Header Top logo

“చదవడం మాకిష్టం”కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి

ఎమ్మిగనూరు పట్టణంలో టౌన్ బ్యాంక్ సమీపం నందు ఉన్న గ్రంధాలయ శాఖ లో “చదవడం మాకిష్టం” అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రియతమ నాయకులు, రైతు బిడ్డ, నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి” గారు, ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యొక్క కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వీనియోగం చేసుకోవాలి. ఈ యొక్క పుస్తక పట్టణ ద్వారానే స్వామి వివేకానంద గారు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు, గాంధీ గారు మరియు అనేక మంది కవులు పరిజ్ఞానాన్ని సంపదించుకొని, మన దేశంలో మేదావులు దేశానికి వణే తెచ్చారు. అదేవిధంగా మీరు కూడా ఈ యొక్క గ్రంధాలయంలో ప్రతి రోజు ఒక గంట చదువుతూ మీ యొక్క పరిజ్ఞానాన్ని, మేదస్తును పెంపోందించుకోవాలని సూచించారు. ఈ గ్రంధాలయం అభివృద్ధి కి తోడుపాటు అందిస్తామని తెలియాజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయం సెక్రటరీ యన్.హరికృష్ణ గారు, బాలికల పాఠశాల ఉపాధ్యాయురాలు, సునీల్ కుమార్, టౌన్ బ్యాంక్ చైర్మన్ యూకె. రాజశేఖర్ గారు, సోషల్ మీడియా టీం సయ్యద్ చాంద్, మన్సూర్ బాషా, పట్టణ యువజన ప్రెసిడెంట్ నజీర్ ఆహ్మద్, వెంకట్ రెడ్డి, రంగన్న, ప్రభాకర్, రాజా రెడ్డి, దారాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ప్రజా నేత్ర రిపోర్టర్: ఎర్రకోట మహలింగ ప్ప.

Leave A Reply

Your email address will not be published.

Breaking