ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ గుంటూరు జిల్లా వారి ఆధ్వర్యంలో ది గుంటూరు జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ వారు నకరికల్లు మండలం నందు 5 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు 1.నకరికల్లు, 2.చల్లగుండ్ల, 3.చీమలమర్రి, 4. గుండ్లపల్లి, 5. కుంకలగుంట గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ధాన్యం మద్దతు ధర
ధాన్యం రకము 100 కేజీల లో 75 కేజీలు
సాధారణ రకము 1868.00 1401.00
గ్రేడ్ A రకము 1888.00. 1416.00
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రం నకు వచ్చినప్పుడు ధాన్యం 2.5 కేజీలు లేదా 3 కేజీలు శాంపిల్ ను తీసుకొని రావలెను . రైతులు ధాన్యం బాగా ఆరబెట్టుకుని రావాలి తేమశాతం 17% ఉండాలి .రైతులు ధాన్యం నాణ్యత ప్రమాణాలు ప్రభుత్వ వారి సూచనల ప్రకారం ఉండాలి. కావున ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకో వలసిందిగా కోరుతున్నాము ..ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఇంచార్జ్ లు కంప్యూటర్ ఆపరేటర్లు మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది మరియు రెవెన్యూ శాఖ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు మరియు రైతులు పాల్గొన్నారు.కృష్ణంరాజు ప్రజా నేత్ర రిపోర్ట్..