల్మాన్
చిరంజీవి, సల్మాన్ ఖాన్ ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించనున్నారని తెలిసినప్పటి నుంచి ఈ చిత్రంపై అమితమైన ఆసక్తి నెలకొంది. వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ ను ముంబైలో షూట్ చేయబోతున్నారు. ఎన్డీ స్టూడియోస్ లో షూటింగ్ కు ఏర్పాట్లు జరిగిపోయాయి. నేటి నుంచి వారం రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ జరగబోతోంది.
మరోవైపు షూటింగ్ కోసం చిరంజీవి ముంబై వస్తుండటంతో.. తన ఫామ్ హౌస్ లోనే చిరంజీవికి సల్మాన్ ఖాన్ ఆతిథ్యం ఇవ్వబోతున్నారు. ముంబైలో షూటింగ్ జరిగే వారం రోజులు సల్మాన్ ఫామ్ హౌస్ లోనే మెగాస్టార్ బస చేయనున్నాడు. సల్మాన్ ఫామ్ హౌస్ అత్యంత విలాసవంతంగా ఉంటుంది. ఆయనకు అత్యంత ఆత్మీయులు మాత్రమే అక్కడ విడిది చేస్తారు.