కర్నూలు జిల్లా మంత్రాలయం మంత్రాలయంలో యువతరం ముందుకు రావాలని రక్తదానం చేసి ప్రాణ దాతలు కావాలని వైఎస్సార్ సీపీ మండలాధ్యక్షులు జి. భీమిరెడ్డి, ఇన్ చార్జ్ విశ్వనాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని శ్రీ రంగ కృప వసతి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా 21వ తేది (సోమవారం) మండల కేంద్రంలోని దుర్గా రమణ కళ్యాణ మండపంలో నిర్వహించే రక్త దాన శిబిరం కు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ టి. భీమయ్య, నాయకులు జనార్దన్ రెడ్డి, జమ్మి, వీరారెడ్డి తదితరులు ఉన్నారు.కర్నూలు జిల్లా మంత్రాలయం ప్రజా నేత్ర :-V నరసింహులు