కర్నూల్ జిల్లా ప్యాపిలి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్న ప్రధానోపాధ్యాయుల పైన గ్రామస్థుడు నాగేంద్ర ఇనుప కడ్డీ తో దాడి చేయడానికి ప్రయత్నం చేయడం హేయమైన చర్య అని,దాడి చేసిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సురేష్ కుమార్ డిమాండ్ చేశారు.ప్యాపిలి మండలంలోని కలచట్ల మండలపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నీలోఫర్ మరియు ఉపాధ్యాయురాలు శాంతి ప్రియ గార్ల పైన అదే గ్రామంలోని నాగేంద్ర అనే వ్యక్తి మద్యం సేవించి నాడు నేడు పనులకు సంబంధించి వచ్చిన నిధుల్లో తనకు కూడా వాటా ఇవ్వాలి అని,లేని పక్షంలో మీ అంతు చూస్తా అని ఉపాధ్యాయుల పైన బెదిరింపులకు పాల్పడడం జరిగిందని,గతంలో కూడా ఇదే వ్యక్తి సదరు ప్రధానోపాధ్యాయుల పైన దాడికి పాల్పడటం జరిగిందని అప్పుడు కూడా పోలీసు వారికి విషయాన్ని తెలిపినా కూడా మళ్లీ కూడా ఈరోజు బెదిరింపులకు పాల్పడటం జరిగిందని ఇటువంటి ఘటనలు జిల్లాలో ఏ పాఠశాలల్లో కూడా జరగకూడదు అని,దాడి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని కర్నూల్ జిల్లా ఎ పి సి వేణుగోపాల్ గారికి వినతిపత్రం అంద చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు నాగమణి,ప్యాపిలి ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి,మండల సీనియర్ నాయకులు శ్రీధర్ రాజు,మంజుల తదితరులు పాల్గొన్నారు..ప్రజానేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి.