శ్రీకాకుళం, పొందూరు అభివృద్ధి సంక్షేమం రెండు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కళ్ళ లాంటివి అని ఏది ఆగడానికి లేదని అభివృద్ధి సంక్షేమం పరుగులు పెట్టిస్తున్నారని అదేవిధంగా గత ప్రభుత్వాల పాలనలో అభివృద్ధి సంక్షేమ కుంటు పడిందని దానిని సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు గాడిలో పెట్టడానికి అహర్నిశలు కష్టపడుతున్నరని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు.పొందూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ఆదనపు గదులు నిర్మాణానికి సుమారు 147 లక్షల రూపాయలు నిధులతో (నాడు-నేడు) ఆధునిక మౌళికవసతులు కల్పన పనులకు శంకుస్థాపన చేయటం జరిగింది.ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పుట్టి పది సంవత్సరాలు అయ్యింది 2014లో పోటీ చేసినప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ప్రధాన పోటీ జరిగింది గత ప్రభుత్వం 612 హామీలు ఇచ్చిందని దానికి ఎనిమిది వందల పేజీలు ప్రింట్ చేసిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఎన్నికల్లో హామీ ఇచ్చామని సాధ్యాసాధ్యాల ఆలోచించి ఇవ్వాలని ప్రజల ముందు హామీ ఇచ్చారు అంటే అది నెరవేర్చాలని ఆయన అన్నారు సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం మనం నినాదాలు చేశామని ఆ ఉద్యమంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందువరుసలో ఉండి పోరాడారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.విభజన జరిగిన తరువాత మనకు మిగిలింది ఉప్పుటేరు అని అదే తప్పు మళ్లీ పునరావృతం కాకూడదని పాలన వికేంద్రీకరణ చేస్తానంటే దానికి ప్రతిపక్షం అడ్డు తగులుతుందని ఈ సందర్భంగా అన్నారు.ప్రభుత్వం అంటే గ్రామంలోనే ఉండాలని పాలన గ్రామంలోనే జరగాలని గత ప్రభుత్వ పాలనలో మండల కేంద్రానికి వెళ్లి పనులు చేయించుకునే వారని ఇప్పుడు గ్రామ సచివాలయం లోనే పనులు చేయించుకుంటున్నమని ఈ సందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్ , మండల పార్టీ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి,సువ్వారి గాందీ ,పప్పల వెంకటరమణమూర్తి ,మార్కెట్ కమిటీ చైర్మన్ సునీల్ , పోలాకి నాగభూషణరావు,గంగిరెడ్ల సత్యనారాయణ,పప్పల రాధాకృష్ణ ,పప్పల రమేష్ ,గుడ్ల మోహన్ రావు తదితర వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధికారులు పాల్గొన్నారు.
గురుగుబెల్లి వెంకటరావు, ప్రజానేత్ర – రిపోర్టర్.