ఎమ్మిగనూరు పట్టణంలో “నవరత్నాలు పేదలందరికీ ఇల్లు” మన ముఖ్యమంత్రి “వైయస్ జగన్ మోహన్ రెడ్డి” గారు ఈ నెల డిసెంబర్ 25వ తేదీన పేదలందరికీ పక్క గృహం ఉండాలని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపూన ఇంటి స్థలం ఇచ్చి దానికి సిద్ధం చేయడం జరిగింది. స్థానిక వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం నుండి లబ్ధిదారులతో ర్యాలీ గా వేలుతు వైయస్సార్ సర్కిల్ నందు వైయస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, అనంతరం సమావేశం నిర్వహించిన మన ప్రియతమ నాయకులు, రైతు బిడ్డ, నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి” గారు, ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమ యాత్ర సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం పేదల సొంతింటి కళ సాకారం చేయడమే సిఎం జగన్మోహన్ రెడ్డి ధ్యేయం అని నియోజకవర్గ సీనియర్ నాయకులు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి” గారు పేర్కొన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల కార్యక్రమ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుర్ణీ, కరకాల కార్పొరేషన్ చైర్మన్ బుట్టా శారదమ్మ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టా రంగయ్య గారు, మైనార్టీ నాయకులు రియాజ్ ఆహ్మద్ గారు, కె. శివన్న, డాక్టర్ రఘు గారు కో-ఆపరేటివ్ స్టోర్ చైర్మన్ షబ్బీర్ ఆహ్మద్ గారు, వైసీపీ మహిళ అధ్యక్షురాలు అన్నపూర్ణమ్మ గారు, పట్టణ యువజన ప్రెసిడెంట్ నజీర్ ఆహ్మద్, పార్టీ వార్డు ఇన్ ఛార్జ్ లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్: ఎర్రకోట మహలింగ ప్ప.