ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందివ్వడమే జల జీవన్ మిషన్ ముఖ్య ఉద్దేశ్యం. …మండల ఇంచార్జ్ మురళీమోహన్ రెడ్డి
ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందివ్వడం కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసినదే జల జీవన్ మిషన్ అని మండల ఇంచార్జ్ మురళీ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోసిగిలోని మండల పరిషత్తు సమావేశ మందిరంలో యంపీడిఓ బంగారమ్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జల జీవన్ మిషన్ 100రోజుల ప్రచారం బాగంగా ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో ఆర్డబ్ల్యుయస్ డీఈ సాంబయ్యతో మురళీ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జలజీవన్ మిషన్ క్రింద మండలంకు 12కోట్ల 50లక్షల రూపాయలు మంజూరు కావడం జరిగిందని,ఈ మొత్తంతో మండలంలోని ప్రతి గ్రామంలో లోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించడమే ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.శిక్షణలో బాగంగా కార్యచరణ,త్రాగునీటి నాణ్యతపై పర్యవేక్షణ ఎలా అనే అంశంపై ల్యాబ్ టెక్నీషియన్లు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు.ఈకార్యక్రమంలో మండల ఇంజనీర్ మల్లికార్జున రెడ్డి,పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీర్ అసిస్టెంట్లు,వాటర్ మెన్స్ తదితరులు పాల్గొన్నారు.
కోసిగి ప్రజనేత్ర రిపోటర్ డి.వెంకటేష్..